ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Thu, Sep 18 2014 11:14 PM

jobs notifications

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
రాంచిలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ ఓవర్‌మెన్: 94
అర్హతలు: డీజీఎంఎస్ జారీచేసిన ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
మైనింగ్ సిర్దార్: 238
అర్హతలు: డీజీఎంఎస్ జారీ చేసిన మైనిం గ్ సిర్దార్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
డిప్యూటీ సర్వేయర్: 15
అర్హతలు: పదో తరగతితో పాటు డీజీఎంఎస్  జారీ చేసిన మైన్స్ సర్వే సర్టిఫికెట్ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16
వెబ్‌సైట్: http://ccl.gov.in/
 
సీడాక్
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్ట్ మేనేజర్: 1
ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 2
ప్రాజెక్ట్ అసోసియేట్/ప్రాజెక్ట్ అసిస్టెంట్: 4
ప్రాజెక్ట్ ఇంజనీర్ (మల్టీమీడియా): 1
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1
వెబ్‌సైట్: http://cdac.in/
 
సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్
భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్)
అర్హతలు: మెకానికల్/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం అవసరం.
మేనేజర్ (ప్రొడక్షన్)
అర్హతలు: టూల్ డిజైన్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. ఐదేళ్ల అనుభవం అవసరం.
సీనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్)
అర్హతలు: పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్/ప్రొడక్షన్ లేదా క్యాడ్-క్యామ్ ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31
వెబ్‌సైట్:  www.cttc.gov.in

Advertisement

తప్పక చదవండి

Advertisement