జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం | Sakshi
Sakshi News home page

జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం

Published Fri, May 2 2014 1:30 AM

జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం - Sakshi

  •      ఆయన వెంటే జనం
  •      ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు
  •      వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  •  గాజువాక, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజలు ఆయన వెంటే ఉన్నారని, యువకులు, మహిళలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. గాజువాక దరి శ్రీనగర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.

    జగన్ అధికారం చేపట్టిన తర్వాత పరిపాలన మహిళలకు అప్పగించనున్నారన్నారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. ప్రతి గ్రామంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రారంభించి పది మంది చొప్పున మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 20 వేల మంది మహిళలకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయన్నారు.

    బీసీల రిజర్వేషన్లలో ఎలాంటి కోత లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బీసీ కోటా పెంచి కాపులను కూడా బీసీల్లో చేర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారన్నారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు మాటలు తప్ప కార్యాచరణ ప్రకటించలేదన్నారు. ఎన్నివేల కోట్లు ఖర్చు చేసైనా విశాఖ జిల్లాను కాలుష్య రహితంగా అభివృద్ధి చేసేందుకు జగన్ మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు.

    దీని కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా విజయమ్మ, ఎమ్మెల్యేగా నాగిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 61వ వార్డు వైఎస్సార్‌సీపీ నాయకుడు సిద్ధా సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాజువాక అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు భూపతిరాజు శ్రీనివాసరాజు, నాయకులు గొంతిన వెంకట రమణ, టి.వి.వి.దొరబాబు, వారణాసి దినేష్‌రాజు, రాజాన రామారావు, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, కటికల కల్పన, వర్మ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement