సోషల్ స్టడీస్- మెథడాలజీ టెట్ + డీఎస్సీ పేపర్ - 1 - 2 | Sakshi
Sakshi News home page

సోషల్ స్టడీస్- మెథడాలజీ టెట్ + డీఎస్సీ పేపర్ - 1 - 2

Published Mon, Sep 30 2013 10:31 PM

సోషల్ స్టడీస్- మెథడాలజీ     టెట్ + డీఎస్సీ     పేపర్ - 1 - 2

 1.    మానసిక చలనాత్మక రంగంలో ఉన్నత లక్ష్యం?     (టెట్ - జూలై 2011)
     1)    స్వభావీకరణ     2) న్యాయనిర్ణయం
     3)    సమన్వయం     4) ప్రేరణ
 
 2.    అభిరుచులను పెంపొందించుకోవడం అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ?
     1)    నిర్ధారించడం      
     2)    ఒక రూపం నుంచి మరో రూపానికి అనువదించడం
     3)    సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చల్లో పాల్గొని ఆనందించడం
     4)    జాతీయ పతాకం పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవడం
 
 3.    ఒక విద్యార్థి... మూడు రోజుల నివేదిక ఆధారంగా తర్వాత రోజు ఉష్ణోగ్రతను ఊహించగలిగే సామర్థ్యం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది?    (టెట్- జూలై 2012)
     1) జ్ఞానం     2) అభిరుచి
     3) వినియోగం     4) అవగాహన
 
 4.    జట్టు సభ్యులతో పనిచేసే సామర్థ్యం, ఇతర సభ్యుల సహకారం తీసుకోవడం ఏ రకమైన నైపుణ్యానికి సంబంధించినవి?                    
     1)    నిశిత ఆలోచన నైపుణ్యం
     2)    భావవ్యక్తీకరణ నైపుణ్యం
     3)    బౌద్ధిక నైపుణ్యం     
     4)    సాంఘిక నైపుణ్యం
 
 5.    ఇతరుల మాటలపై గౌరవం కలిగి ఉండడం ఏ బోధనా లక్ష్యానికి సంబంధించింది?
     1)    అవగాహన     2) వైఖరి
     3)    నైపుణ్యం     4) జ్ఞానం
 
 6.    ఒక విద్యార్థి నీటి సంరక్షణ పద్ధతులపై సమాచారాన్ని సేకరించి ఒక చిరు పుస్తకాన్ని తయారు చేయడం ఏ లక్ష్య సాధనకు చెందుతుంది?    (టెట్ - మే 2012)
     1)    వైఖరి      2) ప్రశంస
     3)    అభిరుచి     4) నైపుణ్యం
 
 7.    ఒక పబ్లిక్ నీటి కుళాయి నుంచి వృథాగా పోతున్న నీటిని ఆపడానికి ఒక విద్యార్థి చేసిన ప్రయత్నం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది?     (డీఎస్సీ - 2008)
     1)    నైపుణ్యం     2) అభిరుచి
     3)    అవగాహన     4) వైఖరి
 
 8.    బడ్జెట్ పాఠం విన్న ఒక విద్యార్థి ప్రభుత్వం ప్రవేశపెట్టే లోటు బడ్జెట్ వల్ల కలిగే ఫలితాలను ఊహించగలిగితే ఏ లక్ష్యం నెరవేరినట్లు భావించొచ్చు?             (డీఎస్సీ-2008)
     1)    వినియోగం     2) జ్ఞానం
     3)    అవగాహన     4) అభిరుచి
 
 9.    విద్యార్థుల్లో సామాజిక సమర్థతను పెంపొందించడం?    (డీఎస్సీ - 2012)
     1)    గమ్యం     2) లక్ష్యం
     3)    విలువ     4) ఆశయం
 
 10.    ధర, డిమాండ్ మధ్య సంబంధాన్ని వివరించండి అనే ప్రశ్న ఏ లక్ష్య సాధనను ఉద్దేశించింది?     (డీఎస్సీ-2012)
     1)    జ్ఞానం     2) నైపుణ్యం
     3)    వైఖరి     4) అవగాహన
 
