* పవన్‌కల్యాణ్‌పై మోడీ పొగడ్తల వర్షం
* చంద్రబాబును లైట్ తీసుకున్న పవన్
సాక్షి, హైదరాబాద్ : మోడీ సభల ద్వారా తానూ ప్రచారం పొందాలని భావించిన చంద్రబాబునాయుుడికి అదేమీ దక్కకపోగా, కొంత భంగపాటే మిగిలింది. చంద్రబాబు తన ప్రసంగంలో నరేంద్రమోడీని ఆకాశానికెత్తినా.., ఇటు మోడీగానీ, అటు పవన్‌కల్యాణ్ గానీ వారి ప్రసంగాల్లో చంద్రబాబును పెద్దగా ప్రస్తావించలేదు. బాబును మోడీ పక్కనే కూర్చోబెట్టుకున్నప్పటికీ, టీడీపీ అధినేత గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. పైగా, పవన్‌కల్యాణ్‌ను పొగడ్తల్లో వుుంచెత్తారు. దీంతో బాబు మొహం వెలవెలబోరుుంది.
‘ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర కలిసి మొత్తం తెలుగు స్ఫూర్తిని పవన్‌కల్యాణే రక్షించగలడు’ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మింగలేక, కక్కలేక అన్నట్లుగా వూరారుు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబును లైట్‌గానే తీసుకున్నారు. హైదరాబాద్‌లో వేదికపైనే ఉన్న బాబను పవన్ అంతగా పట్టించుకోలేదు. నిజానికి మోడీ సభల విషయంలో బీజేపీ చంద్రబాబును చాలా తేలిగ్గా తీసుకుంది. తీవ్ర స్థారుులో ఒత్తిళ్లు, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను వుుందుపెట్టి బ్లాక్మెరుులింగుకు దిగడంతో చివరకు రాజీపడి హైదరాబాద్, వుహబూబ్‌నగర్ సభల్లో పాల్గొనటానికి వూత్రం బాబును అనువుతించింది.
కేసీఆర్‌పై సంయువునం!: ‘లెక్కల్లో వుూడు ఒకట్లు కలిస్తే మూడవుతుంది. కానీ మోడీ, బాబు, పవన్‌కల్యాణ్ కలిస్తే అది నూటా పదకొండు అవుతుంది’ అంటూ మోడీ హైదరాబాద్ సభలో కొత్త లెక్కొకటి వినిపించారు. మోడీ సభల్లో చంద్రబాబుకు ఇదొక్కటే ఉపశవునం! అది తప్ప మోడీ ఎక్కడా చంద్రబాబు, టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు. రాష్ట్రంలో పర్యటించిన సోనియూ, రాహుల్‌లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడినా, మోడీ వూత్రం ‘ఒక కుటుంబానికి తెలంగాణను అప్పగించకూడద’నే ఒక్క వ్యాఖ్యకే పరిమితవుయ్యారు. కేసీఆర్‌పై పవన్ కల్యాణ్ మండిపడినా, మోడీ మాత్రం సంయమనం పాటించారు.
కేంద్రంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే మోడీ టీఆర్ఎస్ నేత కేసీఆర్ జోలికి వెళ్లలేదని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి గత ఆగస్టులో ఇదే స్టేడియుంలో జరిగిన సభలో మోడీ తెలంగాణ కోణంలో పెద్దగా వూట్లాడలేదని, ఆయన ప్రసంగం తెలంగాణలోని పార్టీ శ్రేణులకే నచ్చలేదని బీజేపీ వుుఖ్యులు విశ్లేషించారు. దీంతో ఈసారి తెలంగాణ కోణంలో వూట్లాడాలని మోడీకి వుుందుగానే సూచించారు. అయినా, ఆయన మంగళవారం జరిగిన సభల్లో ‘కాంగ్రెస్ తెలంగాణకు పురుడు పోయుటానికి తల్లిని చంపేసింది’ లాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ తెలంగాణ శ్రేణులకు రుచించలేదు. మోడీ ప్రసంగాల్లో పీవీ నరసింహారావు, అంజయ్యులకు జరిగిన అవవూనాలను పదే పదే ప్రస్తావించారు. ఇది ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా లేదని పార్టీ వుుఖ్యులే అంటున్నారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు తెలుగువారిని అవవూనించినట్లే ఉందన్న మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు అపార్థం చేసుకునే అవకాశముందని వారు భావిస్తున్నారు.
