జగన్ పాలనతోనే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

జగన్ పాలనతోనే అభివృద్ధి

Published Wed, Apr 23 2014 1:02 AM

జగన్ పాలనతోనే అభివృద్ధి - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి సా ధ్యమని ఆ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం పట్టణంలోని హోటల్ ఎస్‌వీఎన్ లేక్ ప్యాలెస్‌లో రోటరీ క్లబ్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వారి సమక్షంలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అక్క డే రా జీనామా పత్రంపై సంతకం చేసి,ఆ పత్రాన్ని శాసన మండలి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదివిని అనుభవించడం సమంజసం కాదనే ఎమ్మెల్సీ పదవికి రా జీనామా చేసినట్టు తెలిపారు. రెండు రోజుల క్రితమే తాను ఈ పని చేసే వాడినిని పట్టణంలో పెద్దలుగా ఉంటున్న వారి సమక్షంలో రా జీనామా చేయాలనే యోచనతో ఇప్పటివరకు ఆగినట్టు వివరించా రు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. 
 
 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని చూశారని అదే తరహాలో ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆ పార్టీని ఆదరించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే మాటలు న మ్మే స్థితిలో ప్రజలు లేరని, గతంలో ఆయన పరిపాలనా విధానమే అందుకు కారణమని ఎద్దేవాచేశారు. స్వేచ్ఛగా, నిజాయితీగా ప్రజా సేవ చేసేందుకు ప్రజాభీష్టం మేరకు వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. తాను ఏ పదవిలో ఉన్న, లేకున్నా ఎవరికి ఏపని కావాలన్నా..ఉచితంగా సేవ చేశానన్నారు. 2009 వరకు తన హయాం లో జరిగిన అభివృద్ధి, తన తరువాత వచ్చిన అశోక్ చేసిన అభివృద్ధి ఏమిటో  బేరీజు వేసుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనను, పార్లమెంట్ అభ్యర్థిగా బేబీనాయనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు అనిల్ కుమా ర్, రాజశేఖర్, రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ అధ్యక్ష, కార్యదర్శులు జి.శివకుమార్, రామారావు, విజయ, గీత, పాల్గొన్నారు. 

Advertisement
Advertisement