ధర్మాగ్రహం! | Sakshi
Sakshi News home page

ధర్మాగ్రహం!

Published Fri, Mar 3 2017 10:49 PM

ధర్మాగ్రహం! - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నా జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు కొనసాగించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం ముండ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువులతోపాటు గాయపడినవారిని పరామర్శించడానికి వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు బాధితులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. విజయవాడలో ధర్నా చౌక్‌ వద్దపోలీసులు ఓవర్‌యాక్షన్‌ చేశారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించారు.  

► నూజీవీడులోని సబ్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
► గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు పాల్గొని తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
► నందిగామలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యాన పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. కంచకచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
► మచిలీపట్నంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
► జగ్గయ్యపేటలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో «నిరసన ప్రదర్శన నిర్వహించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో నాయకులు ధర్నాలు చేశారు.
►  మైలవరంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన నిర్వహించారు.
► అవనిగడ్డలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌ ఆధ్వర్యంలో నాయకులు నల్లబ్యా డ్జీలు ధరించి ప్ల కార్లులు పట్టుకుని తాహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి.
► పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో తాహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. మున్సిపల్‌ చైర్మన్‌ బండారు ఆనందప్రసాద్, ఉప్పాల రాము పాల్గొన్నారు.  
► గుడివాడలో పార్టీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశిభూషన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోనూ స్థానిక నేతలు ధర్నాలు చేశారు.
► కైకలూరులో సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో నరసనలు తెలిపారు.
► పామర్రులోని నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్‌ సీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తోట్లవల్లూరు, పమిడిముక్కల, పెదపారుపూడి, మొవ్వ మండలాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
► పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్నాలు నిర్వహించారు. = తిరువూరు, విసన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లో ధర్నాలు జరిగాయి.

Advertisement
Advertisement