Sakshi News home page

‘రెడ్‌జోన్’ ఊసేదీ?

Published Sun, Apr 6 2014 10:58 PM

పుణేలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ అజహరుద్దీన్, - Sakshi

ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా రెడ్‌జోన్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. దీని పరిధిలో అనేకమంది తెలుగువారు కూడా నివసిస్తున్నారు. ఇళ్లను నిర్మించి 12 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఖాళీ చేయాలంటూ రక్షణ విభాగం నోటీసులు ఇచ్చిందని, ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు.


 
 పింప్రి, న్యూస్‌లైన్: మావల్ లోక్‌సభ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క నాయకుడూ రెడ్‌జోన్ అంశాన్ని ప్రస్తావించడం లేదు. ఈ నియోజకవర్గం పరిధిలో సుమా రు ఐదు లక్షలమందికిపైగా రెడ్‌జోన్ బాధితులున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకు డు తమకు భరోసా ఇవ్వడం లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.


 ఈ జోన్ పరిధిలో వేలాదిమంది తెలుగు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. డిసెంబర్ 2002లో కేంద్ర ప్రభుత్వం దేహూరోడ్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిం చింది. అయితే రెడ్‌జోన్ పరిధి ఎంత అనే విషయం తెలియకపోవడం తో అప్పట్లో అనేకమంది ఆ పరిసరాల్లో గృహనిర్మాణాలను చేపట్టారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత రక్షణ విభాగం ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఆయా కుటుం బాలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీకి 2,000 గజాల పరిధిని సంబంధిత అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.


 ఇందులో మామ డి, వికాస్‌నగర్, దేహూరోడ్ బజార్, చించోలి, కిన్హాయి, తలవడే, దేహూ, జెండా మలా, రావత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు, నిగిడి ప్రాధికరణ్, రూపీ నగర్‌లు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వేలాదిమంది తెలుగు ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యం లో రెడ్‌జోన్‌ను రద్దు చేయాలని లేదా దాని హద్దును తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం స్థానికులంతా ఏకతాటిపైకి వచ్చి ఇటీవల రెడ్‌జోన్ సంఘర్షణ సమితిని ఏర్పా టు చేసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీని కలసి చర్చలు జరిపారు.


 అయినా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజన మూ కలగలేదు. మావల్ నియోజక వర్గంలోని ఆరు శాసనసభ నియోజక వర్గాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో భాగమైన చించ్‌వాడ్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఉంటున్న తెలుగువారు ఎన్నికలపై తమ తమ  అభిప్రాయాలను వెలిబుచ్చారు.

Advertisement
Advertisement