హ్యాట్రిక్ వీరులు

27 Mar, 2014 01:27 IST|Sakshi
హ్యాట్రిక్ వీరులు

కొనసాగిన హవా..!
టంగుటూరి అంజయ్య, సలావుద్దీన్ ఒవైసీల వరుస విజయూలు

 
 హైదరాబాద్‌లో ఐదోసారి సార్వత్రిక ఎన్నికలు 1972లో జరిగాయి. నగరంలో నాడు నియోజకవర్గాల సంఖ్య 11. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రుల హవా కొనసాగింది. గరీబోళ్ల బిడ్డ అంజయ్య, సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీలు ఈ ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగించారు. చాలా నియోజకవర్గాల్లో సంపూర్ణ తెలంగాణా ప్రజా సమితి(ఎస్‌టీపీఎస్) ద్వితీయ స్థానాల్లో నిలిచింది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 63.44 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 33.48 శాతం పోలింగ్ జరిగింది.     
 - సాక్షి,సిటీబ్యూరో
 
 ముషీరాబాద్
 ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కార్మికోద్యమ నేత టి.అంజయ్య 29,198 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన సీపీఐ అభ్యర్థి ఎం.ఏ. రజాక్ 8,834 ఓట్లు మాత్రమే సాధించారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి బి.పుల్లారెడ్డికి 6,091 ఓట్లు మాత్రమే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థి ఎం.నరసింహకు 740, మరో స్వతంత్ర అభ్యర్థివెంకట నర్సింగరావుకు 302 ఓట్లు లభించాయి. నమోదైన పోలింగ్ 48.56 శాతం.
 
 గగన్‌మహల్

 ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతాబాయ్ తాల్‌పాలికర్ 14,721 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి జి.నారాయణరావు 9,028 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. భారతీయ జనసంఘ్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రావు 4,983 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి మీర్జా జమీల్ అహ్మద్ బేగ్‌కు 2,720 ఓట్లు లభించాయి.  పోలింగ్ శాతం 50.82.
 
 మహరాజ్‌గంజ్
 ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.లక్ష్మీనారాయణ 16,562 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి పార్టీ అభ్యర్థి బద్రీ విశాల్ పిట్టి 15,424 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి పి.రామస్వామికి 4,235 ఓట్లు లభించాయి. మరో స్వతంత్ర అభ్యర్థి కె.ఎం.అన్సారీకి 1182 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 52.88 శాతం ఓట్లు పోలయ్యాయి.
 
 సీతారాంబాగ్

 ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి షాఫియూర్ రహమాన్ 16,844 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థి సోమ యాదవరెడ్డి 14,898 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బిదా బిల్ గ్రామి 10,059 ఓట్లతో తృతీయస్థానానికి పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి అహ్మద్ హుస్సేన్ 3554 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో 50.34 శాతం పోలింగ్ జరిగింది.
 
 మలక్‌పేట్
 కాంగ్రెస్ అభ్యర్థిని బి.సరోజినీ పుల్లారెడ్డి 23,164 ఓట్లు సాధించి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి గురులింగం సత్తయ్య 11,230 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. మరో స్వతంత్ర అభ్యర్థి ఖాజా అబు సయిద్ 8,355 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. పోలింగ్ శాతం 60.68.
 
 యాకుత్‌పురా
 ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 26,621 ఓట్లు సాధించి గెలుపొందారు. భారతీయ జనసంఘ్ పార్టీ అభ్యర్థి ఆర్. అంజయ్య 10,082 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎం.ఖాన్ 8,667 ఓట్లతో తృతీయ స్థానానికే పరిమితమయ్యారు. మొత్తంగా 63.44 శాతం ఓట్లు పోలయ్యాయి.
 
 చార్మినార్
 ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సయిద్ హసన్ 15,341 ఓట్లు సాధించి విజయం సొంతం చేసుకున్నారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి ఎస్.రఘువీర్‌రావు 5,591 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవాబ్ తాహర్ అలీఖాన్ 5,368 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి లాయక్ అలీఖాన్ 5,169 ఓట్లు సాధించారు. పోలింగ్ శాతం 52.41.   
 
 సికింద్రాబాద్
  కాంగ్రెస్ అభ్యర్థి ఎల్.నారాయణ 17,856 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణా ప్రజా సమితి అభ్యర్థి జి.ఎం. అంజయ్య 8,885 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి సుదర్శనరావుకు 2,492 ఓట్లు దక్కాయి. నమోదైన పోలింగ్ శాతం 48.12.
 
  ఖైరతాబాద్
 ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం కృష్ణారావు 18,392 ఓట్లతో గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి ఇ.వి.పద్మనాభన్ 10,970 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. సీపీఐ అభ్యర్థి పి.నాగేశ్వరరావు 3,260 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. మొత్తంగా 45.49 శాతం ఓట్లు పోలయ్యాయి.
 
 ఆసిఫ్‌నగర్
 ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ రహ్మత్ అలీ 15,074 ఓట్లతో గెలుపొందారు. ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఇస్మాయిల్ జరీ 12,364 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థి జి.సత్యనారాయణకు 5,566 ఓట్లు దక్కాయి. పోలింగ్ శాతం 50.34.
 
 కంటోన్మెంట్
 ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని వి.మంకమ్మ 18,891 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి బి.ఎం.నర్సింహ 11,187 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎస్.జగన్నాథ ం 1,976 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. 33.48 శాతం పోలింగ్ జరిగింది.
 
 నిత్య వార్త  సత్యవాక్కు
 ముస్లింలకు మేలు
 చేసింది వైఎస్సే: అసదుద్దీన్
 తపనంతా ప్రజాశ్రేయస్సు
 తన పర భేదం లేని మనస్సు
 అందరికీ ఆప్తుడైన
 మేరునగధీరుడాయన...
 అండగా ఉండే పాలనకు
 ‘మేలు’కొలుపాయన...
 రాజన్నంటే... యుగానికొక్కడు...
 రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు...
 తను లేడంటే నమ్మలేం...
 తలవకుండా ఉండలేం...
 
 చంద్రబాబు అభివృద్ధి చేసింది
 జూబ్లీహిల్స్ మాత్రమే... చిరంజీవి
 అన్నపూర్ణ వగైరా స్టూడియోలు...
 అపోలో వంటి ఆసుపత్రులు...
 సింగారాల కొండలు...
 సినీ ప్రపంచపు సందళ్లు...
 చిన్నబోతాయి...
 చిరాకుపడతాయి...
 గుట్టల్ని చదును చేసి
 కొండల్ని పిండి చేసి
 రూపమిచ్చి... ఊపునిస్తే...
 ఎవరయ్యా ఆ బాబు...
 ఏమిటాయన తెచ్చిన డాబు?
 అంటూ కళ్లెర్రజేస్తాయి...
 18 మురికివాడల ఫిలింనగరి...
 పత్తాలేని అభివృద్ధికి ఏ బాబు... జవాబుదారి?
 - ఎస్. సత్యబాబు