మున్సి‘పోలింగ్’కు ఏర్పాట్లు పూర్తి | Sakshi
Sakshi News home page

మున్సి‘పోలింగ్’కు ఏర్పాట్లు పూర్తి

Published Sat, Mar 29 2014 3:11 AM

arrangements completed for municipal elections

కొత్తగూడెం, న్యూస్‌లైన్: ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓరారు. ఆయన శుక్రవారం ఇక్కడ ఎస్పీ ఎవి.రంగనాథ్, ఎన్నికల పరిశీలకుడు విష్ణువర్థన్‌తో కలిసి విలేకరుల సమావేశంలోలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామన్నా. ఈవీఎంలు మొరాయిస్తాయేమోనని ప్రత్యామ్నా య ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు.

 ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్తగా ఓటరు నమోదు కోసం ఈ నెల 9న పదివేల మంది దరఖాస్తు చేశారన్నారు. పరిశీలనలో జాప్యం కారణంగా వీరికి ఇంకా ఓటు హక్కు రాలేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ప్రధానంగా కొత్తగూడెం, ఖమ్మం డివిజన్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

 రూ.60 లక్షలు స్వాధీనం: ఎస్పీ
 ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న రూ.60లక్షల నగదు స్వాధీనపర్చుకున్నట్టు ఎస్పీ ఎవి.రంగనాథ్ చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమణ కింద 35 కేసులు నమోదు చేశామన్నారు. తనిఖీలు, దాడుల ద్వారా 3,600 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 4,200 బీర్ బాటిళ్లు, 25 టన్నుల నల్ల బెల్లం, తొమ్మిది టన్నుల పటిక పట్టుకున్నట్టు చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిలిపివేశామని, బెల్ట్ షాపులకు సహకరిస్తున్న ఏడు వైన్ షాపులను సీజ్ చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తులో ఏడుగురు డీఎస్పీలు, 36 మంది సీఐలు, 123 మంది ఏఎస్సైలు, 7175 మంది కానిస్టేబుళ్లు, 402 మంది మహిళా కానిస్టేబుళ్లు పాల్గొంటారని వివరించారు. వీరితోపాటు నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలు కూడా విధులు నిర్వర్తిస్తాయన్నారు. సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement