ఉద్యోగాలు

15 Nov, 2014 22:42 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ
 హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ జెనెటిక్స్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  ప్రాజెక్ట్ అసిస్టెంట్: 1
 అర్హత: జెనెటిక్స్/ బయోటెక్నాలజీలో 55 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి.
  టెక్నికల్ అసిస్టెంట్: 1
 అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 
 రైల్‌టెల్ కార్పొరేషన్
 రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  ఖాళీల సంఖ్య: 8
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు, ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి.
 వయసు: 21 - 28 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15
 వెబ్‌సైట్: http://railtelindia.com/
 
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
     డిప్యూటీ జనరల్ మేనేజర్: 8
     వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 45 ఏళ్లకు మించకూడదు.
     చీఫ్ మేనేజర్: 13
     సీనియర్ మేనేజర్ (డిజైన్): 28
     వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 48 ఏళ్లకు మించరాదు.
 ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: డిసెంబర్ 3
 వెబ్‌సైట్: www.halindia.com

మరిన్ని వార్తలు