మేత మరిగిన నేత | Sakshi
Sakshi News home page

మేత మరిగిన నేత

Published Fri, May 2 2014 12:55 AM

మేత మరిగిన నేత - Sakshi

ఎలక్షన్ సెల్: మూతపడిన అర్బన్ బ్యాంకులు
 మండిపడుతూనే ఉన్నారు డిపాజిటర్లు
 ప్రభుత్వ సంస్థల అమ్మకాలు
 ప్రైవేటు వ్యక్తులతో సంబరాలు
 టూరిజానికి ఇచ్చిన స్థలాలు
 బదులుగా వచ్చిన ముడుపులు
 మద్యం అక్రమాలు
 ముద్దుగా నజరానాలు
 సోమశిల భూములు
 బడాబాబులే బకాసురులు
 ఏలేరు స్కాములు..
 ఏలినవారే పాములు
 
 మాదాపూర్‌లో రహేజా
 మీరే అక్రమాలకు రాజా
 విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీ
 విజయవంతంగా తగిలింది లాటరీ
 టైమర్ల..తో నొక్కుళ్లు
 టైఅప్‌లతో వసూళ్లు
 స్కాలర్  షిప్పుల్లో అవినీతి
 సర్కారు సాగిందా రీతి
 వాటర్ షెడ్ పథకం..
 వాటాలే ప్రథమం
 పనికి ఆహారం..
 తమ్ముళ్లకు ఫలహారం
 నకిలీ స్టాంపుల కుంభకోణం
 నేటికీ నవ్వుతున్నారు జనం
 నెలకో స్కాం..
 రోజుకో అక్రమం
 మీ హయాం..
 అక్రమాల మయం
 మీ జమానా.. అవినీతి ఖజానా
 హరిగర్జన.. అచ్చేసింది అక్రమార్జన
 బీజేపీ చార్జిషీటు..
 బయటేసింది కేస్‌షీటు
 
 మేత మరిగిన నేతా
 మీరు మాట్లాడేదే నీతా
 బురదలో గురివిందా
 బరితెగించి పరనిందా
 నీతిబూర ఊదుతున్న నేతబీరా
 నవవికాస పురుషుడు మీరా..
 అని ప్రశ్నిస్తోంది.. తెలుగుప్రజ!
 
 బాబు డైరీ: బీజేపీ చార్జిషీట్
 విశాఖ పోర్టు భూముల కుంభకోణం
 విశాఖపట్నం పోర్టు ట్రస్టు సేకరించిన భూములకు చెల్లించిన నష్ట పరిహారం విషయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చాయి. భూ పరిమితి చట్టం కింద మిగులు భూమికి కూడా పరిహారం చెల్లించారని ఆరోపణ. విచారణ ఎంతకాలం నడుస్తుందో ఎవరికీ తెలియదు.
 
 పారదర్శకత లేని విద్యుత్ ఒప్పందాలు
 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1603 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ఒప్పదం చేస్తే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు అది అవినీతి ఒప్పందమని, రూ.250 కోట్లు చేతులు మారాయని నానా రభస చేసి తాము అధికారంలోకి రాగానే అదే కంపెనీతో రూ.2,384 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే 50 శాతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. రూ.1603 కోట్ల ఒప్పం దంలో రూ.250 కోట్లు చేతులు మారితే..రూ.2,384 కోట్ల ఒప్పందంలో ఎన్ని కోట్లు చేతులు మారి ఉంటాయో.
 
 ఎల్‌అండ్‌టీ ఇన్ఫోసిస్ ఒప్పందం
 హైదరాబాద్ సమీపంలోని మాదాపూర్‌లో ఇన్ఫోసిటీ నిర్మాణం కోసం ఎల్ అండ్ టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అతి చౌకగా భూమిని కేటాయించడంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫోసిటీ నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండానే ఎల్ అండ్‌టి సంస్థకు నిబంధనలను తుంగలో తొక్కి కట్టబెట్టడంపై విచారణకు డిమాండ్ చేసినా ప్రభుత్వం సంసిద్ధం కాలేదు. గ్లోబల్ టెక్నోయాడ్స్ సంస్థ ఒక చదరపు అడుగు అభివృద్ధి చేయడానికి రూ.2000లకు ముందుకు వస్తే, కాదని రూ. 2,700లకు ఎల్‌అండ్‌టి సంస్థకు ఇచ్చారు. చదరపు అడుగుకు రూ.500 ఎక్కువ కొటేషన్ వేసిన ఎల్‌అండ్‌టికి భవన నిర్మాణాన్ని అప్పగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement