జీవశాస్త్రం | Sakshi
Sakshi News home page

జీవశాస్త్రం

Published Sun, Jan 5 2014 10:48 PM

జి శ్రీనివాస్ - Sakshi

    శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు
     రాబర్‌‌ట కోచ్: క్షయ, కలరా వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే క్రిములు, రోగ లక్షణాలు, నివారణలను తెలిపాడు.
     ఆండ్రియస్ వెసాలియస్: మానవ శరీర నిర్మాణాన్ని కనుక్కున్నాడు.
     చార్లెస్ డార్విన్: జీవ పరిణామ సిద్ధాంతం.
     {Vెగర్ మెండల్: అనువంశిక సిద్ధాంతం.
     అలెగ్జాండర్ ఫ్లెమింగ్: పెన్సిలిన్ ఆవిష్కర్త.
     ఎంవోపీ అయ్యంగార్: థాలోఫైటా మొక్క లపై పరిశోధన, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ.
     జె.సి.బోస్: క్రెస్కోగ్రాఫ్ (మొక్కల పెరుగుదలను గుర్తించే పరికరం)
     జకారియస్ జాన్సన్: సంయుక్త సూక్ష్మదర్శిని
     హరగోవింద్ ఖొరానా: కృత్రిమ జన్యు సంశ్లేషణ
     బీర్బల్ సహాని: సెలైన్ సిరీస్ ఆఫ్ ది సాల్ట్‌రేంజ్, ఖండాల కదలిక సిద్ధాంతం, వివృతబీజ మొక్కల శిలాజాలు
     పంచానన్ మహేశ్వరి: వృక్షాల ఆధునిక పిం డోత్పత్తి శాస్త్ర పిత. పరస్థానిక ఫలదీకరణం.
     ఎం.ఎస్. స్వామినాథన్: హరిత విప్లవ కారకుడు. సంకరజాతి వంగడాల సృష్టికర్త.
     సలీం అలీ: భారత పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్).
     వాట్సన్, క్రిక్: డీఎన్‌ఏ ద్వికుండలి నిర్మాణం. అణుజీవ శాస్త్రానికి పునాదులు వేశారు.
     ఎల్లాప్రగడ సుబ్బారావు: అద్భుత ఔషధ సృష్టికర్త. ఫోలికామ్లం, టెట్రాసైక్లిన్/ ఆరియోమైసిన్‌ల ఆవిష్కర్త.
     రోనాల్డ్‌రాస్: మలేరియా వ్యాప్తి దోమల ద్వారా జరుగుతుందని కనుక్కున్నాడు. నోబెల్ బహుమతి గ్రహీత(1902). సికిం ద్రాబాద్‌లో తన పరిశోధనలు చేశాడు.
     మార్సిల్లో మాల్ఫీజి: గుండెకు రక్తం అందే విధానాన్ని కనుక్కున్నాడు.
     ఏ విలియం హార్వే.. గుండె పనిచేయడానికి రక్త ప్రసరణ ముఖ్యమని ప్రయోగ పూర్వకంగా చెప్పాడు. కానీ రక్తం గుండెకు ఎలా చేరుతుందో తెలపలేదు.
     లూయీ పాశ్చర్:
     గాలి, నీరు, నేలలోని సూక్ష్మజీవుల ఉనికిని రుజువు చేశాడు.
     గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా.
     రేబీస్ వ్యాధికి టీకాను 1885లో కనుక్కున్నాడు.
     {Mిమి సిద్ధాంతం లేదా జెర్‌‌మథియరీని ప్రతిపాదించాడు.
     సూక్ష్మజీవులు ద్రాక్షరసాన్ని పులిసేలా చేస్తాయని నిరూపించాడు.
     పట్టుపురుగు గుడ్లను సూక్ష్మజీవులు పాడు చేస్తాయని కనుక్కున్నాడు.
     పాలను నిల్వచేసే పద్ధతి పాశ్చరై జేషన్‌ను కనుక్కున్నాడు.
     పాశ్చరైజేషన్: పాలను 72నిఇ వరకు వేడి చేసి 15 సెకన్లు ఉంచి వెంటనే 10నిఇ వరకు చల్లార్చి నిలువ చేస్తారు.
     లివెన్‌హుక్: బ్యాక్టీరియాలను వర్ణించిన శాస్త్రజ్ఞుల్లో ప్రథముడు. ఏకకటక సూక్ష్మదర్శినిని కనుక్కున్నాడు.
     అరిస్టాటిల్: జీవశాస్త్ర పిత. మొదటిసారి శాస్త్రీయంగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నం చేశారు. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికారు.
 
