ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా... | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా...

Published Mon, Apr 21 2014 1:16 AM

గాంధీనగర్‌లో ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - Sakshi

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రం నుంచి నార్కట్‌పల్లి రోడ్డు మధ్య ఐటీ కంపెనీలు తీసుకువచ్చి స్థాపిస్తానని, నిరు ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తానని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.  

ఆదివారం 7, 8, 12, 13, 15, 16, 37, 38, 39వ వా ర్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి వెళ్లి తనకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఐటీ కంపెనీలు, మెడికల్ కాలేజీ తీసుకువరావడానికి ప్రణాళిక రూపొందించామన్నారు.

 తెలంగాణలో జిల్లాను రాష్ట్రంలోనే హైదరాబాద్ అంతటి మహా నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే మరింతగా చేసి చూపెడతానని స్పష్టం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుం దన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు.

శ్రీశైలం సొరంగ మార్గానికి గతం లో  2000 కోట్లు మంజూరు చేయించానని, దానిని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చేయిస్తానని తెలిపారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు కూడా సాగర్ ఆయకట్టులాగా మారుతాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పంట కాల్వలను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించడమే తమ ధ్యేయమన్నారు.

పానగల్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా చేసేందుకు 50 లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. ఫౌంటెన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తనను అం దరికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అలంపల్లి మల్లేష్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గాదె వినోద్‌రెడ్డి, ముదిరెడ్డి కళావతి, కాసరాజు వాసు, గౌతం నాయుడు, నాంపల్లి శ్రీని వాస్, బొడ్డుపల్లి శ్రీను, ఎ.శ్రీను, లక్ష్మీ, కవిత, శ్రీని వాస్, అల్లి వేణు, ఎం.వెంకన్న, మధుసూదన్,  శ్రీనివాస్, కోమటిరెడ్డి దశరథరెడ్డి, బాబా, ఖయ్యూంబేగ్,  అబ్బగోని రమేష్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement