వలస ఓటర్లకు గాలం..! | Sakshi
Sakshi News home page

వలస ఓటర్లకు గాలం..!

Published Tue, Apr 8 2014 1:59 AM

వలస ఓటర్లకు గాలం..! - Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ప్రాదేశిక పోరులో వలస ఓటర్లు కీలకంగా మారారు. వారు ఏ అభ్యర్థికి ఓటువేస్తే వారే విజేతగా నిలిచే పరిస్థితి కొన్ని గ్రామాల్లో నెలకొంది. పదుల సంఖ్యలో ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తుండడంతో వారిని రప్పించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికీ తమ అనుచరులను ఆయూ ప్రాంతాలకు పింపించారు కూడా. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 86 ఎంపీటీసీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎచ్చెర్లలో 25, రణస్థలంలో 25, లావేరులో 20, జి.సిగడాంలో 16 స్థానాలు ఉన్నాయి. లావేరులో రెండు స్థానాలు ఏక గ్రీవమైన సంగతి తెలిసిందే. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో వలస ఓటర్లే ఎక్కువ. వీరిపైనే ఎంపీటీసీల విజయం ఆధారపడి ఉంది. 
 
ఎచ్చెర్ల మండలంలో డి.మత్స్యలేశం, అజ్జరాం, కుప్పిలి, ఎస్.ఎస్.ఆర్.పురం, కొయ్యాం, పొన్నాడ గ్రామాల్లో వలస ఓటర్ల పైనే అభ్యర్థుల భవితవ్వం ఆధారపడి ఉంది. దీంతో అభ్యర్థులు ఇప్పటికే వారిని రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. లావేరు మండలంలో మురపాక, చిన మురపాక, గురుగుబెల్లి, లింగాల వలస, రణస్థలం మండలంలోని కొచ్చెర్ల, కొవ్వాడ మత్స్యలేశం, జీరుపాలేం, ఎం.జి.వలస,  జి.సిగడాం మండలంలోని ఆనందపురం, బాతువ, జి.సిగడాం, చెట్టు పొదె తెం, ఎస్.భీమవరం వంటి గ్రామాలకు చెం దిన వారు గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్, సూరత్, బెంగళూరు, చెన్నై, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దగ్గరగా ఉన్నవారిని రప్పిం చేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. 11వ తేదీ నాటికి ఓటు వేసేందుకు రావాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఒకటి, రెండు ఓట్లు తేడా వస్తుందనుకున్న అభ్యర్థులుదూరప్రాంత ఓటర్లను కూడా తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. గెలుపే ధ్యేయం కావడంతో డబ్బుల ఖర్చుకు వెనుకంజ వేయడంలేదు. 
 

Advertisement
Advertisement