స్పీడ్‌గా... ‘పోస్టల్ బ్యాలెట్ | Sakshi
Sakshi News home page

స్పీడ్‌గా... ‘పోస్టల్ బ్యాలెట్

Published Thu, Apr 24 2014 3:42 AM

speed postal ballet

కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోస్టల్ బ్యాలెట్ కోసం  గడువు చివరి రోజైన బుధవారం ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రతీ ఒక్కరు శిక్షణలో దరఖాస్తుతోపాటు, ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో 97శాతం అమలుకు నోచుకున్నాయి. దీంతో కేవలం 524మంది ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
 
 గతంలో మాదిరి కాకుండా ఈసారి అందరిచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగింపజేస్తామన్న కలెక్టర్ ఆలోచన ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఇక నాలుగు రోజుల శిక్షణకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 24,806ఉద్యోగులను కేటాయించారు. వీరిలో రోజూ కొంత మంది చొప్పున ఆయా నియోజకవర్గాల్లో శిక్షణకు హాజరవుతూ, దరఖాస్తుతోపాటు, ఓటు హక్కును సైతం వినియోగించుకొంటున్నారు. ఇంత వరకు 10,286మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోగా, గడువు ముగిసే నాటికి పోస్టల్ బ్యాలెట్ కోసం 13,996మంది ఉద్యోగులు దరఖాస్తులు చేసుకొన్నారు.  
 
 ఇంకా 524మంది మాత్రమే దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరి కోసం గడువును పెంచుతారా, లేక వదిలేస్తారానేది కలెక్టర్ నిర్ణయం మీద అధార పడి ఉంది.
 
 మూడో రోజు
 4167పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నమోదు
 ఇది ఇలా ఉండగా పోస్టల్ ఓట్ల పోలింగుకు సంబంధించి మూడో రోజైన  బుదవారం జిల్లా వ్యాప్తం గా అన్ని నియోజకవర్గా ల్లో 6,102మంది ఉద్యోగులు హాజరు కావాల్సి ఉండగా, వారిలో 4,167 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గత రెండు రోజుల కంటే మూడో రోజు ఓటింగ్ శాతం పెరగడంతో ఏకంగా 68శాతం నమోదైంది. ఇక అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 559 నమోదు కాగా, రెండోస్థానంలో వనపర్తి 516మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఇక అత్యల్పంగా దేవరకద్రలో 132మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ పోలింగుకు గురువారం చివరి రోజు కానుంది. ఆ రోజు అధికంగా హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.
 

Advertisement
Advertisement