కార్యకర్త అవతారమెత్తిన ఆర్టీ ఛీ...అధికారి | Sakshi
Sakshi News home page

కార్యకర్త అవతారమెత్తిన ఆర్టీ ఛీ...అధికారి

Published Tue, Apr 29 2014 1:29 AM

tdp leaders Vote workers Pressure

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆయనొక ప్రభుత్వ ఉద్యోగి. ఎస్.కోట ఆర్టీసీ డిపోలో కీలక అధికారి. కానీ, బుద్ధి గడ్డి తిం ది. ఒళ్లంతా రాజకీయాన్ని పులుముకుని, టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ ఆ పార్టీకి ఓటు వేయాలని ఉద్యోగులు, కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారు. డిపోలో కనిపించే ప్రతీ ఒక్కరికీ ఇదే చెబుతున్నారు. కొంతమంది ఎదురుతిరిగినా నిస్సిగ్గుగా ప్ర చారం చేస్తున్నారు. తాము చెప్పినట్టు వేయకపోతే ఏదో ఒక విషయంలో  ఇరికించేస్తానని బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో నరకం అనుభవించిన అన్ని వర్గాల వారు టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులో ఆర్టీసీ కార్మికులు మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఆపార్టీ పేరు చెబితేనే ఉద్యోగులు, కార్మికులు హడలెత్తిపోతారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలన్న బాబు కుట్రకు వ్యతిరేకంగా 25 రో జుల పాటు తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు. ఆ సందర్భంగా బాబు ఆర్టీసీ కార్మికులకు నరకం చూపించారు.
 
 విధులకు హా జరుకాని వారి ఇళ్లకు వెళ్లి మరీ అరెస్ట్‌లు చేయించారు. రోడ్లపై పరుగులు తీయించారు. దీంతో సమ్మె కాలంలో వారు బంధువుల ఇళ్లలో దాక్కోవలసి వచ్చింది. 25రోజుల సమ్మె కాలంలో పైసా ఇవ్వకుండా మోసం చేశారు. రెగ్యులరేషన్ జోలికెళ్లకుం డా కాంట్రాక్ట్ సిబ్బందితో పోస్టులు భర్తీ చేయడం, సాధ్యం కాని విధంగా ఆక్యుపెన్సీ రేషియో పెంచాలంటూ చేసిన ఒత్తిళ్లు గుర్తుకొస్తేనే ఆర్టీసీ సిబ్బంది ఉలిక్కి పడుతున్నారు. గత అనుభవాలన్నీ దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చంద్రబాబును నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలన తర్వాత వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకపోయితే తామంతా వీధిన పడే వారమన్న అభిప్రాయం ఆర్టీసీ ఉద్యోగుల్లో ఉంది. దీంతో చంద్రబాబుపై దాదాపు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారు.
 
 అయితే శృంగవరపుకోట ఆర్టీసీ డిపోలోని ఓ కీలక అధికారికి అప్పటి ఘోరాలేవీ గుర్తులేవు. బహుశా అధికారి కావడంతో తనకెటువంటి హానీ జరగదన్న ఉద్దేశమో ఏమో గానీ టీడీపీపై వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు. విధి నిర్వహణ సమయంలో ఆ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ కనిపించిన ఉద్యోగులందరిపైనా ఒత్తిడి చేస్తున్నారు. బస్సులన్నీ రాత్రి డిపోకి చేరిన తరువాత విధులు ముగించుకుని సిబ్బంది ఇళ్లకు వెళ్లేటప్పుడు అందర్నీ పిలిచి మరీ తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. తన అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. ఈ సందర్భంలో కొందరు ఉద్యోగులు, కార్మికులు తిరగబడుతున్నా అవేవీ పట్టించుకోకుండా నిస్సిగ్గుగా  ప్రచారం చేస్తున్నారు.
 
 కాదూ కూడదంటే ఏదొక విషయంలో ఇరికించేస్తానని బెదిరిస్తున్నారు. దీంతో ఉద్యోగ, కార్మికులు చెప్పినదంతా సావధానంగా విని, బయటికొచ్చి తిట్టుకుంటున్నారు. ఆయన నస భరించలేని కొందరు కార్మికులు మీడియాకు ఫోన్ చేసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఆయనపై విచారణ జరిపితే తామంతా వాస్తవాన్ని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మనసులో అభిమానం ఉండొచ్చు గాని బాధ్యత గల ప్రభుత్వాధికారి ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సంస్థ పరిధిలో ప్రచారం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement