తెలుగు మెథడాలజీ టెట్ + డీఎస్సీ పేపర్ - 1, 2 | Sakshi
Sakshi News home page

తెలుగు మెథడాలజీ టెట్ + డీఎస్సీ పేపర్ - 1, 2

Published Sat, Sep 28 2013 10:50 PM

తెలుగు మెథడాలజీ     టెట్ + డీఎస్సీ     పేపర్ -  1, 2

కింది అపరిచిత గద్యాన్ని చదివి 1 నుంచి 5 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
 వ్యక్తి, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం... ఈ మూడూ ఒక త్రయం. పుట్టిన ప్రతిమనిషీ ఒక వ్యక్తి. ప్రతి మనిషికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని నిరంతరం కాపాడుకొంటూ, అభివృద్ధి పర్చుకోవడమే వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం వల్ల మనుషులు మనీషులవుతారు.
 
 వ్యక్తిత్వ వికాసానికి  కులం, మతం, పదవి.. వంటివి కొలమానాలు కావు. కోట్ల రూపాయల సంపదలు కూడబెట్టుకొని ఎవరికీ చిన్న సహాయం కూడా చేయని వాళ్ల కన్నా, యాచించి తెచ్చిన అన్నాన్ని ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టి, మిగిలినది తాను తినే యాచకుడు గొప్పవాడు. పెద్ద పదవిలో ఉండి ఎవరికీ  ఏమీ చేయని అధికారి కన్నా, చిన్న పదవిలో ఉంటూ తనకు చేతనైన రీతిలో ఇతరులకు సహాయం చేసే మనిషి నిస్సందేహంగా గొప్ప వ్యక్తి. అందువల్ల వ్యక్తిత్వం కుల, మత, ధనాలకు అతీతమైనది, ఉన్నతమైనది. కుల, మతాలు వ్యక్తికి గుర్తులు తప్ప వ్యక్తిత్వానికి గుర్తులు కావు.
 
 బస్సులో ప్రయాణికులు మరచిపోయిన పర్సును అధికారులకు అప్పగించిన కండక్టర్, ఆటోలో ప్రయాణికులు మరచిపోయిన వస్తువులను పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్.. నిజాయతీతో కూడిన వ్యక్తిత్వ వికాసం గల వ్యక్తులకు మంచి ఉదాహరణలు. సమాజంలో ఇతరులతో నీతి నిజాయతీలతో కలిసి మెలిసి జీవించడం వ్యక్తిత్వ వికాసంలో తొలిమెట్టు.
 1.    వ్యక్తిత్వం అంటే..?
     1) నేర్చుకొంటే వస్తుంది
     2) పుట్టుకతో వస్తుంది
     3) ఇతరుల నుంచి వస్తుంది
     4) పరిసరాలను అనుసరించి వస్తుంది.
 
 2.    మనుషులు మనీషులుగా మారాలంటే..?
     1) వ్యక్తిత్వాన్ని కుదించుకోవాలి
     2) వ్యక్తిత్వాన్ని నిరంతరం అభివృద్ధి
         పర్చుకోవాలి
     3) వ్యక్తిత్వాన్ని స్వార్థమయం చేసుకోవాలి
     4) వ్యక్తిత్వాన్ని కించపరచుకోవాలి
 
 3.     గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరు..?
     1) ఎవరికీ సహాయం చేయని కోటీశ్వరుడు
     2) ఎవరికీ సహాయం చేయని అధికారి
     3) యాచించి తెచ్చిన అన్నాన్ని ఇతరులకు పెట్టే యాచకుడు
     4) ఇతరులను నిర్లక్షంగా తిరస్కరించేవాడు
 
 4.    వ్యక్తిత్వ వికాసానికి మంచి ఉదాహరణ?
 1) బస్సులో ప్రయాణికులు మరచిపోయిన పర్సును అధికారులకు
 అప్పగించే కండక్టర్
     2) నిజాయతీగా వ్యవహరించే ప్రతివ్యక్తి
 3) ఆటోలో ప్రయాణికులు మరచిపోయిన వస్తువులను పోలీసులకు అప్పగించే డ్రైవర్
     4) పై వ్యక్తులందరూ
 
 5.    వ్యక్తిత్వ వికాసానికి తొలిమెట్టు..?
     1) అహంకారంతో ప్రవర్తించడం
     2) ఒంటరిగా జీవించడం  
     3) సమాజంలో నిజాయతీతో జీవించడం
     4) అజ్ఞాతంగా జీవించడం
 
 ఈ కింది పద్యాన్ని చదివి.. 6 నుంచి 10 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
 రాజుల్మత్తులువారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం
 భోజాక్షీచతురంతయాన తురగీ భూషాదులాత్మవ్యధా
 బీజంబుల్ తదపేక్షచాలు బరితృప్తిబొందితిన్ జ్ఞానల
 క్షీ జాగ్రత్పరిణామ మిమ్మదయతో శ్రీకాళహస్తీశ్వరా!
 
 6.    ఈ శతక పద్య రచయిత?
     1) బద్దెన     2) ధూర్జటి
     3) మారద వెంకయ్య
     4) కంచర్ల గోపన్న
 
 7.    ఈ పద్యంలోని ఛందస్సు?
     1) ఉత్పలమాల     2) మత్తేభం
     3) శార్దూలం    4) చంపకమాల
 
 8.    చతురంతయాన అనే పదానికి అర్థం?
     1) గుర్రం     2) ఏనుగు
     3) స్త్రీ      4) పల్లకీ
 
 9.    రాజుల సేవను కవి ఏ విధంగా వర్ణించాడు?
     1) స్వర్గతుల్యం    2) విలాసప్రాయం
     3) నరకప్రాయం    4) ఉన్నతం
 
 10.    }M>-âహస్తీశ్వరుడి నుంచి కవి ఏం కోరాడు..?
     1) అందమైన స్త్రీలు    
     2) జ్ఞానసంపద    3) గుర్రాలు
     4) పల్లకీలు
 
 11.    వాఙ్మయం అనే పదంలోని సంధి?
     1) వృద్ధి సంధి    2) యణాదేశ సంధి
     3) సవర్ణదీర్ఘ సంధి     4) అనునాసిక సంధి
 
 12. కింది వాటిలో అర్థవ్యాకోచం జరిగిన పదాలు?
     1) చీర- వస్తాదు    2) చెంబు-నూనె
     3) సభికులు- ఛాందసుడు
     4) సూది- మర్యాద
 
 13.    పాదాలచే నడువనిది అన్న వ్యుత్పత్తి కలిగిన పదం?
     1) పాదపం     2) పాదజం
     3) పన్నగం     4) పాదరహితం
 
 14.    శశివిషాణం అనే జాతీయానికి అర్థం?
     1) చంద్రుడిలో మచ్చ
     2) చంద్రుడిలో పాషాణం
     3) కుందేటి కొమ్ము
     4) చంద్రుడి వెన్నెల
 
 15. ‘రేడియో వినిపిస్తూ పని చేయిస్తే కార్మికులు ఎక్కువ పని చేయగలుగుతారు’ ఈ వాక్యంలో అసమాపక క్రియలు?
     1) క్త్వార్థకం - అప్యర్థకం
     2) శత్రర్థకం- ఛేదర్థకం
     3) శత్రర్థకం- తుమున్నర్థకం
     4) తుమున్నర్థకం- ఛేదర్థకం
 
 16. బహువ్రీహి సమాసానికి ఉదాహరణలు
     1) చక్రపాణి, కుంభాకారుడు, నెలతాల్పు
     2) కమలాక్షుడు, నలువ, సంసార సాగరం
     3) నలువ- ముక్కంటి- చక్రపాణి
 4) సంసార సాగరం, పూబోడి, పీతాంబరుడు
 
 17.    ‘ఉల్లి చేసిన మేలు తల్లి చేయలేదు’ అనే వాక్యం?
     1) పొడుపు కథ    2) జాతీయం
     3) నానుడి     4) సామెత
 
 18.    సాహితీ సమరాంగణ  సార్వభౌముడు అనే బిరుదున్న కవి?
     1) నన్నెచోడుడు     2) తిక్కన
     3) శ్రీకృష్ణదేవరాయలు
     4) రఘునాథ నాయకుడు
 
 19.    అనిగెంకాయ, పుంటికూర అనేవి ఏ మాండలిక పదాలు?
     1) పూర్వ మండలం
     2) దక్షిణ మండలం
     3) మధ్య మండలం
     4) ఉత్తర మండలం
 
 20.    ‘మీరు వింటే నేను పాఠం చెబుతాను’ అనేది ఏ వాక్యం?
     1) సందేహార్థక వాక్యం
     2) ప్రశ్నార్థక వాక్యం
     3) వికల్పార్థక వాక్యం
     4) ఆశ్చర్యార్థక వాక్యం
 
 21.    ‘బంగారం’ మాటకు పర్యాయ పదాలు?
     1) స్వర్ణం, రజితం
     2) పసిడి, సువర్ణం, కాంచనం
     3) పుష్పం, పసిడి    
     4) రజతం, కుసుమం
 
 22.    కవి అనే పదానికి నానార్థాలు?
     1) వాల్మీకి, బృహస్పతి, శుక్రుడు
     2) నీటికాకి, నెమలి, హంస
     3) పండితుడు, అజ్ఞాని, ద్రష్ట
     4) కావ్యకర్త, బ్రహ్మ, శుక్రుడు
 
 23.    }} రచనల్లో ప్రభవ, అనంతం ఏ ప్రక్రియలకు చెందినవి?
     1) గేయకావ్యం- చరిత్ర
     2) పద్యకావ్యం- స్వీయ చరిత్ర
     3) గేయం-జీవిత చరిత్ర
     4) గేయం- నాటిక
 
 24.    ‘అందడు, ఆగడు, అరగడు- ఎవరతడు’ ఈ పొడుపు కథకు అర్థం?
     1) చంద్రుడు     2) నక్షత్రం     
     3) సూర్యుడు    4) శివుడు
 
 25.    తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం?
     1) క్షుణ్ణ పఠనం చేయించడం
            2) కఠిన పదాలను స్పష్టంగా ఉచ్ఛరించి పరిచయం చేయడం
     3) పాఠాలను బాహ్యంగా చదివించడం
     4) పాఠాలను మౌనంగా చదివించడం
 
 26.    ఆధునిక బోధనా పద్ధతుల్లో ప్రముఖమైంది?
     1) చర్చా పద్ధతి    
     2) ప్రశ్నోత్తర పద్ధతి
     3) క్రీడా పద్ధతి    
     4) ఉపన్యాస పద్ధతి
 
 27.    పద్యబోధన లక్ష్యసాధనకు అనుసరణీయమైన బోధనా పద్థతి?
     1) భాషాభిరుచి తాత్పర్య పద్ధతి
     2) రసానుభూతి- ప్రశంసా పద్ధతి
     3) అర్థవివేచన పద్ధతి
          4) సంస్కృతీ సంప్రదాయాల వివరణ పద్ధతి
 
 28.    సూక్ష్మ బోధనలో ఒక నైపుణ్య సాధనకు ఎన్నిసార్లు బోధించాలి?
     1) 6         2) 5     3) 4            4) 8
 
 29.    ధ్వనికీ, భావానికీ అనురూపమైన సంబంధం ఉంటుందని, ప్రకృతి అంతా లయాత్మక ప్రకంపనలను కలిగి ఉంటుందని, ఆ ప్రకంపనాలకు అనుగుణంగా వక్త నోట శబ్దాలు వెలువడుతాయని చెప్పే భాషోత్పత్తి వాదం?
     1) ప్రకంపనా వాదం     
     2) ధాతు జన్యువాదం
     3) సాంకేతిక వాదం
     4) డింగ్-డాంగ్ వాదం
 
 30. బోధనా లక్ష్యాలను టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్‌‌సలో వివరించిన విద్యావేత్త?
     1) గ్విన్    2) సిసిరో
     3) బెంజిమన్ బ్లూమ్    
     4) లివింగ్‌స్టన్
 
 31.    గుడిపాటి వేంకటాచలం రచించిన ఓ పూవుపూసింది, సావిత్రి ఏ ప్రక్రియలకు చెందిన రచనలు?
 1) కవిత- కథానిక    2)నవల - నాటిక
 3) నవల - కవిత      4) కథానిక - నాటిక
 
 32.    {పబంధ పరమేశ్వరుడు అనే బిరుదున్న కవి ఎవరు?
 1) పోతన      2) ఎఱ్ఱన
 3) శ్రీనాథుడు      4) పెద్దన
 
 33.    నువ్వు నాతో ‘నువ్వు మంచి వాడివి అన్నావు’ అనే ప్రత్యక్షానుకృతివాక్యానికి పరోక్షాను కృతి రూపం?
 1) నువ్వు నాతో, నేను మంచివాడినని
 అన్నావు
 2) నేను నీతోనే మంచివాడినని అన్నాను
 3) నువ్వునాతో మంచివాడిగా
 ఉంటానన్నావు
 4) నువ్వునాతో, నీవు మంచివాడినని
 అన్నావు
 
 34.    కింది వాటిలో వర్గ ద్వితీయ వర్ణాలు?
 1) క,చ,ట,త,ప      
 2) గ,జ,డ,ద,బ
 3) ఖ,ఛ,ఠ,థ,ఫ      
 4) ఘ,ఝ,ఢ.,ధ,భ
 
 35.    ‘గ్రంథ రచనా కాలములను తెలిసికొ నుటకు చరిత్రయే ఆధారము’ అనే వాక్యానికి ఆధు నిక భాషారూపం?
 1) గ్రంథరచనా కాలములను తెలుసుకొ
 నుటకు చరిత్రయే ఆధారం
 2) గ్రంథ రచనా కాలాలను తెలుసు
 కోవడానికి చరిత్ర ఆధారం
 3) గ్రంథరచనా కాలాలను తెలుసు
 కొనుటకు చరిత్రయే ఆధారం
 4) గ్రంథ రచనా కాలములను
 తెలిసికొనుటకు చరిత్ర ఆధారం
 
 సమాధానాలు
 1)  2;   2)  2;  3)  3;   4) 4;    5)  3;
 6)  2;   7)  3;  8)  4;   9)  3;   10) 2;
 11) 4;  12) 2;  13) 3;  14) 3;   15) 2;
 16) 3;  17) 4;  18) 3;  19) 4;   20) 3;
 21) 2;  22) 4;  23) 2;  24) 3;   25) 2;
 26) 3;  27) 2;  28) 3;  29) 4;   30) 3;
 31) 4;  32) 2;  33)1;   34) 3;   35) 2
 

Advertisement
Advertisement