ఇండియన్ నేవీలో పైలట్ కొలువు | Sakshi
Sakshi News home page

ఇండియన్ నేవీలో పైలట్ కొలువు

Published Thu, Sep 25 2014 3:10 AM

ఇండియన్ నేవీలో పైలట్ కొలువు

అర్హత:అవివాహిత అభ్యర్థులు మాత్రమే అర్హులు. 70 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి). వయసు: 19 నుంచి 24 ఏళ్లు (జూలై 2, 1991- జూలై 1, 1996 మధ్యలో జన్మించి ఉండాలి). పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి (అబ్జర్వర్ కోసం పురుషులు, మహిళ అభ్యర్థులూ అర్హులే). నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలుండాలి.
 
 కమర్షియల్ పైలట్ లెసైన్స్ అభ్యరులు:
 అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి). వయసు: 19 నుంచి 25 ఏళ్లు (జూలై 2, 1990 - జూలై 1, 1996 మధ్యలో జన్మించి ఉండాలి). నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలుండాలి.
 
 ఎంపిక విధానం:
 వచ్చిన దరఖాస్తుల్లోంచి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి నిర్వహించే సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
 
 ఇంటర్వ్యూ:
 సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలను ఐదు రోజులపాటు డిసెంబర్, 2014-మార్చి, 2015 మధ్య నిర్వహిస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. అవి.. స్టేజ్-1: ఇందులో ఇంటలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ టెస్ట్, డిస్కషన్ టెస్ట్ వంటి పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు స్టేజ్-2 పరీక్షలకు హాజరు కావాలి. ఇందులో సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్క్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఈ దశల తర్వాత పైలట్ అభ్యర్థులకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఏవియేషన్ మెడికల్ ఎగ్జామినేషన్, అబ్జర్వర్ ఔత్సాహికులకు ఏవియేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే నిర్వహిస్తారు.
 
 శిక్షణ-కెరీర్:
 ఎంపికైన అభ్యర్థులకు షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా ఇస్తారు. వీరు 10 ఏళ్లపాటు నేవీలో సేవలందించాల్సి ఉంటుంది. తర్వాత నిబంధనల మేరకు సర్వీసును పొడిగిస్తారు. వీరిలో పైలట్ అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ-ఎజిమాలా (కేరళ)లో శిక్షణనిస్తారు. ఈ సమయంలో వీరికి సబ్ లెఫ్టినెంట్ హోదా ఇస్తారు. తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ/నేవల్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో రెండు దశల శిక్షణ ఉంటుంది. ఈ రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి పూర్తి స్థాయి పైలట్ బాధ్యతలు అప్పగిస్తారు. అబ్జర్వర్ అభ్యర్థులకు కూడా ఇండియన్ నేవల్ అకాడమీ-ఎజిమాలా (కేరళ)లో శిక్షణనిస్తారు. తర్వాత నేవల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఉంటుంది. కెరీర్ పరంగా ఉండే పదోన్నతులు, జీతభత్యాల వివరాలు..
 
 వీటికి తోడు వివిధ అలవెన్సులు అదనంగా లభిస్తాయి.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకున్న దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశిత చిరునామాకు పంపాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 3, 2014.  ప్రింట్ అవుట్ దరఖాస్తు, సంబంధిత సర్టిఫికె ట్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 13, 2014.  చిరునామా: పోస్ట్ బాక్స్ నెంబర్-2, సరోజినీ నగర్, న్యూఢిల్లీ-110023.
 
 ప్రైమ్‌మినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ డాక్టోరల్ రీసెర్చ్
 పరిశోధనల దిశగా విద్యార్థులను ప్రోత్సహించడం.. వారిలో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు వీలుగా ప్రైమినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్‌షిప్‌ను ప్రారంభించారు. ప్రైవేట్-పబ్లిక్ పార్టిసిపేషన్ (పీపీపీ) పద్ధతిలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్‌ఈఆర్‌బీ), కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) సంయుక్తంగా ఈ స్కాలర్‌షిప్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రైమినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ డాక్టోరల్ రీసెర్ పథకం కింద 100 ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ. 6 లక్షల మొత్తాన్ని స్కాలర్‌షిప్‌గా ఇస్తారు. ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. మిగతా 50 శాతాన్ని స్పాన్సర్ చేసే కంపెనీ మంజూరు చేస్తుంది.  అందిస్తున్న విభాగాలు: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్/మెడిసిన్. విద్యావేత్తలు, ప్రభుత్వ, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది. వీరికి స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి నెల వారీగా చెల్లిస్తారు.
 
