నడిపేది మైనింగ్ మాఫియానే | Sakshi
Sakshi News home page

నడిపేది మైనింగ్ మాఫియానే

Published Tue, Apr 1 2014 1:42 AM

నడిపేది మైనింగ్ మాఫియానే - Sakshi

 ఒడిశా సర్కారుపై రాహుల్ ఆరోపణలు

 కోరాపుట్ (ఒడిశా): ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒడిశా ప్రభుత్వాన్ని మైనింగ్ మాఫియానే నడుపుతోందని ఆరోపించారు. గిరిజనులతో పాటు ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని, వారి అభివృద్ధి కోసం కృషి చేసింది కూడా తామే అన్నారు.

సోమవారం ఒడిశాలోని గిరిజన ప్రాంతాలైన కోరాపుట్, నబరంగ్‌పూర్ ప్రాంతాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజనులకు పవిత్రమైన నియమ్‌గరి కొండలను ఓ కంపెనీకి ఇచ్చేందుకు బీజేడీ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే దీనిని అడ్డుకుని నియమ్‌గిరి కొండలను, అక్కడి గిరిజనులను కాపాడిన పార్టీ తమదే అన్నారు. ఇక్కడి ఖనిజ సంపదపై గిరిజనులకు మాత్రమే హక్కుందన్నారు.
 

Advertisement
Advertisement