ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కెరీర్ అవకాశాలు.. | Sakshi
Sakshi News home page

ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కెరీర్ అవకాశాలు..

Published Thu, Jan 16 2014 2:47 PM

Career Counselling: Ask the expert

టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
 
 ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌ను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
 - ప్రవీణ్, నల్లగొండ.
 స్టాటిస్టిక్స్.. న్యూమరికల్ డేటా సేకరణ, నిర్వహణ, విశ్లేషణకు సంబంధించినది. దీని అప్లికేషన్స్‌ను ఇన్సూరెన్స్, ఫైనాన్స్, మెడిసిన్, సైకాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ తదితర విభాగాల్లో ఉపయోగిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో స్టాటిస్టిక్స్ బాగా ఉపయోగపడుతుంది.
 ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా.. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అడ్వాన్స్‌డ్ ప్రాబబిలిటీ, యాక్చూరియల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ తదితర స్పెషలైజేషన్లతో కోర్సు అందుబాటులో ఉంది. అకడమిక్ రికార్డ్‌తో పాటు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.isical.ac.in
 ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్‌తో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. స్టాటిస్టిక్స్; అప్లైడ్ స్టాటిస్టిక్స్; స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఏ లేదా బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: svuniversity.ac.in
 కెరీర్: స్టాటిస్టిక్స్‌లో పీజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అనలిస్ట్, స్టాటిస్టికల్ ఇన్‌స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ తదితర అవకాశాలను అందుకోవచ్చు. ప్రైవేటు రంగంలో మార్కెటింగ్ సంస్థలు, మార్కెట్ రీసెర్చ్ కన్సల్టెన్సీలు, మార్కెటింగ్- ఆర్ అండ్ డీ విభాగాలు, విద్యాసంస్థల్లో ఉన్నత అవకాశాలు అందుబాటులో ఉంటాయి.
 
 బార్క్ అందిస్తున్న పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల వివరాలు తెలియజేయండి?
 - నాగార్జున, సూర్యాపేట.
 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్- ముంబై).. భారత్‌లో రేడియేషన్ రక్షణ, మౌలిక వసతులను పటిష్టం చేసేందుకు పరిశోధనలు చేపడుతోంది. రేడియేషన్ భద్రతకు సంబంధించి మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు పలు కోర్సులను ఆఫర్ చేస్తోంది. రేడియేషన్, రేడియో ఐసోటోపుల వివిధ అనువర్తనాల నియంత్రణ అవసరాలను తీర్చేలా ఈ ప్రోగ్రామ్‌లకు రూపకల్పన చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సుల కరిక్యులంలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
 బార్క్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్‌ను అందిస్తోంది. అర్హత: ఎంఎస్సీ ఫిజిక్స్. ఈ కోర్సును ఏడాది కాల వ్యవధితో అందిస్తున్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ).. ఆర్‌ఎస్‌వో లెవెల్-3 సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తారు.    
 వెబ్‌సైట్: barc.gov.in
 
 ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కెరీర్ అవకాశాలను తెలపగలరు?
 - నీలిమ, రాజమండ్రి.
జియో ఫిజిక్స్ అనేది ఎర్త్ సైన్స్‌లో ప్రత్యేక విభాగం. ఇది భూమి, భూ అంశాల స్వభావాన్ని వివరిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎర్త్‌సైన్స్, ఐఐటీ బాంబే.. ఎంఎస్సీ- అప్లైడ్ జియో ఫిజిక్స్‌లో ఎంఎస్సీని ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్/ఫిజిక్స్‌తో పాటు జియాలజీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సెన్సైస్‌లో ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేయాలి. జామ్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 
 వెబ్‌సైట్: www.iitb.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. జియో ఫిజిక్స్‌లో ఎంఎస్సీ (టెక్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో బీఎస్సీ.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్- ధన్‌బాద్.. మూడేళ్ల కాల వ్యవధితో టెక్ ఇన్ అప్లైడ్ జియో ఫిజిక్స్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in
 ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 కెరీర్: జియో ఫిజిక్స్ ప్రొఫెషనల్స్‌కు ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలలో ఉన్నత అవకాశాలుంటాయి. ఎన్‌జీఆర్‌ఐ, ఓఎన్‌జీసీ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వంటివి జియో ఫిజిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి.
 
 విప్రో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అకాడమీ (WiSTA) కోర్సుల వివరాలు తెలియజేయండి?
 - అనిత, గుంటూరు.
 విప్రో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అకాడమీ (WiSTA).. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ ప్రోగ్రామ్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కాల వ్యవధి నాలుగేళ్లు. ఇది ఒకవైపు ఆర్జిస్తూ మరోవైపు చదువుకునేందుకు వీలుకల్పించే ప్రోగ్రామ్. కోర్సు పూర్తయిన తర్వాత విట్ యూనివర్సిటీ-వెల్లూరు నుంచి డిగ్రీ అందుతుంది.
 అర్హత: గ్రాడ్యుయేషన్
 ప్రవేశాలు: ఎంట్రన్స్ టెస్ట్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
 
 ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?    
 - దివాకర్, కర్నూలు.
 
 ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంటెక్‌ను అందిస్తున్న సంస్థలు:
 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 జేఎన్‌టీయూ, హైదరాబాద్.
 వెబ్‌సైట్: www.jntuh.ac.in
 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
 వెబ్‌సైట్: svuniversity.ac.in
 కెరీర్: ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలి కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

Advertisement
Advertisement