‘టీడీపీతో పొత్తు పెట్టుకోవడంవల్ల ఇరు ప్రాంతాలకూ నచ్చేలా మోడీ వూట్లాడాల్సి వచ్చింది. తెలంగాణకు సంబంధించి మోడీ వూటల్లో పంచ్ లేకపోవటానికి ఇదే కారణం’ అని ఓ సీనియర్ నేత అన్నారు. పైగా, పవన్ ప్రసంగమూ తమను ఇరకాటంలోకి నెట్టిందని చెప్పారు. ‘నిజామాబాద్ సభలో పవన్‌కల్యాణ్ జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తెలంగాణవాడినని చెప్పారు. కానీ, హైదరాబాద్‌కు వచ్చేసరికి సీవూంధ్రపై ఎవరు ఏం వూట్లాడినా సహించేది లేదన్నట్లు వూట్లాడారు. దీంతో మేం ఈ సభల ద్వారా ఏం చెప్పుకోగలిగామో వూకే అర్థం కావడంలేదు’ అంటూ పెదవి విరిచారు.
Breadcrumb
Related news
-
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్‌కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు. పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వేలం పాటలా పోటీ పడి హామీలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు. దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు. సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం. -
బాబు కిచిడీ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభపడటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడుదల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పేసుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.అరువు తెచ్చుకున్న సూపర్ సిక్స్చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది. వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.అవినీతి అమరావతిని మళ్లీ కడతారటఅధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీచంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందులోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దుస్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్ చర్యలు చేపట్టారు. బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.ఇది మరో రకం మోసంఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా, గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. బీసీలకు బురిడీచంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. మరోసారి మహిళలను మోసం చేసేలా..స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.ఆరోగ్యశ్రీకి మంగళమే!సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. విద్యా రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్‌ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..» సీఎం జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని అనడం కొసమెరుపు.» 2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్ జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయనొచ్చి చేసేదేముంది?» నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్యపెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.» వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.» గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.» నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. » మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.» వైఎస్సార్సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.» వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ సరఫరా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.» వైఎస్ జగన్ సీఎం కాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.» సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చేస్తాననడం ప్రజలను వంచించడమే కదా? -
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్‌ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి -
గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ భూపాలపల్లి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లభించవని, బలహీన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆత్మ బీజేపీ నేత అమిత్ షాను ఆవహించిందని, ఆ రెండు పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో గూడు పుఠాణి చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అనామకులకు ఎంపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టామని, ఇప్పుడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ పౌరుషం గుజరాత్‌కు తెలిసేలా మోదీని ఓడించాలని ప్రజలను కోరారు. ఫైనల్స్‌లో మోదీ, అమిత్‌షాలను ఓడించి, రాహుల్‌గాం«దీని ప్రధానిని చేసినప్పుడే మనం గెలిచినట్లు అని పేర్కొన్నారు. ‘గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం..’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ శివారు బాలాపూర్, బడంగ్పేట్, సరూర్‌నగర్‌లో, మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్లో రోడ్ షో అనంతరం కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు ‘కులగణన చేపట్టి దామాషా ప్రకారం బలహీనవర్గాలకు రిజర్వేషన్లు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటే, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందో మోదీ సమాధానం చెప్పాలి. బీజేపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గద్దె దించుతారు. ప్రధానిగా మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. బండి సంజయ్ కరీంనగర్‌కు తెచ్చిందేమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప. గుండు అర్వింద్, అరగుండు సంజయ్‌లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. పదేళ్లలో మోదీ కర్ణాటకకు చెంబు, ఏపీకి పాచిపోయిన లడ్డూలు, మట్టి, నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు..’ అని రేవంత్ ఎద్దేవా చేశారు. మోదీ, షాలకు కర్రుకాల్చి వాత పెట్టాలి ‘మోదీ అన్ని రకాలుగా మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్‌లను రద్దు చేశారు. ఏటా ఐదు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మోసం చేసినందుకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అదే విధంగా నరేంద్ర మోదీకి, అమిత్‌షాకు కర్రు కాల్చి వాత పెట్టాలి..’ అని సీఎం అన్నారు. సైనికుల్ని పంపించినా భయపడేది లేదు ‘తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధిస్తుంటే వాటి మూలాలు గుజరాత్లో వెలుగు చూస్తున్నాయి. కేసీఆర్ ఉపన్యాసాన్ని మోదీ నకలు కొట్టారు. నన్ను తిడితే ఏం వస్తుంది? సలహాలు ఇవ్వాల్సింది పోయి అడ్డగోలుగా తిట్టిపోయిండు. కేసీఆర్, కిషన్‌రెడ్డి కూడా ఇదే పని చేస్తున్నారు. తిట్టడానికి ఇంత దూరం రావలసిన అవసరం లేదు. హైదరాబాద్ మెట్రో రైలుకు నిధులు కేటాయించలేదు. బుల్లెట్ రైలు ఇవ్వలేదు. వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్డు రాకుండా ప్రధాని అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన నన్ను కేసీఆర్ తరహాలోనే అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కేసీఆర్ బెదిరిస్తేనే భయపడలేదు. తాజాగా మోదీ ఢిల్లీ పోలీసులను పంపాడు. వాళ్లకు భయపడతామా? సైనికుల్ని పంపించినా భయపడేది లేదు. రేవంత్‌రెడ్డికి జైలు కొత్త కాదు..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం రాముడి అక్షింతలు పంచారు ‘అయోధ్యలో రాముడి కల్యాణానికి 15 రోజుల ముందే రాజకీయం కోసం శ్రీరాముడి అక్షింతలు ఇంటింటా పంచి బీజేపీ అవమానించింది. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్న విషయాన్ని హిందువులందరూ ఆలోచించాలి. మనమందరం హిందువులం కాదా? రామభక్తులం కాదా? అయినా ఓట్ల కోసం హిందుత్వాన్ని ఎప్పుడూ వాడుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. ఇండియా కూటమిలోకి కేసీఆర్‌ను తీసుకోం ‘బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌ను ఓడించేందుకు, బీజేపీని గెలిపించేందుకు పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను కేసీఆర్ పోటీలో నిలిపారు. బీఆర్ఎస్ను ఇండియా కూటమిలోకి తీసుకోం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టింది. కేసీఆర్ మళ్లీ పగటి కలలు కంటున్నాడు. వంద రోజుల్లోనే కాంగ్రెస్‌ను దిగిపోవాలంటున్నాడు. నేను ప్రజల మద్దతుతో సీఎం అయ్యా. ఏడాది కాదు..కేసీఆర్? నీ జీవితం మొత్తం ఎదురు చూసినా మళ్లీ నీకు సీఎం పదవి రాదు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సుయాత్ర ఉంది..’ అని సీఎం విమర్శించారు. కొండా రాజ్యసభ సీటు కొనుక్కోవచ్చు ‘మాజీ మంత్రి సబితమ్మ పొద్దున కారు గుర్తు అంటుంది. రాత్రిపూట కమలం గుర్తుకు ప్రచారం చేస్తుంది. సొంత పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయాన్ని కూడా ఓ వ్యాపారంగా చూస్తున్నాడు. పదేళ్లు తెలంగాణను మోసం చేసిన మోదీ పక్కన చేరి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. వందల కోట్లు ఉన్న కొండాకు నిజంగానే ప్రజా సేవ చేసే ఆలోచన ఉంటే.. రూ.కోట్లు పెట్టి ఏ రాజ్యసభ సీటో కొనుక్కోవొచ్చు..’ అని రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకా‹Ùరెడ్డి, కేఈఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కరీంనగర్, వరంగల్, చేవెళ్ల పార్టీ అభ్యర్థులు వెలిచాల రాజేందర్రావు, కడియం కావ్య, గడ్డం రంజిత్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతి జమ్మికుంట (హుజూరాబాద్): జమ్మికుంటలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ (68) వడదెబ్బకు గురై సభలోనే కుప్పకూలింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐలమ్మ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ హామీ ఇచ్చారు.
