ఆలమూరు, కసునూరుపై సస్పెన్షన్‌ వేటు | Sakshi
Sakshi News home page

ఆలమూరు, కసునూరుపై సస్పెన్షన్‌ వేటు

Published Fri, Oct 7 2016 10:24 PM

ysrcp actions to party activists

– క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవు
–వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జ్‌ మిథున్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ


అనంతపురం : క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కారణంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికారప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి కసునూరు రఘనాథరెడ్డిపై ఆ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జ్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై వారు ఏదైనా సంజాయిషీ ఇవ్వాలనుకుంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ  ముందు చెప్పుకోవచ్చని సూచించారు. జిల్లాలో ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement