Sakshi News home page

పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ వివరాలు

Published Thu, May 29 2014 1:49 AM

Pearson Test of English details

ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?   -శ్రీను, కాగజ్‌నగర్. బయోఇన్ఫర్మాటిక్స్ సంబంధిత కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులకు బయోటెక్నాలజీ, ఫార్మాస్యుటికల్, బయో మెడికల్, హెల్త్ కేర్, హాస్పిటల్స్, పరిశోధన సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, క్లినికల్ ఫార్మాకాలజిస్ట్, అనలిస్ట్, కంప్యూటేషనల్ కెమిస్ట్, ఇన్ఫర్మాటిక్స్ డెవలపర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ప్రోగ్రామ్, సిస్టమ్స్ ఇంజనీర్, అప్లికెంట్ అనలిస్ట్, టెక్నికల్ సపోర్ట్, డేటాబేస్ డిజైన్,సైంటిస్ట్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు.


 ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
     ఐఐటీ-ఢిల్లీ; వెబ్‌సైట్: www.scfbioiitd.res.in
     ఐఐఐటీ-హైదరాబాద్; వెబ్‌సైట్: www.iiit.ac.in
     యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
     వెబ్‌సైట్: www.uohyd.ac.in
     ఐఐఐటీ-అలహాబాద్; వెబ్‌సైట్: http://bi.iiita.ac.in
 
 పీజీ (ఎకనామిక్స్) కోర్సు వివరాలను తెలపండి?
 -రవీందర్, ఆదిలాబాద్.
 ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ యుగంలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్, బహుళ అంతర్జాతీయ సంస్థల్లో ఎకనమిక్ అనలిస్ట్, కన్సల్టెంట్, రీసెర్చర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. సంబంధిత కోర్సులను పూర్తి చేసిన వారు సేల్స్, మార్కెటింగ్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, మార్కెట్ రీసెర్చ్, గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ రీసెర్చ్ వంటి రంగాల్లో వివిధ హోదాల్లో స్థిరపడొచ్చు. అయితే ఈ రంగాల్లో విజయవంతమైన కెరీర్‌కు పునాది వేసుకోవాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి.
 
  అవి..క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, తార్కిక విశ్లేషణ సామర్థ్యం, ఆశావహ దృక్పథం, కష్టించే తత్వం. ఎకనామిక్స్‌లో పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేయవచ్చు. మన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.osmania.ac.in), కాకతీయ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.kakatiya.ac.in), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.uohyd.ac.in), తెలంగాణ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.telanganauniversity. ac.in), ఆంధ్రా యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in)తోపాటు ఐఐటీ కాన్పూర్ (వెబ్‌సైట్: www.iitk.ac.in), ఐఐటీ మద్రాస్ (వెబ్‌సైట్: www.hss.iitm.ac.in), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (వెబ్‌సైట్: http://econdse.org) వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఎకనామిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.


 మ్యాథమెటిక్స్‌లో యూజీ, పీజీ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? కెరీర్ ఎలా ఉంటుంది?
  - వెంకట్, నిర్మల్
 మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు బీఎస్సీ (మ్యాథమెటిక్స్), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.అవి..
 
 ఉస్మానియా యూనివర్సిటీ(www.osmania.ac.in), ఆంధ్రా యూనివర్సిటీ (www.andhrauniversity. edu.in), శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (www. svuniversity.in), కాకతీయ యూనివర్సిటీ (www. kakatiya.ac.in), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (www.nagarjunauniversity. ac.in), శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (www.sssihl.edu. in).అర్హత: బీఎస్సీ కోర్సులకు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఎంఎస్సీ కోర్సులకు బీఎస్సీ (మ్యాథమెటిక్స్). ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి.
 
 కెరీర్: ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలు లేదా ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు హాజరు కావచ్చు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటే నెట్ ద్వారా పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు, బీపీవోల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. బోధన రంగంలో ఆసక్తి ఉంటే సంబంధిత రంగంలో లెక్చరర్‌గా కూడా స్థిరపడొచ్చు. అంతేకాకుండా షార్ట్ టర్మ్ కోర్సులు చేయడం వల్ల స్టాటిస్టిక్స్, కంప్యూటేషన్, ఆపరేషన్స్ రీసెర్చ్ ఎనలిస్ట్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఎనాలసిస్ సంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
 

Advertisement
Advertisement