ఒక్క పింఛనూ కేటాయించలేదు | Sakshi
Sakshi News home page

ఒక్క పింఛనూ కేటాయించలేదు

Published Wed, Feb 1 2017 11:12 PM

ఒక్క పింఛనూ కేటాయించలేదు - Sakshi

– కమిషనర్‌ చాంబర్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ నిరసన
హిందూపురం అర్బన్‌ : ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్ల కేటాయింపులో వైఎస్సార్‌సీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని కౌన్సిలర్‌ ఆసీఫ్‌వుల్లా ఆవేదన చెందారు. ఈ మేరకు ఆయన బుధవారం కమిషనర్‌ చాంబర్‌ ఎదుట నిరసన చేపట్టారు. తాను ప్రాతినిథ్యం వహించే 30వ వార్డులో వందలాంది మంది అర్జీలు ఇచ్చినా ఒక్కరికీ పింఛన్‌ మంజూరు చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు.

అర్హులైన వృద్ధులు, వికలాంగులు అర్జీలు పెట్టుకుంటే ఒక్కరికీ ఇవ్వడం లేదన్నారు. ఎందుకింత వివక్ష చూపుతున్నారని నిలదీశారు. ఇంతలో కమిషనర్‌ విశ్వనాథ్‌ ఆయనకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినకుండా నినాదాలు చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అంజినప్ప, రెహెమాన్, నాయకులు రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement