ఈవీఎంను ఎత్తిపడేసిన మాజీ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

ఈవీఎంను ఎత్తిపడేసిన మాజీ ఎమ్మెల్యే

Published Mon, Mar 31 2014 2:19 AM

ఈవీఎంను ఎత్తిపడేసిన మాజీ ఎమ్మెల్యే - Sakshi

మాచర్ల టౌన్, న్యూస్‌లైన్ :ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు తహశీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన 29వ వార్డు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఈవీఎంను టేబుల్‌పై ఎత్తి పడేశారు. మీటరు నొక్కే ఈవీఎంను కూడా చేతితో బలంగా కొట్టారు. ఈ ఘటనఆదివారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో చోటుచేసుకుం ది. పోలింగ్‌అధికారులు నిరోధిస్తున్నా పట్టించుకోకుండా కండ్లకుంట గ్రామానికి చెందిన వారి ఓట్లను మీరు ఇక్కడ వేయిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగి పోతూ ఈవీఎంను ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈవీఎం టేబుల్‌మీద పడగానే పోలీసులు, అర్బన్ సీఐ తుపాకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో లకా్ష్మరెడ్డిని బయటకు నెట్టుకువస్తుండగా..
 
అదే సమయంలో ఓటు వేసేం దుకు వచ్చిన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని దూషిస్తూ చొక్కా పట్టుకోబోయారు. దీంతో వెంకట్రామిరెడ్డి ఓటుహక్కు కోసం వచ్చిన నాపై దౌర్జన్యం చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ పడబోయారు. దీంతో పోలీసులు లకా్ష్మరెడ్డిని తహశీల్దార్ కార్యాలయంలోకి తీసుకువెళ్లగా.. వెంకట్రామిరెడ్డి పార్టీ నాయకులతో కలసి లకా్ష్మరెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు కలుగజేసుకొని ఈవీఎం ధ్వంసం చేసి ఉంటే కేసు నమోదు చేసి అరెస్టుచేస్తామని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరి వైఎస్సార్ సీపీ నాయకుల ను పంపించివేశారు. ఈవీఎం మరమ్మతుకు లోనవడంతో పోలింగ్ ఆగిపోయి ఓటర్లలో ఆందోళన నెల కొంది. 
 
ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఆర్‌వో ఢిల్లీరావు పోలింగ్ కేంద్రానికి హుటాహుటిన చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో క్లిప్పింగ్‌లు, పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న పోలీసులను విచారించి లకా్ష్మరెడ్డిని బాధ్యుడిగా గుర్తించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అతడ్ని అరెస్టు చేయాలని సీఐ మురళీకృష్ణను ఆదేశించారు. లకా్ష్మరెడ్డి అరెస్టు విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడకు చేరుకొని లకా్ష్మరెడ్డిని అదుపులోకి తీసుకొని తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రిటైర్డ్ ఐజీ నర్సయ్య, టీడీపీ నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి, మండవ రవి, చలమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, కుర్రి శివారెడ్డి, మురళీధర్‌రెడ్డి, నిమ్మగడ్డ వాసు, కజ్జం సైదయ్యలతోపాటు పలువురు అక్కడకు చేరుకొని ఆందోళనకు సిద్ధమయ్యారు.
 
 సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని పోలీసులు చెబుతున్నా వినిపించుకోకపోవడంతో గురజాల డీఎస్పీ పూజ టీడీపీ నాయకులతో మాట్లాడుతూ లాఠీచార్జి చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. అయినా వాదనలు చోటుచేసుకోవడంతో.. మాచర్లలోనే మకాం వేసి ఉన్న గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరకుని పరిస్థితిని సమీక్షించారు. నాయకులతో మాటలు ఏమిటి, గొడవకు కారణమైన వారిని అరెస్టు చేయండి, ఎవరైనా మాట వినకపోతే లాఠీచార్జి చేయమని చెబుతున్నా టీడీపీ నాయకులు వెనక్కి తగ్గకపోవడంతో ఐజీనే స్వయంగా లాఠీచేపట్టడంతో డీఎస్పీ, ఏపీఎస్పీ, ఎస్‌ఐలు.. టీడీపీ నాయకులపై లాఠీచార్జి చేశారు.
 
ఈ సమయంలో మండవ రవి చేతికి స్వల్పగాయమైంది. అకారణంగా లాఠీచార్జి చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు వాదనకు దిగడంతో వారిని తహశీల్దార్ కార్యాలయానికి ఎదురు వీధి వరకు తరిమికొట్టారు. అప్పటికీ కొంతమంది ఎదురు తిరగడంతో టీడీపీ నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి, మండవ రవి, లచ్చయ్యచౌదరి, మాజీ సర్పంచి ముళ్లమూడి కోటేశ్వరరావులతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని జీపులో స్టేషన్‌కు తరలించారు. 144 సెక్షన్‌ను అతిక్రమించి రోడ్డుపై ఎవరుంటే వారిని అరగంటకు పైగా పోలీసులు తరమికొట్టారు. ఐజీ సునీల్‌కుమార్ స్వయంగా పోలింగ్ కేంద్రం వద్ద మకాం వేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మరమ్మతులకు గురైన ఈవీఎంను అధికారులు పరి శీలించి డేటాకు ఇబ్బందిలేదని గుర్తిం చారు. మరో ఈవీఎంను ఏర్పాటుచేసి మిగతా పోలింగ్‌ను పూర్తి చేశారు. 
 

Advertisement
Advertisement