Related News by category
-
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్‌కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు. పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వేలం పాటలా పోటీ పడి హామీలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు. దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు. సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం. -
బాబు కిచిడీ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభపడటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడుదల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పేసుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.అరువు తెచ్చుకున్న సూపర్ సిక్స్చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది. వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.అవినీతి అమరావతిని మళ్లీ కడతారటఅధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీచంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందులోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దుస్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్ చర్యలు చేపట్టారు. బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.ఇది మరో రకం మోసంఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా, గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. బీసీలకు బురిడీచంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. మరోసారి మహిళలను మోసం చేసేలా..స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.ఆరోగ్యశ్రీకి మంగళమే!సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. విద్యా రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్‌ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..» సీఎం జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని అనడం కొసమెరుపు.» 2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్ జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయనొచ్చి చేసేదేముంది?» నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్యపెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.» వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.» గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.» నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. » మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.» వైఎస్సార్సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.» వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ సరఫరా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.» వైఎస్ జగన్ సీఎం కాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.» సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చేస్తాననడం ప్రజలను వంచించడమే కదా? -
వైఎస్సార్ పేరును కాంగ్రెస్సే ఇరికించింది
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగా వైఎస్సార్ పేరును కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించానని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్‌ను కాంగ్రెస్ పార్టీ దోషిగా చిత్రీకరించే కుట్రలను అడ్డుకునేందుకు తాను న్యాయపరంగా పోరాటం చేశానన్నారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచన చేరి తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్న షర్మిల వ్యాఖ్యలను వీడియోలను ప్రదర్శించి పొన్నవోలు వినిపించారు. వైఎస్సార్‌పై కేసులు పెట్టింది కాంగ్రెస్ అన్న షర్మిల.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నాతో ఎవరూ కేసులు వేయించలేదు.. కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్సార్ పేరును అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. ‘వైఎస్సార్ పేరును కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్‌ను చూడలేదు.. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆనాడు వైఎస్సార్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కేసుల్లో సంతకాలు చేసిన మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారు. ఈ వాస్తవం కోర్టుకు వివరించే ప్రయత్నం చేశాను’ అని పొన్నవోలు వివరించారు. రాజధానిలో చంద్రబాబు భూదోపిడీ, వందల కోట్ల విలువైన సదావర్తి భూముల దోపిడీ, తెలంగాణలో ఓటుకు కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ తాను పోరాటం చేశానన్నారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం చూసి సీఎం జగన్ ఏఏజీగా అవకాశం కల్పించారన్నారు. క్విడ్ ప్రోకో అంటే వైఎస్సార్‌పై ఫిర్యాదు ఇచ్చిన శంకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కాదా అని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. షర్మిల చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై, సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొంత మంది పకోడిగాళ్లు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన భుజం మీద తుపాకీ పెట్టి సీఎం జగన్‌ను కాల్చాలని చూస్తున్నారని.. ఈ విషయం షర్మిల తెలుసుకోవాలన్నారు. -
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్‌ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
Advertisement