ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు | Sakshi
Sakshi News home page

ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు

Published Thu, Apr 3 2014 1:48 AM

ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు - Sakshi

ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
 ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు..  కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి      
 - ఎలక్షన్ సెల్, సాక్షి,
 రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్,
 లేదా election@sakshi.com కు
 మెయిల్ చెయ్యండి.
 
 మాది ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలం రామకూర్ గ్రామం. నేను ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు రాలేదు. స్థానిక బీఎల్‌వోను సంప్రదిస్తే స్పందన లేదు. వెరిఫికేషన్ సమయంలో ఇంటివద్ద ఉండాలంటున్నారు. నేను నూజివీడు త్రిబుల్‌ఐటీలో చదువుతున్నాను. ధ్రువీకరణ పత్రాలన్నీ నా తల్లిదండ్రులు చూపారు. ఆన్‌లైన్‌లో ఆధార్ చూపించాను. అయినా ఓటరు కార్డు రాలేదు.
 - ఎం.నాగూర్ మస్తాన్ వలీ
 
 మీ పేరు ఓటర్ల జాబితాలో చేర్చేందుకు జిల్లా కలెక్టరుకు సిఫారసు చేస్తున్నాం. విద్యార్థులు స్థానికంగా లేకపోయినా వారి స్వగ్రామంలో ఓటుహక్కు కల్పించేలా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మీ ధ్రువీకరణ పత్రాలను మీ తల్లిదండ్రులు ఎన్నికల సిబ్బందికి చూపితే ఓటర్ల జాబితాలో పేరు చేరుతుంది.
 మా కోడలు అంజుమ్ ఆరా పేరు షేర్‌లింగంపల్లి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు జనవరి 1 కన్నా ముందే దరఖాస్తు చేశాను. నా కోడలు తాను పేర్కొన్న అడ్రస్‌లో ఉండట్లేదని తిరస్కరించారు. దయచేసి మా కోడలు పేరు షేర్‌లింగంపల్లి ఓటర్ల జాబితాలో చేర్పించగలరు.
 - అనజీర్ అహ్మద్
 ceoandhrapradesh@eci.gov.in కు మీ పూర్తి వివరాలు తెలుపుతూ మెయిల్ చేయండి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
 
 నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి
 నవ తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా, రాజ కీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనా లంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందు కోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటిపై మీ అభిప్రా యాలు ‘సాక్షి’తో పంచు కోండి.
 ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్  లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి.

Advertisement

తప్పక చదవండి

Advertisement