లక్నోలో రాందేవ్ కార్యక్రమాలపై నిషేధం | Sakshi
Sakshi News home page

లక్నోలో రాందేవ్ కార్యక్రమాలపై నిషేధం

Published Mon, Apr 28 2014 1:14 AM

లక్నోలో రాందేవ్  కార్యక్రమాలపై నిషేధం - Sakshi

లక్నో: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు హనీమూన్, పిక్‌నిక్‌ల కోసమే వెళ్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు బాబా రాందేవ్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే మే 16 వరకూ యూపీలోని లక్నోలో ఆయన కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.

అలాగే అమేథీలో ఈ నెల 30న ఆయన రోడ్ షో, మే 1న యోగా క్యాంపుపైనా నిషేధం విధించారు. రాందేవ్‌పై ఇప్పటికే లక్నో, సోన్‌భద్రాలలో శనివారం రెండు కేసులు నమోదవడం తెలిసిందే. కాగా, రాందేవ్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై దుష్ర్పచారం చేయరాదని ఈసీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
 
 

Advertisement
Advertisement