ఆర్మీలో ఇంజనీర్ కావాలంటే..? | Sakshi
Sakshi News home page

ఆర్మీలో ఇంజనీర్ కావాలంటే..?

Published Thu, Dec 18 2014 1:15 AM

ఆర్మీలో ఇంజనీర్ కావాలంటే..? - Sakshi

ఆర్మీలో ఇంజనీర్ కావాలని ఉంది. ఎలా సాధ్యం?
- వనజ, విజయనగరం.
 ఆర్మీలో ఇంజనీర్‌గా చేరాలనుకునే పురుష అభ్యర్థులకు ఈ విధంగా ప్రవేశాలు ఉంటాయి.  షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్, టీజీసీ (ఇంజనీర్స్): ఏడాదికి రెండుసార్లు ఇందులో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడుతుంది.
 అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ. వయసు: 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్ 49 వారాలు, టీజీసీ వారు ఏడాది పాటు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
 యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్: యూనివర్సిటీ స్థాయిలో ఐదు రోజులపాటు ఎంపిక ప్రక్రియను చేపడతారు. ఈ ఐదు రోజుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీటు లభిస్తుంది. వయసు: 19-25 ఏళ్లు, అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ. ఎంపికైన వారికి డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
 వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in
 
 రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా సర్టిఫికేట్ అందిస్తున్న సంస్థల వివరాలను తెలపండి?
 -రాంబాబు, సికింద్రాబాద్.
 రిటైల్ మేనేజ్‌మెంట్‌లో 11 నెలల పీజీ డిప్లొమాను ఆంధ్రా యూనివర్సిటీ అందిస్తోంది.
 అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 హైదరాబాద్‌లోని నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ సంస్థ బిజినెస్ మేనేజ్‌మెంట్ డిప్లొమా పేరుతో రిటైల్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్ పీజీ నిర్వహిస్తోంది. ఇది పార్ట్ టైమ్ కోర్సు.
 అర్హత: 50 శాతంతో డిగ్రీ పాస్.
 వెబ్‌సైట్: http://nmimshyderabad.org
 అలాగే అహ్మదాబాద్‌లోని ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది. ఇది ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. అర్హత: డిగ్రీ. ఎస్‌ఓపీ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
 వెబ్‌సైట్: www.mica.ac.in
 
 బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు?
 -విష్ణు, మహబూబాబాద్.
 ఐఐఎస్సీలో బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ డిసిప్లైన్‌లలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నారు. విద్యార్థుల్లో ఇంటర్ డిసిప్లైనరీ అనుభవం పెంచేందుకు వీటిని నడిపిస్తున్నారు.
 అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కు లతో పాస్. కేవైపీవై-ఎస్‌ఏ/ కేవైపీవై-ఎస్‌బీ/ కేవైపీవై- ఎస్‌ఎక్స్/ఎస్‌బీ/ఐఐటీ-జేఈఈ/ఏఐఈఈఈ/ఏఐపీఎంటీ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
 వెబ్‌సైట్: www.iisc.ernet.in
 
 అలాగే ఎంఈ/ఎంటెక్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సులను ఐఐఎస్సీ అందిస్తోంది. అర్హత: బీఈ /బీటెక్. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
 వీటితోపాటు పలు అంశాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను కూడా ఐఐఎస్సీ అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.iisc.ernet.in
 
 బీటెక్‌లో ఈఈఈ పూర్తి చేశాను. సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలంటే ఏ కోర్సు చేస్తే బాగుంటుంది?
 - జి.రుషి, విశాఖపట్నం.
 సాఫ్ట్‌వేర్ రంగంలో చేరాలంటే రెండు మార్గాలు ఉన్నా యి. వీటిలో లాంగ్వేజ్, లేదా ఆర్కిటెక్చర్ సంబంధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లోని షార్ట్ టెర్మ్ కోర్స్ ఒకటి. ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్ సంస్థలు దీన్ని అందిస్తున్నాయి.
 రెండో మార్గం: కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్. విశాఖపట్టణంలోని గీతం యూనివర్సిటీ ఈ కోర్సును నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష, పని అనుభవంలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
 వెబ్‌సైట్: www.gitam.edu
 హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిసిప్లైన్‌లలో ఎంటెక్ కోర్సును నిర్వహిస్తోంది. గేట్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
 వెబ్‌సైట్: www.uohyd.ernet.in
 
 బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో ఉన్న మేనేజ్‌మెంట్ కోర్సుల వివరాలు?
 -వాయిలపల్లి లక్ష్మీనారాయణ, మకరజోల.
 బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ కోర్సును చేసిన వారికి వివిధ బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక బ్యాంక్‌ను ముందంజలో ఉంచేందుకు ఒక ఎగ్జిక్యూటివ్‌కు కావల్సిన నాలెడ్జ్, అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. కోర్సు పూర్తిచేసిన  వారికి వివిధ బ్యాంక్‌లలో ఎగ్జిక్యూటివ్, మేనేజీరియల్ స్థానాల్లో అవకాశం ఉంటుంది.
 
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
 అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
 ప్రవేశం: క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్‌ఏటీ/జీమ్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా..
 వివరాలకు: www.ipeindia.org
 మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన చిరునామా:
 సాక్షి భవిత, కేరాఫ్ సాక్షి జర్నలిజం స్కూల్, 8-2-696, 697/75/1,
 సితార గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్-500008.
 ఈ-మెయిల్ : sakshieducation@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement