కౌంటింగ్ ఏజెంట్లకు భద్రత కల్పించండి:లెఫ్ట్ పార్టీలు | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ ఏజెంట్లకు భద్రత కల్పించండి:లెఫ్ట్ పార్టీలు

Published Thu, May 15 2014 6:39 PM

Protect counting agents, ask left front to Election commission

కోల్ కతా:పశ్చిమ బెంగాల్ లో కౌంటింగ్ సందర్భంగా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు ఆరోపించాయి. రేపు విడుదలయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు గాను వామపక్ష పార్టీలు ఈసీ ఫిర్యాదు చేశాయి. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లుకు తగిన భద్రత కల్పించాలని విన్నవించారు. ఇప్పటివరకూ అధికారిక పార్టీకి మినహా మిగతా పార్టీల ఏజెంట్ల ఎవ్వరికీ తగిన భద్రతను కల్పించలేదని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమాన్ బోస్ ఈసీ దృష్టికి తీసుకువచ్చారు.

 

ఒకవేళ అక్కడ పరిస్థితులు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే మాత్రం తమ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ బూత్ ల్లోకి బయట వ్యక్తులకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఈసీ తెలిపారు. తప్పకుండా తమ ఏజెంట్లకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం పశ్చిమ బెంగాల్ 48 ప్రాంతాల్లోని 69 కేంద్రాల్లో ఉదయం 8. గం.లకు పోలింగ్ ఆరంభకానుంది.

Advertisement
Advertisement