చంద్రబాబు టీడీపీకి ఓటేయరా? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు టీడీపీకి ఓటేయరా?

Published Mon, Apr 28 2014 12:32 PM

చంద్రబాబు టీడీపీకి ఓటేయరా? - Sakshi

బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఆయన రాష్ట్రంలోని ప్రధాన పార్టీఅధినేత... ప్రతిపక్ష నాయకుడు కూడా... ప్రస్తుతం ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఊరూరూ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కానీ తన ఓటును మాత్రం ఈ ఎన్నికల్లో తన పార్టీకి వేయరు. ఆయనెవరో కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆశ్చర్యం గొలిపినా ఇది నిజం.

ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో తన పార్టీ టీడీపీకి ఓటు వేసుకోలేని పరిస్థితులను కల్పించుకున్నారాయన. ఎందుకంటే చంద్రబాబు నివాసం ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే జూబ్లీహిల్స్ కాలనీలో ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా బీజేపీకే కేటాయించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు నియోజకవర్గాల్లో తన పార్టీకి ఓటేసుకోలేని పరిస్థితి ఉత్పన్నమైంది.
 

Advertisement
Advertisement