కొలువుల కోర్సులు @ ఐటీఐ | Sakshi
Sakshi News home page

కొలువుల కోర్సులు @ ఐటీఐ

Published Mon, May 2 2016 3:32 AM

కొలువుల కోర్సులు @ ఐటీఐ

10క్లాస్ స్పెషల్
పదో తరగతి తర్వాత వృత్తి నైపుణ్యాలతోపాటు సత్వర ఉపాధి అందించగలిగే కోర్సు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ). ఈ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ సొంతమవుతారుు. ఈ నేపథ్యంలో ఐటీఐ కోర్సులపై ఫోకస్..
 
మన దేశంలో వచ్చే దశాబ్దంలో అదనంగా 80 లక్షల మంది ఉద్యోగ వేటలో ఉంటారని అంచనా.  అయితే వృత్తి నైపుణ్యాలు తక్కువగా ఉంటే ఉద్యోగం దొరకడం కష్టం. స్కిల్స్ లేని మానవ వనరులకు డిమాండ్ తక్కువ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశంపై ఐటీఐలు దృష్టి సారించాయి. కొద్దికాలంగా ఐటీఐ కోర్సుల పట్ల విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. కారణం కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి లభించడమే. జాబ్ లభించకుంటే సొంతంగా ఉపాధి పొందే వీలుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
 
ఐటీఐ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్
 ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో- టెలివిజన్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ - ఎరుుర్ కండీషనింగ్, వైర్‌మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోప్లాటర్, ఇన్‌స్ట్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, పెయింటర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్‌ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్) ఇంజనీరింగ్ ట్రేడ్‌‌సలో ఉన్నాయి.

వీటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అందిస్తున్నాయి. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్‌‌సలో.. స్టెనోగ్రఫీ, సెక్రెటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్‌మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోజర్, కార్పెట్ వేవింగ్ వంటి కోర్సులున్నాయి. ఇప్పుడు జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా అనేక కొత్త కోర్సులకు ఐటీఐలు రూపకల్పన చేస్తున్నాయి.
 
సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
ఐటీఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లుగా రూపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 500 ఐటీఐలను సీఓఈలుగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమలకు అవసరమైన విభిన్న నైపుణ్యాలతో 21 కోర్సులను రూపొందించారు.  సంప్రదాయ కోర్సులకు భిన్నంగా వీటిలో శిక్షణ ఉంటుంది.
 
ఉద్యోగావకాశాలెన్నో..
ఆర్టీసీ, ఇండియన్ రైల్వేస్, వివిధ పారిశ్రామిక సంస్థల్లో ఆయా విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అందుకోవచ్చు.

Advertisement
Advertisement