దాతల స్థానంలో కబ్జాకోర్లు | Sakshi
Sakshi News home page

దాతల స్థానంలో కబ్జాకోర్లు

Published Tue, Aug 11 2015 12:32 AM

దాతల స్థానంలో కబ్జాకోర్లు

సందర్భం
 
ముంబై పురపాలక సంస్థ 1888 నాటి శాసనం ద్వారా ఏర్పడక ముందే ఆ నగరం పలు సౌకర్యాలను అందించే వారి కోసం వెతికేది. ఇలా నగరానికి సహాయ పడినవా రిలో ఇద్దరు ఎన్నిక కాని నేత లు.. జంషెడ్‌జీ జేజేభాయ్, జగ్గునాథ్ సుంకర్‌సేట్ ఉన్నా రు. నగరానికి అవసరమైన ఆసుపత్రుల నుంచి కళాశా లలతోపాటు పలు సంస్థలను నిర్మించడంలో తోడ్ప డటంతో జేజేభాయ్ పేరిట పలు స్మారక స్థూపాలు వెలి శాయి. కాగా, సుంకర్‌సేట్ డబ్బు, భూములను ఇచ్చా రు. ముంబైలో తొలి రైల్వే మార్గాన్ని నిర్మిస్తున్నప్పుడు బుకింగ్ కార్యాలయం కోసం తన నివాసాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించారు కూడా.

దానశీలి అయిన సుంకర్‌సేట్ (1803-1865)ని పూర్తిగా విస్మరించారు. ఆయన జ్ఞాపకార్థం ఒక సరైన ప్లాట్ లేదా భూమిని కూడా ముంబై పురపాలక సంస్థ అందజేయలేకపోయింది. తాను జీవించిన శతాబ్దంలో మహాదాతగా వెలిగిన వ్యక్తిని గురించి దానికి పట్టింపు కూడా లేకుండా పోయింది. ఇది ఆయన 150వ వర్థంతి సంవత్సరం. విషాదం ఏమిటంటే పలుకుబడి గలవారు ప్రభుత్వ స్థలాలను కొల్లగొడుతుంటే పురపాలక సం స్థకు కించిత్ అభ్యంతరం కూడా ఉండదు.

జేజేభాయ్ ముంబై నగరానికి చేసిన సేవలతో సుప్రసిద్ధులయ్యారు. పలు ప్రజా సంస్థలను ఏర్పర్చ డంలో ఆయన అందించిన తోడ్పాటులో ‘జేజే’ ఒక భాగం. బ్రిటిష్ వారు ఆయనకు సర్ బిరుదును బహూ కరించారు. జీవించి ఉండగానే ఆయనను జ్యేష్ఠుడు అని ప్రకటించారు. ఇక సుంకరసేట్ విషయానికి వస్తే,  ఏషి యాటిక్ సొసైటీ మెట్లదారి వద్ద ఆయన భారీ విగ్ర హాన్ని నెలకొల్పి గౌరవించారు.

ముంబైలో పలు సంస్థలను నిర్మించడానికి వీరూ, ఇతరులూ చేసిన  సహాయాలు ఇప్పటికీ నగరంలో కని పిస్తుంటాయి. నెహ్రూ కోరికపై టాటాలు నిర్మించిన టీఐఎఫ్‌ఆర్ బహుశా వీటిలో చివరిది. కానీ ముంబై నగరం స్వభావం నేడు విషాదంగా మారిపోయింది. ఇది ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేవారి నగరంలా కాకుం డా, కబ్జా చేసుకునే వారి నగరంలా మారిపోయింది. పాలనాధికారులు, రాజకీయనేతల రూపంలో ఈ కబ్జా దారులు పుట్టుకొస్తున్నారు. బ్రిటిష్ హయాంలో శ్రేష్ట మైన నగరంగా వెలుగొందిన ముంబై నేడు దోచుకునే వారి పాడి ఆవుగా మారిపోయింది.

వలస ప్రజల వెల్లువతో స్వప్న నగరంగా భాసిల్లిన ముంబైని అప్పుడు, ఇప్పుడు అని పోల్చి చూడాలి. శతా బ్దం క్రితం చేతిలో నయాపైసా లేకున్నా, కేవలం కల లతో అడుగుపెట్టేవారికి ఈ పెద్ద నగరం విశాల హృద యంతో అక్కున చేర్చుకునేది. దేశంలోనే ఉత్తమ నగ రంగా ఉండేది. నగరంలోని పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందజేస్తూ, మానవ వనరుల అభివృద్ధి విధానా న్ని కలిగి ఉండేది. నగరం, దాని భవిష్యత్తు, అభివృద్ధి పైనే అందరూ దృష్టి పెట్టేవారు. అప్పట్లో పాఠశాలలకు వెళ్లే మొత్తం విద్యార్థులలో సగం మంది పురపాలక సంస్థ నిర్వహించే పాఠశాలల్లోనే చదువుకునేవారు.

ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో ఇ-ఎయిడ్స్ (సహా యకాలు)ని ఉపయోగించడం కోసం బిడ్ ప్రకటించి 25 వేల ట్యాబ్‌లెట్‌లను కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనిపై వస్తున్న ఆరోపణ ఏదంటే, శివసేన అజమాయి షీలో ఉన్న బృహన్ ముంబై పురపాలకసంస్థ ఈ ట్యాబ్ లెట్‌లను ఒక్కోదాన్ని రూ.6,850లకు కొనుగోలు చేసిం ది. వాస్తవానికి దాంట్లో సగం ధరకే అవి లభిస్తున్నాయి. అసలు కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసినవారికి రూ.8.5 కోట్లు దండుకునే అవకాశం లభించినట్లే. అలాంటి 11 వేల పాఠశాలల్లో ఉన్న 4.5 లక్షల మంది పిల్లలకు ట్యాబ్‌లను అందించినట్లయితే జరిగే మోసం స్థాయిని ఎవరైనా ఊహించుకోవచ్చు.

గ్రామపంచాయితీలు మొదలుకొని స్వయం పాల నా సంస్థల ప్రయోజనాలు గత కొన్ని దశాబ్దాలుగా ఎలా మారుతూ వస్తున్నాయో ఇది తెలియపరుస్తోంది. ముంబై పురపాలక సంస్థ ప్రస్తుతం శివసేన పాడి ఆవుగా మారిపోయిందంటే ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు. కొని చిన్న రాష్ట్రాల కంటే ఎక్కువ వార్షిక బడ్జెట్‌తో ఉన్న ముంబై పురపాలక సంస్థలో తమ పట్టు నిలుపుకు నేందుకు జరిగే పోటీ తీవ్రంగా ఉంటోందంటే ఆశ్చర్యం లేదు. పైగా, వివిధ స్థాయీ సంఘాలలో కీలక పదవుల కోసం జరిగే ప్రయత్నాలు కూడా అంతే బలంగా ఉంటు న్నాయి. పార్టీ బాస్‌లతో అంటకాగేవారికి మాత్రమే ఆ పదవులు అందుబాటులో ఉంటాయి. మరి పాడి ఆవులు నమ్మినబంట్ల చేతుల్లోనే ఉండాలి కదా!

రహదారులనే తీసుకోండి. రుతుపవనాలు మొద లయ్యే తొలిదినాల్లో కురిసే వర్షపుజల్లులకే ముంబై రహ దారులు కకావికలమవుతుంటాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే రహదారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. నాసి రకం రహదారులే దీనికి కారణం. కాంట్రాక్టర్లు తక్కువ ధరకు బిడ్ దాఖలు చేస్తారు, దురాశాపరులకు చెల్లింపు లు చేస్తుంటారు కాబట్టే నాణ్యత ఉండదు. ఎక్కడ చూసి నా గుంటలే ఉంటాయి. కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నప్పటికీ కొత్త పేర్లతో బిడ్డింగ్ దాఖలు చేయనీ కుండా వారిని ఎవరూ ఆపలేరు. హైకోర్టు నాణ్యత గురించి ఆదేశాలు జారీ చేస్తుంటుంది కానీ, పురపాలక సంస్థ వాటిని లెక్కలోకి కూడా తీసుకోదు.

అలాగే రుతుపవనాలకు ముందు మురికి కాలువ ల పూడిక తీయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ముం బై నగరంలో వరద వెల్లువెత్తుతుంటుంది. ప్రతి ఏటా కాంట్రాక్టులను మంజూరు చేస్తారు. పని మాత్రం జర గదు. చెల్లింపులు మాత్రం జరిగిపోతుంటాయి. మురికి నీరు పైకి పొంగటం అనేది కాంట్రాక్టర్ల లోపాలనే ఎత్తి చూపుతున్నప్పటికీ వర్షాలతో సమస్తమూ కొట్టుకుపో తుందని బిడ్ దాఖలు చేసేవారి పరమ విశ్వాసం మరి. బహుశా ఈ ప్రక్రియ వచ్చే సంవత్సరం, ఆ వచ్చే ఏడా ది కూడా పునరావృతమవుతూనే ఉంటుంది. ముంబై పురపాలక సంస్థలో జరుగుతున్న ఇలాంటి అక్రమాల జాబితాను ఇంకా చూపించవచ్చు. కానీ దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదన్నదే వాస్తవం.


 
మహేష్ విజాపుర్కార్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
 ఈమెయిల్: mvijapurkar@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement