మధుమేహాన్ని నియంత్రించే గ్రంథి ఏది? | Sakshi
Sakshi News home page

మధుమేహాన్ని నియంత్రించే గ్రంథి ఏది?

Published Tue, Sep 9 2014 10:44 PM

What is the gland that controls diabetes?

ఉద్యోగ  భర్తీలకు సంబంధించిన ప్రకటన వచ్చాకే సన్నద్ధతను ప్రారంభించడం ఒకప్పటి విధానం. మారిన పోటీ పరిస్థితుల దృష్ట్యా ఎంత ముందుగా    ప్రిపరేషన్ మొదలుపెడితే అంత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం కోసం తపించే ప్రతి ఒక్కరూ కనీసం ఏడాది టైమ్ టేబుల్ వేసుకొని, నిరంతరం ఒక క్రమపద్ధతిలో కష్టపడాలి. 

వివిధ అంశాలను తమదైన శైలిలో ప్రిపేరైనవారికి కచ్చితంగా ఉద్యోగం  సొంతమవుతుంది. ఇప్పటికే ఏదో ఒక  ఉద్యోగం చేస్తూ ఉన్నత కొలువు కోసం  ప్రయత్నించేవారైతే మరింత శ్రమించాలి. సన్నద్ధత ప్రారంభిం చడం ఒక ఎత్తయితే  ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ టాపిక్ ఎంతసేపు చదవాలి? ఏ పుస్తకాలను ఎంచుకోవాలి? లాంటి విషయాల్లో స్పష్టత సాధించడం మరో ఎత్తు.  నిజానికి విజయంలో కీలకపాత్ర పోషించేది ఈ అంశమే.
 
 కానిస్టేబుల్స్ పోటీపరీక్షల సిలబస్   ప్రకారం బయాలజీలో.. జీవప్రపంచం, హార్మోన్లు, విటమిన్లు, మూలకాలు, మానవ అవయవ వ్వవస్థ - నిర్మాణం, పనితీరు, వ్యాధులు - అవి వ్యాపించే విధానం, నివా రణ పద్ధతులు, వ్యాక్సిన్లు లాంటివి ముఖ్యమైన పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఈ శీర్షికలో హార్మోన్ల గురించి తెలుసుకుందాం.
 
 హార్మోన్లు
      మొక్కల్లో, జంతువుల్లో వివిధ రకాల  హార్మోన్లు ఉంటాయి.
     మొక్కల్లో ఉండే హార్మోన్లు:
     1. ఆక్సిన్లు      2. జిబ్బరెల్లిన్లు
     3. సైటోకైనిన్లు     4. ఇథిలిన్    
     5. అబ్‌సిసిక్ ఆమ్లం
 జంతువుల్లో ఉండే హార్మోన్లు: జంతువుల్లో వివిధ గ్రంథులు వివిధ హార్మోన్లను స్రవిస్తాయి.  
 హార్మోన్లను స్రవించే గ్రంథులు:
     పిట్యూటరీ గ్రంథి
     థైరాయిడ్
     పారా థైరాయిడ్
     అడ్రినల్
     పాక్రియాస్ (క్లోమం)
     గోనాడ్‌‌స (బీజకోశాలు)
     పై అంశాల గురించి విశ్లేషణాత్మకంగా చదివితే కచ్చితంగా 1 నుంచి 2 మార్కులు పొందవచ్చు.
 
 గతంలో కింది ప్రశ్నను అడిగారు..
     శరీరంలో ఎముక నిర్మాణానికి అవ సరమైన ఇ్చ, ్క మూలకాలను   సమతాస్థితిలో ఉంచే గ్రంథి ఏది?
     ఎ) థైరాయిడ్       బి) అడ్రినల్
     సి) పారాథైరాయిడ్  డి) పిట్యూటరీ
 జ:    సి. అడ్రినలిన్ ూ్చ అయాన్లను నియంత్రి స్తుంది. థైరాయిడ్‌కు అయోడిన్‌తో సం బంధం ఉంటుంది. ఇలాంటి అంశాలను గుర్తుంచుకుంటే తేలిగ్గా సమాధానాన్ని రాయవచ్చు.
 
 కింది ప్రశ్నలను గమనించండి..
     మానవ శరీరంలో అతి పెద్ద అంతస్రావ గ్రంథి ఏది?
     ఎ) కాలేయం    బి) క్లోమం
     సి) పిట్యూటరీ     డి) థైరాయిడ్    
 జ.    డి. అతిపెద్దగ్రంథి, అతి ప్రధాన గ్రంథి, అతి పెద్ద అంతఃస్రావ గ్రంథి లాంటి వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈపదాలతో తికమక పెట్టవచ్చు.   కాబ ట్టి ప్రతి పదానికి సంబంధించిన విష యాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తేనే సులభంగా సమాధానం గుర్తించవచ్చు. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం. అతి ప్రధాన గ్రంథి పిట్యూ టరీ, మిశ్రమ గ్రంథి- క్లోమం.
     కిందివాటిలో మధుమేహాన్ని నియంత్రించే గ్రంథి ఏది?
     ఎ) థైరాయిడ్     బి) కాలేయం
     సి) అడ్రినల్     డి) క్లోమం
 జ:    డి. క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. ఇది ఎంజైములను, హార్మోన్లను ఉత్పత్తి చే స్తుంది. ఇది విడుదల చేసే హార్మోన్లు:
     ఎ) ఇన్‌‌సలిన్    బి) గ్లూకగాన్.
     ఇన్‌‌సలిన్ శరీరంలోని గ్లూకోజ్‌ను నియం త్రిస్తుంది. అధికమైన గ్లూకోజ్‌ను గ్లైకోజన్ గా మారుస్తుంది. ఇది గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి సరైన సమాధానం క్లోమం.
     విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
     ఎ) ఆక్సిన్    బి) జిబ్బరెల్లిన్
     సి) సైటోకైనిన్    డి) ఇథిలిన్
 జ:    బి. జిబ్బరెల్లిన్, ఇథిలిన్ ఫలాలకు సంబం దించిన హార్మోన్లు. జిబ్బరెల్లిన్ విత్తనాలు లేని ఫలాలు (అనిషేక) ఏర్పడటానికి, ఇథలిన్ ఫలాలు త్వరగా పక్వం చెంద డానికి తోడ్పడతాయి.
     కిందివాటిలో గుల్మనాశకాన్ని  గుర్తించండి.
     ఎ) ఐఅఅ     బి) ఐఆఅ
     సి) ూఅఅ    డి) 2, 4 ఈ
 జ:    డి. ఆక్సిన్ల గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం గుర్తించవచ్చు. మొక్కల్లో సహజంగా ఉండే ఆక్సిన్ ఐఅఅ. మిగతావి కృత్రిమంగా రూపొందించినవి. వీటిలో ఐఆఅల వేర్ల ఉత్పత్తికి,    ూఅఅ పుష్పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. 2,4ఈ, 2,4,5ఖీ అనేవి గుల్మనాశకాలు (కలుపు మొక్కలనాశని) అని గుర్తుంచుకోవాలి.
 
 
 
 1.    భారత్‌లో అంధత్వానికి ముఖ్యమైన కారణం?
     1) ట్రకోమా    2) కాటరాక్ట్
     3) గ్లుకోమా    4)రోడ్డు ప్రమాదాలు
 2.    మానవ శరీరంలోని ఏ అవయవం దెబ్బతినడం వల్ల ‘ఎన్ సెఫలైటిస్’ వ్యాధి  వస్తుంది?
     1) గుండె    2) మూత్రపిండాలు
     3) మెదడు    4) కాలేయం
 3.    వేటిని నశింపజేయడానికి యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తారు?
     1) జీవులు    2) సూక్ష్మజీవులు
     3) వైరస్    4) బ్యాక్టీరియా
 4.    లాలాజలంలో ఉండే ఎంజైమ్?
     1) లైపేజ్    2) పెప్సిన్
     3) ట్రిప్సిన్    4) థయలిన్
 5.    ల్యుకేమియా వ్యాధి దేనికి సంబంధిం చింది?
     1) నాడీ వ్యవస్థ 2)గిఆఇ అధికమవడం
     3) చర్మం     4) శ్వాసక్రియ
 6.    కిందివాటిలో రైబోజోమ్స్ అధికంగా కలిగి ఉన్నది?
     1) డీఎన్‌ఏ    2) ఆర్‌ఎన్‌ఏ
     3) హిమోగ్లోబిన్    4) ఏదీకాదు
 7.    మానవ మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రం ఎక్కడ ఉంటుంది?
     1) సెరిబ్రం    2) సెరిబెల్లం
     3) మెడుల్లా    4) వల్కలం
 8.    కలపలో ఎండుకుళ్లు తెగులుకు కారణం?
     1) కీటకాలు    2) ఫంగస్
     3) బ్యాక్టీరియా    4) ఏదీకాదు
 9.    మెనింజైటిస్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది?
     1) వైరస్    2) ఫంగస్
     3) బ్యాక్టీరియా    4) మెనింజోకోకస్
 10.    కిందివాటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి?
     1)  మశూచి    2) కలరా
     3) టెటానస్    4) ట్యుబర్‌కులోసిస్
 11.    పాలను పాశ్చరైజేషన్ చేయడం అంటే?
     1) కొవ్వును పెంచడం
     2) ప్రోటీన్‌‌సను పెంచడం
     3) సూక్ష్మజీవులను చంపడం
     4) నాణ్యతను మార్చడం
 12.    మలేరియా వ్యాధి ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది?
     1) ప్లీహం    2) పేగు
     3) కాలేయం    4) ఊపిరితిత్తులు
 13.    ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు?
     1) ఆల్ఫా      2) బీటా
     3) గామా     4) పైవన్నీ
 14.    వనస్పతితో కాకుండా, నూనెతో వంట చేసుకోవాలని చాలామంది డాక్టర్లు  సూచిస్తారు. దీనికి కారణం?
     1) నూనెలో సంతృప్త కొవ్వులుంటాయి
     2)కొవ్వులో అసంతృప్త కొవ్వులుంటాయి
     3) నూనెతో సులువుగా
         వంట చేయవచ్చు
     4)  నూనె చాలా చవక
 15.    విటమిన్-ఎ అధికంగా దేంట్లో ఉంటుంది?
     1) యాపిల్    2) అరటి
     3) నారింజ    4) గుడ్డు
 16.    మొక్కలు, జంతువుల్లో అతి ముఖ్యమైన భేదం?
     1) చలనం    2) ప్రత్యుత్పత్తి
     3) జీర్ణక్రియ    4) ఏదీకాదు
 17.    కిందివాటిని జతపరచండి.
     ఎ) డ్రూప్     1) మామిడి
     బి) హెస్పరిడియం  2) టమాట
     సి) కీరియాప్సిన్     3) నారింజ
     డి) లెగ్యూమ్     4) గోధుమ
              5) చిక్కుడు
              6) యాపిల్
         ఎ     బి     సి      డి
     1)    4      2     5      1
     2)    1      3     4      5
     3)    2      3     4      5
     4)     1      4     5      6
 18.    కణ భాండాగారం?
     1) రిక్తిక    2) మైటోకాండ్రియా
     3) రైబోజోములు    4) హరిత రేణువులు
 19.    జీవులను వర్గీకరించే శాస్త్ర విభాగాన్ని ఏమంటారు?
     1) జీనాలజీ    2) హిస్టాలజీ
     3) రేడియాలజీ    4) టాక్సానమి
 20.    సాధారణంగా పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి?
     1) జాండిస్    2) డిప్తీరియా
     3) పోలియో    4) క్షయ
 21.    ‘అమ్నీసియా’ వ్యాధి ప్రభావంతో  కోల్పోయేది?
     1) జీర్ణశక్తి    2) దృష్టి
     3) జ్ఞాపకశక్తి    4) స్పర్శ
 22.    జీవ పరిణామం సమయంలో కిందివాటిలో  నేలపై మొదట ఏవి విస్తరించాయి?
     1) తేళ్లు      2) పక్షులు
     3) గాలిపీల్చే చేపలు 4) ఉభయ చరాలు
 

Advertisement
Advertisement