 జంతువుల వర్గీకరణ
 
 పృష్ట వంశం ఆధారంగా జంతువులను అకశేరుకాలు, సకశేరుకాలుగా వర్గీకరించారు
 అకశేరుకాలు- వర్గీకరణ:
 జంతురాజ్యంలో 95 శాతం అకశేరుకాలే. వీటిని ప్రధానంగా 9 వర్గాలుగా విభజించారు.
 ప్రోటోజోవా: ఏకకణ జీవులు
 ఉదా: అమీబా, పారామీషియం
 పొరిఫెరా: సరళ బహుకణ జీవులు  చలనాన్ని చూపవు.
 ఉదా: స్పాంజీలు(స్పంజికలు)
 సీలింటరేటా: ద్విస్తరిత బహుకణ జీవులు. నోటిచుట్టూ టెంటకిల్సు అనే నిర్మాణాలుంటాయి.
 ఉదా: హైడ్రా, ఒబీలియా, జెల్లీచేప
 ప్లాటీహెల్మింథిస్: త్రిస్తరిత బహుకణ జీవులు. శరీరం రిబ్బనులా బల్లపరుపుగా ఉంటుంది.
 ఉదా: పనేరియా, బద్దెపురుగు
 నిమాటి హెల్మింథిస్: త్రిస్తరిత బహుకణ జీవులు. శరీరం పొడవుగా, దారంలా ఉంటుంది.
 ఉదా: ఏలికపాము/ఆస్కారిస్
 అనెలిడ: వలయాకార ఖండితాలను కలిగిన స్తూపాకార దేహం ఉంటుంది.
 ఉదా: వానపాము, జలగ
 ఆర్థ్రోపొడ: అతుక్కుని ఉండే కాళ్లు కలిగిన జీవులు. శరీరం తల, రొమ్ము, ఉదరం అనే భాగాలుగా ఉంటుంది.
 ఉదా: కీటకాలు (బొద్దింక, సీతాకోకచిలుక)
 మొలస్కా: శరీరం మెత్తగా ఉంటుంది. దేహాన్ని ఆవరించి ఇ్చఇై3 కర్పరం ఉంటుంది.
 ఉదా: నత్తగుల్ల, ఆల్చిప్ప
 ఇఖైనోడర్మట: శరీరంపై ముళ్లలాంటి నిర్మాణాలుంటాయి. ఉదా: సముద్ర అర్చిన్, సముద్రనక్షత్రం
 టీనోఫొరా: ఉదా: మూన్‌జెల్లి
 
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    హెచ్‌ఐవీ సంక్రమించడానికి ప్రధాన కారణం?    (వీఆర్‌ఏ-2012)
 జ.    అరక్షిత విచ్చలవిడి శృంగారం
 2.    మెదడువాపు వ్యాధి దేనివల్ల కలుగుతుంది?    (వీఆర్‌ఏ-2012)
 జ.    వైరస్
 3.    రేబీస్ వ్యాధికి టీకాను కనుక్కున్న సంవత్సరం?
 జ.    1885
 4.    మొక్కలపై దాడిచేసే వైరస్‌లను ఏమంటారు?    (వీఆర్‌వో-2012)
 జ.    పైటోఫేజ్
 5.    పశువుల్లో ఫుట్, మౌత్ వ్యాధి దేనివల్ల వస్తుంది?    (వీఆర్‌వో-2012)
 జ.    వైరస్
 6.    అన్ని రకాల వాతావరణాల్లో నివసించే సూక్ష్మజీవులు?
 జ.    బాక్టీరియా
 7.    సజీవులకు, నిర్జీవులకు మధ్య సంధానకరంగా ఉండే సూక్ష్మజీవులు?
 జ.    వైరస్
 8.    జంతురాజ్యంలో ఎక్కువ జీవులు ఏ వర్గానికి చెందినవి?
 జ.    ఆర్థ్రోపొడ
 9.    బీసీజీ వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణలో వాడతారు?     
 జ.    క్షయ
 10.    దోమకాటు వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి?
 జ.    మెదడు వాపు
 11.    గొర్రెల్లో ఆంత్రాక్స్ వ్యాధి దేనివల్ల కలుగుతుంది?
 జ.    బాక్టీరియా
 12.    {Mిమిసిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
 జ.    లూయి పాశ్చర్
 13.    అద్భుత ఔషధ సృష్టికర్తగా     పేరొందిన శాస్త్రవేత్త?
 జ.    వై. సుబ్బారావు

Advertisement
Advertisement