ఇండియన్ ఆర్మీ | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఆర్మీ

Published Wed, Nov 2 2016 4:04 AM

ఇండియన్ ఆర్మీ

ఇండియన్ ఆర్మీ.. 125వ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సులో ప్రవేశాలకుఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ (పురుషులు) నుంచి దరఖాస్తులుఆహ్వానిస్తోంది. విజేతలుగా నిలిచినవారిని ఇండియన్ మిలిటరీ
 అకాడమీ (డె హ్రాడూన్)లో శిక్షణనిచ్చి ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్‌కమిషన్‌కు ఎంపిక చేస్తారు.
 
 మొత్తం ఖాళీలు: 40
     విభాగాలవారీగా ఖాళీలు
 
 సివిల్ - 11   మెకానికల్ - 4
 ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ - 5
 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫోటెక్/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) - 6
 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్ - 7
ఎలక్ట్రానిక్స్ - 2 ఠి  మెట్లర్జికల్ - 2
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ - 2
 మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్
         మైక్రోవేవ్ - 1
 అర్హత  భారతీయ పౌరులై ఉండాలి.
 సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫోటెక్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/మెట్లర్జికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్/మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ బ్రాంచ్‌ల్లో బీటెక్/బీఈ/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. ఫైనలియర్ చదివేవారూ అర్హులే.
వివాహిత/అవాహిత పురుషులు
     మాత్రమే అర్హులు.
   వయోపరిమితి
 జూలై 1, 2017 నాటికి 20 - 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
 
 శారీరక ప్రమాణాలు
 ఎత్తు 157.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషాలు ఉండరాదు.
 
 ఎంపిక
 ఇంజనీరింగ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇది ఐదు రోజులపాటు ఉంటుంది. ఇందులో విజయం సాధించినవారికి వెద్య పరీక్షలు నిర్వహిస్తారు.
 
 శిక్షణ
 అన్ని దశలను విజయవంతంగా ముగించుకున్నవారికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.21,000 స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. నెలకు రూ.15,600-రూ.39,100 (గ్రేడ్ పే రూ.5400) వేతన శ్రేణి ఉంటుంది. వీటితోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
 
 దరఖాస్తు విధానం
 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం:
 నవంబర్ 8, 2016
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
 డిసెంబర్ 7, 2016
 ఇంటర్వ్యూలు: జనవరి, ఫిబ్రవరి 2017
 వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
 

Advertisement
Advertisement