 అర్హత:
  దరఖాస్తు చేసే నాటికి ఏదైనా గుర్తింపు ఉన్న భారతీయ యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్/రీసెర్చ్ లేబొరేటరీ నుంచి పీహెచ్‌డీలో చేరి 14 నెలలు అయి ఉండాలి. తన రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను ఆర్థికంగా, సాంకేతికంగా ఏదైనా ఒక పరిశ్రమ స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రీసెర్చ్ ప్రాజెక్ట్ నిర్దేశించిన ప్రమాణాలను కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు అవసరమైన పక్షంలో స్పాన్సర్ చేస్తున్న కంపెనీలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.చేపట్టే ప్రాజెక్ట్ కొత్త అంశానికి చెంది, సృజనాత్మకంగా ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.తుది గడువు: పీహెచ్‌డీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 14 నెలలలోపు. ఏడాది పొడవున ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 టీఐఎఫ్‌ఆర్.. గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్
 క్యాంపస్‌లు: ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణే.  అందిస్తున్న కోర్సులు:    పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సిస్టమ్ సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్).    ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ (ఫిజిక్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్)    ఎంఎస్సీ (బయాలజీ) కోర్సుల వ్యవధి: పీహెచ్‌డీ: ఐదేళ్లు; ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ: ఆరేళ్లు; ఎంఎస్సీ: మూడేళ్లు.
 
 అర్హతలు:
 పీహెచ్‌డీ మ్యాథమెటిక్స్ (ముంబై క్యాంపస్): సంబంధిత సబ్జెక్టుతో ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఏ/బీఏ/బీఎస్సీ. పీహెచ్‌డీ (బెంగళూరు క్యాంపస్): సంబంధిత సబ్జెక్టుతో ఎంఏ/ ఎంఎస్సీ/ఎంటెక్. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ: సంబంధిత సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ/బీఈ /బీటెక్. ఎంఎస్సీ విద్యార్థులు అర్హులు కాదు.
 
 పీహెచ్‌డీ (ఫిజిక్స్): ఎంఎస్సీ (ఫిజిక్స్)/బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్).
 ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: బీఎస్సీ/బీఈ/ఎంఈ/ఎంటెక్/ బీ.కెమ్ లేదా సైన్స్/ఇంజనీరింగ్/మెడిసిన్‌లో తత్సమాన డిగ్రీ.కెమిస్ట్రీ పీహెచ్‌డీ: ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ. సంబంధిత అంశాలపై చక్కని పట్టు ఉన్న బీఎస్సీ విద్యార్థులు కూడా అర్హులే.బయాలజీ పీహెచ్‌డీ: బేసిక్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ లేదా అప్లయిడ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంఎస్సీ-అగ్రికల్చర్, బీటెక్, బీఈ, బీవీఎస్సీ, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంఫార్మసీ తదితరాలు).
 
 ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పీహెచ్‌డీ: బ్యాచిలర్స్ ఇన్ బేసిక్ సైన్స్.
 కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్స్ (కమ్యూనికేషన్స్ అండ్ అప్లయిడ్ ప్రొబబిలిటీ): పీహెచ్‌డీ-బీఈ/బీటెక్/ఎంఈ/ ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/బీఎస్సీ. డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఈసీఈ/ఈఈఈ) ప్రతిభావంతులు కూడా అర్హులే.
 
 ఎంపిక విధానం:

 సైన్స్ ఎడ్యుకేషన్ మినహాయించి మిగిలిన సబ్జెక్టులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా 2015 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
 
 జేజీఈఈబీఐఎల్‌ఎస్:
 బయాలజీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షను జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్ సెన్సైస్ (జేజీఈఈబీఐఎల్‌ఎస్)గా వ్యవహరిస్తారు. ఈ పరీక్ష ద్వారా కే వలం టీఐఎఫ్‌ఆర్ క్యాంపస్‌ల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో బయాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అవి.. ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు- భోపాల్; కోల్‌కతా; మొహాలీ; పుణే; తిరువనంతపురం; సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) - హైదరాబాద్; సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ - హైదరాబాద్; నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ - మనేసర్; నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్-బెంగళూరు;
 
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ-న్యూఢిల్లీ; ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్-బెంగళూరు; నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్-పుణే; అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్-ముంబై; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-భువనేశ్వర్; రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ-ఫరీదాబాద్. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు జేజీఈఈబీఐఎల్‌ఎస్ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రవేశప్రక్రియలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.
 
 నేరుగా:
 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015 పరీక్షలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చక్కని స్కోర్ సాధించిన విద్యార్థులు సిస్టమ్ సైన్స్ విభాగంలో రాత పరీక్షతో నిమిత్తం లేకుండా పీహెచ్‌డీ కోర్సులకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా గేట్/నెట్/జెస్ట్ ఆధారంగా కూడా ఫిజిక్స్ విభాగంలో కొన్ని అడ్మిషన్లను స్వీకరిస్తారు.
 
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
     దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2014.
     {పవేశ పరీక్ష: డిసెంబర్ 14, 2014.
     ఫలితాల ప్రకటన: జనవరి 15, 2015
 

Advertisement
Advertisement