‘నోటా’కు గుర్తు కేటాయించండి | Sakshi
Sakshi News home page

‘నోటా’కు గుర్తు కేటాయించండి

Published Tue, Apr 8 2014 5:58 AM

High court tells Election commission to allot symbol for NOTA

ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఏ అభ్యర్థీ నచ్చనప్పుడు ‘నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా)’ సౌలభ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఓటర్లకు ఉన్నందున, ఆ నోటాకు ఒక నిర్దిష్ట గుర్తును కేటాయించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వీలైతే ఈ ఎన్నికల్లోనే నోటాకు గుర్తు కేటాయించాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లోనైనా తప్పనిసరిగా గుర్తు ఇచ్చి తీరాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటాకు ఏదో ఒక గుర్తు కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రచయిత పి.సౌధ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement