రాష్ట్రంలో ఎన్ని టైగర్ రిజర్వులున్నాయి? | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఎన్ని టైగర్ రిజర్వులున్నాయి?

Published Thu, Apr 17 2014 9:43 PM

రాష్ట్రంలో ఎన్ని టైగర్ రిజర్వులున్నాయి? - Sakshi

పర్యావరణం - జీవ వైవిధ్యం
 
 1.  ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన మెగా బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారత్ స్థానం?
     ఆరో స్థానం (మొదటిది ఆస్ట్రేలియా)
 
 2.    గ్రీన్ హౌస్ ఉద్గారాల నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
     క్యోటోప్రోటోకాల్
 
 3.    తలసరి గ్రీన్‌హౌస్ ఉద్గారాల విడుదలలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
     ఖతర్
 
 4.    యునెటైడ్ నేషన్‌‌స ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రా మ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
     నైరోబీ (కెన్యా)
 
 5.    రాష్ట్రంలో ఎన్ని టైగర్ రిజర్వులున్నాయి?
     రెండు
     1.    రాజీవ్‌గాంధీ/నాగార్జున సాగర్ టైగర్ రిజర్‌‌వ
     2.    కవాల్ టైగర్ రిజర్‌‌వ
 
 6.    నేషనల్ బోర్‌‌డ ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్?
     ప్రధానమంత్రి
 
 7.    2010 లెక్కల ప్రకారం భారత్‌లో పులుల సంఖ్య?
     1706
 
 8.    ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం?
     భారత్
 
 9.    చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
     రామ్సార్ ఒప్పందం
 
 10.    వలస పక్షుల సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
     బాన్ కన్వెన్షన్
 
 11.    ప్రపంచంలో ఏర్పాటైన భారీ భవిష్య విత్తన నిధి?
     స్వాల్‌బార్‌‌డ దీవిలోని సీడ్ వాల్ట్
 
 12.    2013లో క్రిటికల్లీ ఎండేంజర్‌‌డ జాబితాలో గుర్తించిన బట్టమేక పక్షి (ఎట్ఛ్చ్ట ఐఛీజ్చీ ఆఠట్ట్చటఛీ) శాస్త్రీయ నామం?
     ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్
 
 13.    జీవ వైవిధ్య పరిరక్షణకు ఏర్పాటైన కన్వెన్షన్ బయలాజికల్ డైవర్సిటీ (ఇఆఈ) ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
     29 డిసెంబరు 1993
 
 14.    శరీరంలోకి కాలుష్య కారకంగా ప్రవేశించిన సీసం దేని ఉత్పత్తిని నిరోధిస్తుంది?
     హీమోగ్లోబిన్
 
 15.    మిథైల్ మెర్క్యూరీతో కలుషితమైన చేపలను తినడం ద్వారా వచ్చే పక్షవాత వ్యాధి?
     మినిమట వ్యాధి
 
 16.    ఏ భారలోహం కాలుష్యం ద్వారా మనిషిలో ఇటామి-ఇటామి వ్యాధి సంభవిస్తుంది?
     కాడ్మియం
 
 17.    ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన కాలుష్య కారకాలు?
     సల్ఫర్ డై ఆక్సైడ్, నత్రజని ఆక్సైడ్‌లు
 
 18.    శీతోష్ణస్థితి మార్పుపై అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనాలు నిర్వహిస్తున్న ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్) ఎప్పుడు ఏర్పాటైంది?
     1988
 
 
 19.    ఐపీసీసీ చైర్మన్ ఎవరు?
     భారత్‌కు చెందిన రాజేంద్ర కుమార్ పచౌరీ
 
 20.    భారత్‌లో భవిష్య విత్తన నిధిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
     జమ్మూ అండ్ కాశ్మీర్‌లో లఢక్‌లోని లేహ్ వద్ద
 
 21.  ప్రపంచంలోని అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది?
     రాయల్ బొటానికల్ గార్డెన్, క్యూ, లండన్
 
 22.    భారత్‌లో ఎన్ని బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్‌ను గుర్తించారు?
     మూడు. పశ్చిమ కనుమలు, హిమాలయాలు, ఇండోబర్మా
 
 23.    అచాన్‌కమర్ అమర్‌కంటక్ బయోస్ఫియర్ రిజర్‌‌వ ఏ రాష్ర్టంలో ఉంది?
     చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్
 
 24.    సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్‌‌వ ఏ రాష్ర్టంలో ఉంది?
     ఒడిశా
 
 25.    ఏ జంతు సంరక్షణకు ఒడిశాలో గహిర్‌మాతా బీచ్ సాంక్చుయరీ ఏర్పాటు చేశారు?
     ఆలివ్ రిడ్లీ టర్టల్
 
 26.    అరుణాచల్ ప్రదేశ్, కేరళల రాష్ర్ట పక్షి?
     {Vేట్ హార్‌‌నబిల్
 
 27.    బక్సాటైగర్ రిజర్‌‌వ ఎక్కడ ఉంది?
     పశ్చిమ బెంగాల్
 
 28.    ఏ మూడు రాష్ట్రాల్లో నీలగిరి బయోస్ఫియర్ రిజర్‌‌వ ఉంది?
     కేరళ, తమిళనాడు, కర్ణాటక
 
 29.    ఆహార పదార్థాల ప్యాకేజింగ్ మెటిరియల్స్‌లోని హానికర రసాయనం బీపీఏ అంటే?
     బిస్‌ఫినాల్ - ఎ
 
 30.    దేశంలో సింహాలను ఎక్కడ సంరక్షిస్తున్నారు?
     గిర్ అడవులు, గుజరాత్
 
 31.    ఉత్తరప్రదేశ్ రాష్ర్ట పక్షి?
     సారస్ క్రేన్
 
 32.    చింపాంజీ, గొరిల్లా, గిబ్బన, ఒరంగూటాన్ లాంటి ఏప్స్ అనే జంతువుల్లో భారత్‌లో కనిపించేది?
     హూలాక్ గిబ్బన్
 
 33.    పశువులో వాడే ఏ వాపు నివారణ ఔషదం ద్వారా దేశంలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గింది?
     డైక్లోఫినాక్
 
 34.    గంగానది డాల్ఫిన్ శాస్త్రీయ నామం?
     ప్లటనిస్టా గాంజిటిక
 
 35.    క్యాన్సర్‌కు కారణమయ్యే భార లోహం?
     ఆర్సినిక్
 
 36.    భూతాపానికి కారణమవుతున్నట్లుగా ఐపీసీసీ గుర్తించిన ప్రధాన గ్రీన్‌హోస్ ఉద్గారాలు?
     కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, పర్‌ఫ్లోరోకార్బన్ (PFC), హైడ్రోఫ్లోరోకార్బన్ (HFC), సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF6)
 
 37.    శీతోష్ణస్థితి మార్పునకు చెందిన సభ్యదేశాల 19వ వాతావరణ సదస్సు(COP-19)ను గతేడాది ఎక్కడ నిర్వహించారు?
     వార్సా (పోలెండ్)
 
 38.    దేశంలోని ఏ ప్రాంతంలో ప్రత్యేకంగా లయన్ టెయిల్‌డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది?
     పశ్చిమ కనుమలు
 
 39.    అంతరించే ప్రసారమున్న జీవజాతుల జాబితా రెడ్ లిస్ట్‌ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ?
     ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ నేచర్ అండ్  నేచురల్ రిసోర్సెస్ (IUCN)

 40.  ప్రకృతిలో దీర్ఘకాలం పాటు చెక్కు చెదరకుండా ఉండే కర్బన వ్యర్థాల నివారణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
     స్టాక్‌హోం కన్వెన్షన్
 
 41.    క్యోటో ప్రొటోకాల్ తొలుత ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
     2005 ఫిబ్రవరి 16
 
 42.    ఓజోన్ పరిరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
     మాంట్రియాల్ ప్రోటోకాల్
 
 43.   ప్రపంచ జీవ వైవిధ్య దినం?
     మే 22
 
 44.    అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం?
     సెప్టెంబరు 16
 
 45.    ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన బయోస్ఫియర్ రిజర్‌‌వల నెట్‌వర్‌‌కను ఏర్పర్చేది?
     యునెస్కో
 
 46.    తిమింగలాల వేటను నిరోధించడానికి ఏర్పాటైన అంతర్జాతీయ సంఘం?
     ఇంటర్నేషనల్ వాలింగ్ కమిషన్, కేంబ్రిడ్‌‌జ, ఇంగ్లండ్
 
 47.    అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం మనుగడ సాగించే లెకైన్ అనే జీవులు ఏ భిన్న జీవుల సహజీవనం ద్వారా ఏర్పడతాయి?
     శైవలం, శిలీంధ్రం
 
 48.    ఎల్లో స్టోన్ నేషనల్ పార్‌‌క ఏ దేశంలో ఉంది?
     అమెరికా
 
 49.    ఏ ఉభయచర జీవిని ప్రవేశపెట్టడం ద్వారా ఆస్ట్రేలియాలో జీవవైవిధ్యం నష్టం సంభవిస్తుంది?
     అమెరికన్ కేన్‌టోడ్
 
 50.    దేశవ్యాప్తంగా విస్తరిస్తూ అటవీ వైవిధ్యాన్ని నష్టపరుస్తున్న కలుపు మొక్కలు?
     పార్థీనియం హిస్టీరోఫోరస్ (వయ్యారిభామ), లాంటాన్ క్యామర
 
 51.    ఒక వ్యక్తి తన శక్తి వినియోగ చర్యల ద్వారా విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ మోతను ఏమంటారు?
     కార్బన్ ఫూట్‌ప్రింట్
 
 52.    తేలియాడే జాతీయ పార్కు (Floating National Park)గా ప్రసిద్ధి గాంచింది?
     కేబుర్ లామ్‌జావో జాతీయ పార్కు (మణిపూర్)
 
 53.    మారిషస్‌లో అంతరించిన పక్షి?
     డాడో (పాసింజర్ పక్షి)
 
 54.    కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జీవ జాతులను ఏమంటారు?
     ఎండమిక్ (స్థానీయ) జాతీయ
 
 55.    పత్రిధూళి అలర్జీ ద్వారా వచ్చే ఉపిరితిత్తుల క్షీణత వ్యాధి?
     బెస్సైనోసిస్
 
 56.    ఇనుముధూళి అలర్జీ ద్వారా వచ్చే ఉపిరి తిత్తుల క్షీణత వ్యాధి?
     సిడరోసిస్
 
 57.   ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవాళ భిత్తిక (Coral Reef)?
     ఈశాన్య ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బ్యారియర్ రిఫ్
 
 58.    పన్నా బయోస్ఫియర్ రిజర్‌‌వ ఎక్కడ ఉంది?
     మధ్యప్రదేశ్
 
 59.    జాతీయ వారసత్వ జంతువు?
     ఆసియా ఏనుగు (Elephas Maximus) ఎలిఫస్ మాక్సిమస్
 
 60.    దేశాల సరిహద్దుల ద్వారా సాగే హానికర పదార్థాల రవాణాను అడ్డుకునే అంతర్జాతీయ ఒప్పందం?
     బేసల్ కన్వెన్షన్
 
 61.    అంతర్జాతీయ జీవ వైవిధ్య సంరక్షణ ఒప్పందానికి చెందిన సభ్యదేశాల 12వ సమావేశం (COP–12) ఈ ఏడాది ఎక్కడ జరగనుంది?
     దక్షిణ కొరియా
 
 62.    ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది?
     ఎ.జి. టాన్‌‌సలే
 
 63.    జీవావరణ పిరమిడ్ అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది?
     చార్లెస్ ఎల్టన్
 
 64.    రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్యనున్న పరివర్తన ప్రాంతం?
     ఎకోటోన్
 
 65.    ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం?
     ఆహార శృంఖలు
 
 66.    ఆవరణ వ్యవస్థలోని ప్రధాన విచ్ఛిన్నకారులు?
     శిలీంధ్రాలు
 
 67.    పోషణపరంగా మానవుడు ఒక?
     సర్వభక్షకుడు
 

Advertisement
Advertisement