 11.    ‘మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతాన్ని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించండి’ అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని పరీక్షిస్తుంది?     (డీఎస్సీ - 2012)
     1)    వినియోగం-సంశ్లేషణ
     2)    అవగాహన - వివరణను ఇవ్వడం
     3)    నైపుణ్యం-అనువాదం చేయడం
     4)    వినియోగం -కారణాలను చెప్పడం
 
 12.    ‘వివిధ మతాలున్న భారతీయ సమాజంలో లౌకికత్వం ఒక నిర్బంధ జీవన విధానం.. దీన్ని అంగీకరిస్తారా? లేదా?’ అనే ప్రశ్న  ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది?
     (డీఎస్సీ-2012)
     1)    నైపుణ్యం     2) జ్ఞానం
     3)    వైఖరి     4) అవగాహన
 
 13.    పాఠం నేర్చుకొన్న తర్వాత ఒక విద్యార్థి పబ్లిక్ ఆస్తులను కాపాడగలగడం అనే సామర్థ్యం ఏ లక్ష్య సాధన ఫలితం?
     (డీఎస్సీ - 2012)
     1)    వైఖరి    2) ప్రశంస
     3)    అభిరుచి    4) అవగాహన
 
 14.    అభిరుచి లక్ష్యం స్పష్టీకరణ?
     (డీఎస్సీ - 2012)
     1)    ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం
     2)    సరైన సమయంలో పన్నులు చెల్లించడం
     3)    సెమినార్‌లలో పాల్గొనడం
     4)    భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అభినందించడం
 
 15.    సాంఘికశాస్త్ర బోధనలో నోట్స్ రాయించే పద్ధతి ఉద్దేశం?
     1)    సాంఘిక శాస్త్ర సిలబస్ అధిక భారంగా ఉంది
     2)    పాఠ్య పుస్తకాల నుంచి విషయాన్ని చదవడం కష్టమెన పని, ఇది సగటు   విద్యార్థి అవగాహన సామర్థ్యానికి మించినది
     3)    ఎక్కువ మార్కులు సంపాదించేందుకు నోట్స్ తోడ్పడుతుంది
     4)    ఇది శాశ్వత రికార్డుగా, సులభంగా  రిఫర్ చేసేందుకు అనువుగా ఉంటుంది
 
 16.    సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థి హింసావాదాన్ని తిరస్కరించాడు.. అనేది?
     1)    లక్ష్యం     2) ఆశయం
     3)    విలువ     4) ఉద్దేశం
 
 17.    నావ గమ్యం చేరాలంటే దిక్సూచి ఎంత ముఖ్యమో, పాఠం బోధించడానికి అంతే ముఖ్యమైనది ఏది?
     1)    ఉపాధ్యాయుడు  2) పాఠ్యపుస్తకం
     3)    లక్ష్యం       4) విద్యాప్రణాళిక
 
 18.    కింది వాటిలో లక్ష్యాల లక్షణం కానిది?
     1)    ఆచరణ యోగ్యంగా ఉంటాయి
     2)    పాఠ్యాంశాలన్నింటికీ ఏకరీతిగా  ఉంటాయి
     3)    అభ్యసన ఫలితాల్లో కనిపిస్తాయి
     4)    బోధన ద్వారా తరగతిలో సాధించడం జరుగుతుంది
 
 19.    లక్ష్యాలను ఆచరణలో సాధించాలంటే ?
     1)    శీఘ్ర మూల్యాంకనం
     2)    విద్యార్థులకు తగిన అభ్యసనాను భవాలను కల్పించడం
     3)    విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా బోధన
     4)    పైవన్నీ
 
 20.    విద్యార్థి మంచి అభ్యసన కోసం మనం ఆశించే స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని ఏమంటారు?
     1) లక్ష్యాలు    2) ఆశయాలు
     3) స్పష్టీకరణలు    4) విలువలు
 
 21.    లక్ష్యాల స్పష్టీకరణలను ఏ విధంగా పిలుస్తారు?
     1)    విద్యాలక్ష్యాలు    2) జ్ఞానలక్ష్యాలు
     3)    మనోచలనాత్మక లక్ష్యాలు
     4)    {పవర్తనా లక్ష్యాలు
 
 22.    కింది వాటిలో భావావేశ లక్ష్యానికి మూలం కానిది?
     1)    ఆసక్తి     2) అభిమతం
     3)    {పశంస     4) వివేచన
 
 23.    విద్యార్థి భూమికి, సూర్యుడికి మధ్య దూరాన్ని కచ్చితంగా చెప్పాడు.. ఇది ఏ లక్ష్యాన్ని తృప్తి పరుస్తుంది?
     1)    అవగాహన     2) నైపుణ్యం
     3)    జ్ఞానం     4) వినియోగం
 
 24.    అవగాహనకు సోపానం?
     1)    జ్ఞానం     2) నైపుణ్యం
     3)    వినియోగం     4) అభిరుచి
 
 25.    విద్యార్థులు పబ్లిక్ వస్తువులు, ఆర్థిక వస్తువులతో ప్రజలకు గల సంబంధాన్ని తెలుసుకున్నారు... అనే దృగ్విషయం ఏ లక్ష్యాన్ని మాపనం చేస్తుంది?
     1)    వైఖరి    2) అవగాహన
     3)    వినియోగం     4) అభిరుచి
 
 26.    కింది వాటిలో సరికానిది?
     1)    అవగాహన - పోలికలు,  
         భేదాలను విద్యార్థి తెలిపాడు
     2)    వినియోగం - ప్రజాస్వామ్య వ్యవస్థ లాభాలను విద్యార్థి చెప్పాడు
     3)    వైఖరి- సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని విద్యార్థి నివేదికగా తయారు చేశాడు
     4)    అభిరుచి-పాఠశాలలో జరిగిన మాక్‌పార్ల మెంట్‌లో విద్యార్థి ఆసక్తిగా పాల్గొన్నాడు
 
 27.    భారతదేశ సాంస్కృతిక వారసత్వ గొప్ప తనాన్ని రాయండి.. అనే ప్రశ్న ద్వారా ఏ లక్ష్యాన్ని సాధించొచ్చు?
     1)    అభిరుచి     2) జ్ఞానం
     3)    {పశంస     4) వైఖరి
 
 28.    {V>Ð]l$…లోని నిరక్షరాస్యుల సమచారాన్ని విద్యార్థి సేకరించాడు. ఇది ఏ లక్ష్యానికి సంబంధించింది?
     1)    నైపుణ్యం     2) అవగాహన
     3)    వినియోగం     4) అభిరుచి
 
 29.    ఏమిటి? ఎక్కడ? ఎప్పుడు? ఎవరు? అనే ప్రశ్నలకు వచ్చే సమాధానాలు దేనికి సంబంధించిన అంశాలు?
     1)    జ్ఞానం     2) అవగాహన
     3)    వైఖరి     4) వినియోగం
 
 30.    కింది వాటిలో వినియోగ స్పష్టీకరణ?
     1)    దోషాలు కనుక్కోవడం
     2)    దత్తాంశాలను వ్యాఖ్యానించడం
     3)    జరగబోయే ఫలితాన్ని చెప్పడం
     4)    ఉదాహరణలివ్వడం
 
 31.    వ్యక్తిలో దాగిన మహత్తర శక్తులను వెలికితీసే సాధనమే విద్య అనే నిర్వచనాన్ని బలపర్చే లక్ష్యం?
     1)    {పశంస     2) వైఖరి
     3)    జ్ఞానం     4) అవగాహన
 
 32.    వైఖరి అనే లక్ష్యాన్ని సాధించిన వ్యక్తికి ఏ  లక్షణంతో సంబంధం ఉండాలనే నియమం లేదు?
     1)    దేశభక్తి     
     2) నిష్పక్షపాతం
     3)    ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం
     4)    ఇతరులకు సేవ చేయడానికి ఆసక్తి చూపడం
 
 33.    విద్యార్థి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల తీరును మెచ్చుకుంటూ, రాజకీయ నాయకులను విమర్శించాడు.. ఇది ఏ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది?
     1)    {పశంస    2) అభిరుచి
     3)    వైఖరి     4) నైపుణ్యం
 
 34.    బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో పరిమితి కానిది?
     1)    జ్ఞానాత్మక రంగానికి ఇచ్చిన అధిక ప్రాధాన్యత
     2)    {పశ్న పత్రాల్లోని నిర్దిష్టత
     3)    మానసిక ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం
     4)    లక్ష్యాల సాధనకు అధిక ప్రాధాన్యతనివ్వడం
 
 35.    మన రాష్ర్టంలో ఏ సంవత్సరం నుంచి 7, 10 తరగతులు మినహా మిగతా తరగతుల్లో విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారు?
     1)    1970  2) 1971  3) 1973     4) 1974
 
 36.    జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల ప్రాముఖ్యతను 3 ‘ఏ’ లుగా గుర్తిస్తారు. ఆ మూడు ‘ఏ’లు ఏమిటి?
     1)    హెడ్, హార్‌‌ట, హ్యాండ్‌‌స
     2)    హోమ్, హెవెన్, హెల్త్
     3)    హ్యూమానిటీ, హ్యూమిలిటీ, హాస్పిటలిటీ
     4)    హానర్, హ్యూమర్, హానెస్టీ
 
 37.    కింది వాటిలో జ్ఞానాత్మక రంగంలో లేని లక్ష్యం?
     1) సంశ్లేషణ     2) విశ్లేషణ
     3) మూల్యాంకనం     4) సమన్వయం
 
 38.    కింది వాటిలో సరికానిది?
     ఎ)    మానసిక చలనాత్మక రంగం - ప్రతిస్పందించడం, విలువ కట్టడం
     బి) జ్ఞానాత్మక రంగం - అవగాహన,
         హస్తలాఘవం
     సి)    భావావేశ రంగం - గ్రహించడం,
         శీలస్థాపనం
     1)    పైవన్నీ    2) ఏవీ కావు
     3)    ఎ, బి    4) బి, సి
 
 39.    విద్యార్థి వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాల్లో  సంభవించే మార్పులను ఊహించి చెప్పగలిగాడు ఇది ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది?
     1)    అవగాహన - అనువదించడం
     2)    అవగాహన - వ్యాఖ్యానించడం
     3)    అవగాహన - ఎక్స్‌ట్రాపొలేషన్
     4)    అవగాహన - సునిశితత్వం
 
 40.    జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం?
     1)    జ్ఞానం      2) అవగాహన
     3)    విశ్లేషణ     
     4) మూల్యాంకనం
 
 41.    శీలస్థాపనం అంటే?
     1)    విలువలను ప్రవర్తనలో భాగంగా
         మార్చడం
     2)    వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడం
     3)    గుణగణాలను అలవర్చుకోవడం
     4)    దృక్పథాలను ఉద్దేశాలలో మిళితం చేయడం
 
 42.    విద్యార్థి భారతదేశ పటాన్ని గీసి సరిహద్దు ప్రదేశాలను చాలా సులభంగా గుర్తించాడు.. ఇది ఏ లక్ష్యానికి సంబంధించినది?
     1) నైపుణ్యం- హస్తలాఘవం
     2) నైపుణ్యం - సహజీకరణం
     3) నైపుణ్యం - అనుకరణం
     4) నైపుణ్యం - సునిశితత్వం
 
 సమాధానాలు
 1)  1;    2)  3;    3)  3;    4)  4;     5) 2;
 6)  4;    7)  4;    8)  1;    9)  3;    10)4;
 11) 1;    12) 4;    13) 1;    14) 3;    15)4;
 16) 1;    17) 3;    18) 2;    19) 2;    20)3;
 21) 4;    22) 4;    23) 3;    24) 1;    25)2;
 26) 3;    27) 3;    28) 1;    29) 1;    30)3;
 31) 2;    32) 4;    33) 1;    34) 2;    35)2;
 36) 1;    37) 4;    38) 3;    39) 3;    40)4;     41) 1;    42) 2
 
 

Advertisement
Advertisement