ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు

Published Mon, Apr 14 2014 3:09 AM

ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు - Sakshi

 - రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం: ఎమ్మెల్యే మేకపాటి
 
 జలదంకి, న్యూస్‌లైన్: ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు కావడం తథ్యమని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నవరం, తిమ్మసముద్రం, కేశవరం, చింతలపాళెం, గట్టుపల్లి, 9వ మైలు, చిన్నక్రాక, నాగిరెడ్డిపాళెం, కోదండరామాపురం తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మేకపాటి మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే అందరం వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఆల్‌ఫ్రీ అనే మాయమాటలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు.

 రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. వైఎస్సార్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్ సీఎం అయితే వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళల జీవితాలు మారుతాయన్నారు.

 నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తన సోదరుడు రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి,

 రావిప్రసాద్, ఎస్వీ శేషారెడ్డి, మేకల మహేశ్వరావు, లేటి సుధీర్, గద్దె బ్రహ్మయ్య, గొట్టిపాటి ప్రసాద్‌నాయుడు, ఇస్కామదన్ మోహన్‌రెడ్డి, వాకా మాధవరెడ్డి, గంగపట్ల మాలకొండయ్య, గుర్రం జగ్గయ్య, పులి మాల్యాద్రి, యడ్ల మాల్యాద్రిరెడ్డి, వట్టికాల బాలయ్య, బీవీ కృష్ణారెడ్డి, వాకా పద్మనాభరెడ్డి  పాల్గొన్నారు.

Advertisement
Advertisement