కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల ధర్నా | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల ధర్నా

Published Wed, May 14 2014 3:16 AM

కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల ధర్నా

 సాక్షి, విజయవాడ/నందిగామ : ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను అనుమతించకపోవడంతో వారంతా మంగళవారం ధర్నా నిర్వహించారు. విజయవాడ డివిజన్‌కు సంబంధించిన నియోజకవర్గాల ప రిధిలో ఓట్ల లెక్కింపును  సిద్ధార్థ మహిళా కళాశా ల ఆవరణలో నిర్వహించారు. అభ్యర్థులకు ఎన్నికల కౌటింగ్ పై నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఒక్కొక్క ఎంపీటీసీ అభ్యర్థి వెంట ఒ క్కొక్క ఏజెంటును అనుమతిస్తామంటూ అధికారులు చెప్పారు.

దీంతో విజయవాడ డివిజన్‌లోని  జగ్గయ్యపేట, నందిగామ తదితర నియోజక వర్గాల నుంచి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఎనిమిది గంటలకే కళాశాల వద్దకు చేరుకున్నారు. ‘అభ్యర్థి లేదా ఏజెంట్‌లలో ఎవ రో ఒకర్ని మాత్రమే పంపిసాం, జెడ్పీటీసీ అభ్యర్థుల వెంట ఏజెంట్లను పంపుతాం’అని పోలీ సులు అడ్డుచెప్పారు. దీంతో ఎంపీటీసీ అభ్యర్థుల వెంట వచ్చిన ఏజెంట్లంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు దిగారు. తమకు ఇచ్చిన గుర్తింపు కార్డులు చూపిస్తూ నిరసన తెలియజేశారు.

కేవలం అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తామని ముందుగానే చెప్పి ఉండాల్సిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభ్యర్థులు చదువుకుని ఉండరని, అటువంటివారికి ఏజెంటే అన్నీ చూసుకుంటారని, ఇప్పుడు  ఎవరో ఒకరే అంటే ఎలాగం టూ  నిలదీశారు. సుమారు 10 గంటల వరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించి, ఏజెంట్లను పంపే అవకాశం లేదంటూ తేల్చి చెప్పారు.

అయినప్పటికీ ఏజెంట్లు తమ నిరసన వీడకపోవడంతో జాయింట్ కలెక్టర్ మురళి జో క్యం చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జెడ్పీటీసీ ఓట్లు ఎక్కువగా ఉండడంవల్ల ఏజెం టును అనుమతించాలని,  ఎంపీటీసీకి ఆ పరి స్థితి లేనందున ఏజెంటు అవసరం లేదని ఎన్నికలు నిబంధనలు చెబుతున్నాయని వివరించారు. అభ్యర్థి విశ్రాంతి కోసం బయటకు వ స్తే ఆయనకు బదులుగా ఏజెంటు కౌటింగ్ కేంద్రంలోకి వెళ్లవచ్చని నిబంధనలు చెబుతున్నాయన్నారు. నిబంధనలను పాటించేందుకు సహకరించాలనడంతో ఏజెంట్లు ధర్నాను విరమిం చారు.
 
 సౌకర్యాలు లేక నానా అగచాట్లు!
 ఒకవైపు మండుటెండ, మరోవైపు కౌటింగ్ కేం ద్రంలో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా లభించని పరిస్ధితి ఏర్పడింది. బయటకు వెళ్లి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి కౌటింగ్ కేం ద్రంలోకి రాబోయే అభ్యర్థుల ప్రతినిధుల్ని పో లీసులు అడ్డుకున్నారు. దీంతో కౌటింగ్ కేం ద్రాల్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులు, అభ్యర్థు లు, ఏజెంట్లు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం జాయింట్ కలెక్టర్ మురళి దృష్టికి తీసుకువెళ్లగా తాము అభ్యర్థులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వలేదని, మం చినీటి సౌకర్యం అభ్యర్థులే చూసుకోవాలం టూ చెప్పారు. కేవలం డ్యూటీలో ఉన్న సిబ్బందికి మాత్రమే తాము సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పారు. మండుటెండలో మంచినీరు లేక సా యంత్రం వరకు అనేక ఇబ్బందులు పడ్డారు.

 సౌకర్యాలు లేక నానా అగచాట్లు!
 కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లకు భోజనాలకు అధికారులు టోకెన్లను ఇచ్చారు. ప్రింట్ మీడియా విలేకరులకు మాత్రం  సౌక ర్యాలు కల్పించలేదు. వార్తల సేకరణకు లో పలి కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement
Advertisement