టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల పార్టీ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల పార్టీ

Published Thu, Apr 3 2014 1:04 AM

టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల పార్టీ - Sakshi

సాధారణ ఎన్నికల్లో గెలవలేదు: వరంగల్ ప్రజాగర్జనలో చంద్రబాబ

వరంగల్: ‘తెలంగాణ రాష్ట్ర సమితి ఉప ఎన్నికల పార్టీ. సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఎప్పుడూ గెలవ లేదు. కేసీఆర్ మోసగాడు.. వసూళ్ల రాజా.. మాట తప్పే మనిషి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం అప్పగిస్తా అని అంటూనే తెలుగుజాతిని మళ్లీ కలుపుతా అని చంద్రబాబు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభ బుధవారం జరిగింది.

ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘కేసీఆర్ మోసగాడు.. మాటలు చెబుతాడు.. తెలంగాణ రాదనే ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రంలో కూలీ పని చేస్తా అన్నాడు. ఇప్పుడు రాష్ట్రం వచ్చాక మేస్త్రీ పని చేస్తా అంటున్నాడు. తెలంగాణ రాదనుకుని ‘ఎస్సీని ముఖ్యమంత్రి, మైనారిటీని ఉప ముఖ్యమంత్రి చేస్తా’ అన్నాడు. తెలంగాణ వచ్చాక మాట మార్చాడు. రోజుకో మాట చెబుతున్నాడు. తెలంగాణ తన వల్లే వచ్చిందని ఒంటెలు, ఏనుగులపై ఊరేగాడు. వారం తర్వాత కాంగ్రెస్ మోసం చేసిందని... పూర్తి తెలంగాణ ఇవ్వలేదని అన్నాడు. ఇప్పుడు రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులనైనా జైల్లో పెడతానంటున్నాడు. ఫామ్‌హౌజ్‌లో పడుకుని ఎకరానికి కోటి రూపాయల లాభం అంటున్నాడు.

13 ఏళ్లలో జరిగిన అవినీతిని వెలికితీస్తే కేసీఆర్ కుటుంబం శాశ్వతంగా జైల్లోనే ఉంటుంది. కేసీఆర్ వసూళ్ల రాజా. కుటుంబంలో ఒకరికి సినిమాలు, మరొకరికి కాలేజీలు, ఇంకొకరికి వ్యాపారం అప్పజెప్పాడు.’ అని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రజలు అన్యాకాంత్రం అవుతారని హెచ్చరించారు. ‘తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు. కేంద్ర మంత్రిగా ఉండి ఒక్క ఊరికి ఒక్క పనీ చేయలేదు. నేను సవాల్ చేస్తున్నా.. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమిటో చెప్పాలి. నేను మా ఊరిని అభివృద్ధి చేయలేదు.


దరాబాద్‌ను అభివృద్ధి చేశా. తెలంగాణను వదలను. ఇక్కడే ఉంటా. బీసీలకు రాజ్యాధికారం అప్పగిస్తా. తెలుగుజాతిని మళ్లీ కలుపుతా’ అని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ సాధన ఘనత అమరవీరులకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని... ఈ విషయాన్ని ఆయనే చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కువ శాతం జనాభా బీసీ వర్గాల వారేనని, తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. సోనియాగాంధీ దుష్ట రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పార్టీ అని విమర్శించారు. గిట్టని వారిపై సీబీఐని ప్రయోగిస్తుందని వ్యాఖ్యానించారు. ‘రజనీకాంత్ రోబో యాక్టివ్‌గా ఉంటుంది. సోనియా రోబో(ప్రధాని మన్మోహన్) అవినీతి, అసమర్థ రోబో.. కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో దేశం, రాష్ట్రం వెనక్కిపోయాయి’ అని అన్నారు. భవిష్యత్తులో టీడీపీ జాతీయ పార్టీగా ఉంటుందన్నారు.
 
 

Advertisement
Advertisement