‘ఫ్యాన్’ అంటే ప్రాణమే తీశాడు.. | Sakshi
Sakshi News home page

‘ఫ్యాన్’ అంటే ప్రాణమే తీశాడు..

Published Thu, May 8 2014 1:11 AM

‘ఫ్యాన్’ అంటే ప్రాణమే తీశాడు.. - Sakshi

ఇనగంటివారిపేట (సీతానగరం), న్యూస్‌లైన్ : తమ పార్టీకి కాక వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేశాడన్న ఆగ్రహంతో తెలుగుదేశం నాయకుడు ఓ వృద్ధుడిపై దాడి చేసి హతమార్చిన దారుణం మండలంలోని ఇనగంటివారిపేటలో జరిగింది. ఓటమి భయంతో  టీడీపీ వారు ఎంతకైనా బరి తెగించారనడానికి నిదర్శనమైన ఈ దురాగతం వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఓసీ కాలనీలో నివాసం ఉంటున్న కూలీ  మెర్ల దశయ్య(70)కు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, జననేత జగన్ అన్నా ఎనలేని అభిమానం. మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు తమ పార్టీకి ఓటు వేయమని దశయ్యకు డబ్బులు ఇవ్వజూపారు. అయితే ఆయన సొమ్ములు తీసుకోవడానికి నిరాకరించారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో దశయ్య ఓటేశారు.
 
 బయటకు వచ్చిన దశయ్యను అక్కడే ఉన్న మొన్నటి ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యునిగా పోటీ చేసిన మొగతడకల వెంకటమోహన్ ‘ఎవరికి ఓటు వేశావ’ని అడిగాడు. దశయ్య ఫ్యాన్ గుర్తుకు వేశానని చెప్పడంతో ఆగ్రహోదగ్రుడైన వెంకటమోహన్ ‘టీడీపీకి కాకుండా వైఎస్సార్‌సీపీకి ఓటేస్తావా.. డబ్బు పంపితే వద్దని వెనక్కి పంపుతావా?’ అంటూ దశయ్య గుండెలపై గుద్దుతూ కొంతదూరం నెట్టుకుంటూ వెళ్లాడు. కుప్పకూలిన దశయ్యను కొందరు ఓ ఇంటి అరుగుపై చేర్చి, గ్రామంలోని వైద్యునికి కబురు చేశారు. ఆయన వచ్చే సరికే దశయ్య మరణించినట్టు నిర్ధారించారు. దశయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న డీఎస్పీ కె.కృష్ణప్రసన్న, సీఐ సన్యాసిరావు హత్యా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ రాజానగర ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మి, యువనేత జక్కంపూడి రాజాలు దశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడు వెంకటమోహన్ పరారయ్యాడు.
 
 రాజన్న రాజ్యం రావాలని తపించిన దశయ్య
 టీడీపీ నేత దాడిలో అసువులు బాసిన దశయ్య గత నాలుగేళ్ల క్రితం ఆరోగ్యశ్రీ పథకంలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. వృద్ధాప్య పింఛన్ కూడా అందుకుంటున్నారు. వైఎస్‌ను ఆరోప్రాణంగా భావించిన ఆయన ఁరాజన్న రాజ్యం తిరిగి రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అనే వారురూ. అంటూ దశయ్య భార్య మాణిక్యం బావురుమంది. ఉదయం కూలిపనికి వెళ్లిన భర్త మధ్యాహ్నం భోజనం చేయగానే ఓటేయడానికి బయల్దేరగా తానే ఆపానని, మధ్యాహ్నం 3.30 గంటలకు టీ తాగి ఓటేయడానికి వెళ్లిన ఆయన తిరిగి మృతదేహమై వచ్చారని గుండెలు అవిసేలా విలపించింది.
 
 ముందే వీరంగమాడిన వెంకటమోహన్
 దశయ్యను హతమార్చిన టీడీపీ నేత వెంకటమోహన్ ముందు నుంచీ గ్రామంలో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాడని స్థానికులు చెప్పారు. టీడీపీకి మెజారిటీ రాకపోతే బాంబులతో ఊరిని పేల్చివేస్తానని, తన వద్ద ఉన్న రౌడీలతో హత్యలు చేయిస్తానని వీరం గం ఆడాడన్నారు. ప్రాదేశిక ఎన్నికలకు ముందు సహకార సంఘం అధ్యక్షుడు సత్యం దశరథుడిపై దాడి చేసిన వెంకటమోహన్ అంతటితో ఆగక ఆయనే తనపై దాడి చేసినట్టు ఎదురు కేసు పెట్టాడని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement