'రూ.4 లక్షల కోట్లు అడిగితే..450 కోట్లిచ్చారు' | Sakshi
Sakshi News home page

'రూ.4 లక్షల కోట్లు అడిగితే..450 కోట్లిచ్చారు'

Published Thu, Aug 18 2016 7:18 PM

'రూ.4 లక్షల కోట్లు అడిగితే..450 కోట్లిచ్చారు' - Sakshi

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ...ఏపీకి కేంద్రం రూ.1976 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు.

రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులపై చంద్రబాబు మాట్లాడకపోవడం సరికాదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తక్షణం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకుంటున్నది ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని భూస్థాపితం చేయాలని చూస్తున్నాయని అంబటి మండిపడ్డారు. పోలవరం కుడికాల్వపై పట్టిసీమ నిర్మించి రూ.1600 కోట్లు చంద్రబాబు దోచుకున్నారన్నారు. ఇప్పుడు ఎడమకాల్వపై పురుషోత్తమపట్నం పేరుతో మళ్లీ దోపిడీకి తెరలేపారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే తప్ప ఏపీకి న్యాయం జరగదని ఆయన అన్నారు. నామ మాత్రపు నిధులిచ్చి ఏపీ ప్రజలను కేంద్రం అవమానించడం సరికాదన్నారు. హోదా లేదు, రాజధానికి నిధులు లేవు, పోలవరాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నిధులు కేటాయించి ఏపీని కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని అంబటి డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement