15.22 శాతం పోలింగ్ నమోదు | Sakshi
Sakshi News home page

15.22 శాతం పోలింగ్ నమోదు

Published Sun, Mar 30 2014 11:17 AM

15.22 శాతం పోలింగ్ నమోదు - Sakshi

మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు 15.22 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 18.2 శాతం, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారందరికీ రాత్రి 7, 8 గంటల వరకు కూడా ఓట్లు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ చాలా సజావుగా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఈవీఎంల బ్యాటరీలు లీకైనా, వీకైనా వాటిని గమనించకుండా మిషన్ ఆన్ చేసిన చోటే అవి మొరాయించాయని, వాటిని కూడా వీలైనచోట్ల బాగు చేయించడం లేదా కొత్తవి అందించడం చేశామని రమాకాంత్ రెడ్డి చెప్పారు.

వివిధ జిల్లాల్లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పది గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం 17.31, విజయనగరం 14.93, విశాఖ 17.16, తూర్పుగోదావరి 15.85, పశ్చిమ గోదావరి 12.23, కృష్ణా 13.68, గుంటూరు 16.67, ప్రకాశం 17, నెల్లూరు 18.2, చిత్తూరు 16.43, అనంతపురం 15.57, కర్నూలు 10, కడప 15.05, వరంగల్‌ 12, కరీంనగర్‌ 14, ఖమ్మం 16.74, ఆదిలాబాద్‌ 11.94, రంగారెడ్డి 18.25, నల్గొండ 13, మెదక్‌ 18.05, మహబూబ్‌నగర్‌ 15.97, నిజామాబాద్‌ 13.88 శాతం పోలింగ్‌ నమోదైంది.

Advertisement
Advertisement