సింగరేణిలో 750 పోస్టుల భర్తీ | Sakshi
Sakshi News home page

సింగరేణిలో 750 పోస్టుల భర్తీ

Published Sat, Sep 23 2017 1:53 AM

Replace 750 posts in Singareni - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో 750 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కార్మికుల విభాగంలో 643, అధికారుల కేటగిరీలో 107 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటికి సంబంధించి శనివారమే నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించడంతో సింగరేణి యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.

ఆయా పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, పేస్కేలు, రోస్టర్, స్థానికత తదితర పూర్తి వివరాలను  ఠీఠీఠీ.టఛిఛిజీఝజీn్ఛట.ఛిౌఝ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే.. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్‌ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ పోస్టుల భర్తీతో సింగరేణిలో కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 7,198కి చేరనుందని పేర్కొన్నారు.

పోస్టుల వివరాలు
కార్మిక శ్రేణి విభాగంలో..
పోస్టులు                      సంఖ్య
ఫిట్టర్‌ ట్రైనీ                    288
ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ           143
అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ     69
టర్నల్‌/మెషినిస్ట్‌ ట్రైనీ        51
సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌)  35
అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌)    24
మౌల్డర్‌ ట్రైనీ                    24
మోటార్‌ మెకానిక్‌ ట్రైనీ        8
మౌల్డర్‌                          1

అధికార శ్రేణి కేటగిరీలో.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ
    ఈఅండ్‌ఎం                 68
    మైనింగ్‌                     37
    హైడ్రో జియాలజిస్టు        1
    జియో ఫిజిస్ట్‌               1

Advertisement
Advertisement