మునిసి‘పల్స్’పై కుస్తీ | Sakshi
Sakshi News home page

మునిసి‘పల్స్’పై కుస్తీ

Published Tue, May 13 2014 3:39 AM

మునిసి‘పల్స్’పై కుస్తీ - Sakshi

 వరంగల్, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఫలితా ల తీరుతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకు లు సందిగ్ధంలో పడ్డారు. తెలంగాణ రా ష్ట్రంలో తొలి సర్కారు మాదంటే మాదం టూ భరోసా వ్యక్తం చేస్తున్న నేతలు విశ్లేషణల్లో మునిగిపోయారు. ఈ ఫలితాలు దేనికి సంకేతమనే చర్చ రెండు పార్టీల్లో జోరుగా సాగుతోంది. స్థానిక, సాధారణ ఎన్నికలకు పూర్తిస్థాయిలో ముడిపెట్టే పరిస్థితి లేకపోయినప్పటికీ వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మునిసిపోల్స్ పట్ట ణ ఓటర్ల నాడిని తెలియజేస్తే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలతో గ్రామీణ ఓటరు అంతరంగం బయటపడే అవకాశం ఉం దంటున్నారు. ఇదే తరహా రేపటి ఫలి తాలు వస్తాయనే వాదనలేనప్పటికీ.. ఒక అంచనాకు వచ్చేందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. అన్ని పక్షాలు  ఫలి తాల సరళిపై విశ్లేషించుకుంటున్నాయి.
 
 నేతల్లో భిన్నస్వరం
 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సానుకూల పవనాలు వీచాయని, 10కి తక్కువ కాకుండా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామనే అంచనాతో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు సందిగ్ధంలో పడ్డారు. ఏకపక్షంగా ఫలితాలుండే సవాలే లేదంటూ.. ఐదు స్థానాల్లోనైనా తాము విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ నేతల్లో మనోధైర్యం పెరిగింది. ఈ ఫలితాల తీరుతో పూర్తిస్థా యి గెలుపు ఆశలు లేకపోవడంతో డీలా పడుతున్నారు. నిన్నటికి, నేటికి నేతల్లో భిన్నస్వరం వినిపిస్తోంది. స్థానిక, సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా నెలరోజుల తేడాతో జరిగాయి. ఈలోపే ఓటర్లు పూర్తిగా మారే అవకాశం లేదని, ఈ ఫలితాలు పట్టణ ఓటర్ల నాడికి ప్రతిబింబంగాకొందరు, రెండింటి ఫలితాలు భిన్నంగా ఉంటాయని మరికొందరు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇదే తరహాలో ఉండే అవకాశం ఉందని, ఏకపక్షంగా ప్రజాతీర్పు ఉండే అవకాశం లేదనే చర్చలు సాగుతున్నాయి.
 
 మిశ్రమ ఫలితం
 జనగామ, పరకాల, భూపాలపల్లి, నర్సం పేట, మహబూబాబాద్ ఈ ఐదు అసెం బ్లీ కేంద్రాలుగా ఉన్నాయి. పట్టణ ఓటర్లతోపాటు పరిసర ప్రాంతాలను రాజకీయంగా ప్రభావితం చేసే సెంటర్లుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి ముఖ్య నాయకులు నిన్నటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.

జనగామ నుంచి మాజీ మంత్రి పొన్నాల, భూపాలపల్లి నుంచి మాజీ చీఫ్‌విప్ గండ్ర, మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే కవిత , పరకాల నుంచి టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి, నర్సంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ప్రాతినిధ్యం విహ స్తున్నారు. ఈ ఎన్నికల్లో పట్టుకోసం దృఢ సంకల్పంతో పనిచేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో సర్వశక్తులొడ్డారు. జనగామ, నర్సంపేట మినహా మిగిలిన మూడు సెంటర్లలో మిశ్ర మ ఫలితమే రావడంతో ఇరువైపుల అయోమయం నెలకొంది. ఇదే తరహాలో సార్వత్రిక ఎన్నికల  ఫలితాలుంటాయనే ఆందోళన నెలకొంది. ఇక ఓట్ల చీలిక గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు.
 
 క్షేత్రస్థాయిలో పట్టు

 టీఆర్‌ఎస్‌తో పోల్చితే తమకు క్షేత్రస్థాయిలో నిర్మా ణం, కేడర్ బలంగా ఉందనేది కాంగ్రెస్ వాదన. గ్రామస్థాయిలో పూర్తి బలంలేని టీఆర్‌ఎస్‌కు ఈ స్థాయి ఫలితాలు రావడంతో కొంత వణుకుపుడుతోంది. నిర్మాణపరంగా బలహీనతలున్నప్పటికీ, తెలంగాణ సానుకూల పవనాలు తమకు పూర్తి అం డగా నిలుస్తాయనే ధీమాతో టీఆర్‌ఎస్ నేతలున్నారు. పట్టణ ఓటర్లు తమకంటే కాంగ్రెస్‌కు కొంత మొగ్గు చూపడం టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement