ఈసీపై జయ ఫైర్ | Sakshi
Sakshi News home page

ఈసీపై జయ ఫైర్

Published Fri, Apr 4 2014 11:47 PM

jaya fire on election commission

 ప్రజాస్వామ్యంపై అవహేళనంటూ వ్యాఖ్యలు
  కోర్టులో పిటిషన్‌కు సిద్ధం
  నిబంధనలు పాతవే : గోపాలస్వామి

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి : ఎన్నికల సమయంలో సాధారణంగా అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం సాగుతుంది. రాష్ట్రంలో మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, ఎన్నికల కమిషన్ మధ్య మొదలైన వాగ్యుద్ధం కోర్టులో పిటిషన్ వేసే దశకు చేరింది. ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చును ఖచ్చితంగా లెక్కకడుతున్న ఎన్నికల కమిషన్ ప్రచారవేదికలపై దృష్టి సారించింది.


 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై అభ్యర్థితోపాటు పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ నేత ఉన్నపక్షంలో ఆ సభకు పెట్టిన ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి చేరుతుందని ప్రకటించింది. ఈ ప్రకటనపై జయలలిత తీవ్రంగా మండిపడ్డారు. ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల పేరుతో కమిషన్ ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎన్నికల సమయంలో ప్రజలు తమ అభిమాన నేతల కోసం వేదిక, బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితరాలు ఏర్పాటు చేయడం సహజమని పేర్కొన్నారు. 1952లో తొలి ఎన్నికల నుంచి అన్నాదురై, ఎంజీఆర్ తదితరుల హయూంలో కూడా అదే పంథా కొనసాగిందని చెప్పారు. 2014లో మాత్రం  ఎన్నికల కమిషన్ నిబంధనల పేరుతో విపరీ త ధోరణికి పోతోందని విమర్శించారు. ప్రజ లు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనను సైతం స్తం భింపజేస్తోందని దుయ్యబట్టారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తున్నట్టు భావిస్తున్నామని తెలిపారు.


ఎన్నికల కమిషన్ చర్యలను నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు జయలలిత ప్రకటించారు. నిబంధనలు పాతవే: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ముందుగా ఈసీ ప్రవేశపెట్టిన నియమ నిబంధనలను తెలుసుకోవాలని మాజీ ప్రధా న ఎన్నికల కమిషనర్ గోపాలస్వామి తెలి పారు. నేతల అవగాహన లేమి అధికారుల తప్పు కాదని వ్యాఖ్యానించారు. ఓటర్ల చైతన్యం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెన్నై మెరినా బీచ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన అవగాహన ప్రదర్శనను ఆయన ప్రారంభిం చారు. మూడు రోజులు కొనసాగే ఈ ప్రదర్శ న ద్వారా ఓటు ప్రాధాన్యత, ఓటుకు నోటు కూడదు, పార్టీకి ఓటు వేయగానే ఏ పార్టీకి పడిందో ఈవీఎంలో చూసి తెలుసుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.


ఈ సందర్భంగా జయ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎన్నికల నిబంధనలు కొత్తవేమీ కాదన్నారు. 1975 నుంచి ఉన్నవేనని బదులిచ్చారు. ప్రచార వేదికల ఖర్చును అభ్యర్థిపై మోపడం సరికాదనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నిబంధనలు ఉన్న సంగతిని అభ్యర్థులు, పార్టీ అధినేతలు తెలుసుకోకపోవడం వారి తప్పని వివరించారు. ఈ అంశంలో ఈసీని తప్పుబట్టడం సరికాదన్నారు.

 రాత్రి 10 గంటల తర్వాత కూడా ప్రచారం చేసుకోవచ్చని ఈసీ ప్రకటించడాన్ని మీడియా ప్రశ్నించగా అభ్యర్థులు ఒంటరిగా వెళ్లి ఓటరును కలిసి ఓటు అభ్యర్థించుకోవచ్చన్నారు. రాత్రి వేళ ఇబ్బందిపెడుతూ ప్రచారం చేసినప్పుడు ప్రజలు దాడి చేస్తే దెబ్బలు తిన క తప్పదని, ఇందుకు ఎవ్వరూ బాధ్యులు కారని ఆయన హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement