‘పరిషత్’లో నామినేషన్ల జాతర | Sakshi
Sakshi News home page

‘పరిషత్’లో నామినేషన్ల జాతర

Published Thu, Mar 20 2014 3:19 AM

'Assembly' nominations in the fair

 నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మూడోరోజైన బుధవారం ఒక్కసారిగా నామినేషన్లు ఊపందుకున్నాయి. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో సాయం కాలం 4 గంటల వరకు కేవలం 25 నామినేషన్లు మాత్రమే దా ఖలయ్యాయి. ఆ తర్వాత 4 నుంచి 5 గంటల లోపు ఒక్కసారిగా నామినేషన్లు వెల్లువెత్తాయి.
 
 రాహుకా లం చూసుకుని నింపాదిగా రావడంతో జెడ్పీ కార్యాలయం జనంతో జాతరను తలపించింది. ఈ ఒక్కరోజే జెడ్పీటీసీలకు 144 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు మండలాల్లో కూడా బుధవారం భా రీగా నామినేషన్లు దాఖలయయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు వరుసగా 781, 713 చొప్పున మం డల పరిషత్‌లకు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ మాత్రం కేవలం 136 నామినేషన్లతో సరిపెట్టుకుంది. మరోవైపు స్వతంత్రులు 86, బీజేపీ 27, సీపీఎం 24, బీఎస్పీ తరపున 12 నామినేషన్లు వేశారు.
 
 జిల్లాలో టీడీపీ తరపున జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న వేనాటి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.  చేజర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా (వైఎస్సార్‌సీపీ)  సల్మాసిరీన్ నామినేషన్ వేసేందుకు తన చంటిబిడ్డతో రావడం విశేషం. ఈమె ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదివారు. అలాగే సైదాపురం నుంచి పొట్టేళ్ల శిరీష సంసృ్కతం లెక్చరర్‌గా పనిచేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు.
 

Advertisement
Advertisement