కుప్పం అభివృద్ధిపై వైఎస్ ముద్ర | Sakshi
Sakshi News home page

కుప్పం అభివృద్ధిపై వైఎస్ ముద్ర

Published Tue, May 6 2014 1:17 AM

కుప్పం అభివృద్ధిపై వైఎస్ ముద్ర - Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం అయినప్పటికీ కుప్పం అభివృద్ధికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారు. చంద్రబాబు హయాంలో కుప్పంలో కాలేజీ విద్య ఇంటర్మీడియట్ వరకే ఉండేది. వైఎస్ సీఎం అయ్యాక డిగ్రీ, ఐటీఐ, వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేశారు. ప్రతి వుండలంలో కస్తూర్బా పాఠశాలలను ప్రారంభించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు.. విద్యార్థినులకు ప్రత్యేక హాస్టళ్లను నెలకొల్పారు. బాబు పాలనలో నియోజకవర్గానికి ఏటా 300 పక్కాగృహాలు మాత్రమే మంజూరయ్యేవి. వైఎస్ హయాంలో 40 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆరు వేలకు పైగా పింఛన్లు మంజూరు చేశారు. బాబు హయాంలో పది వేల రేషన్‌కార్డులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్యను వైఎస్ 25 వేలకు పెంచారు.

కుప్పం ప్రజల చిరకాల కోరిక అరుున పాలారు ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకాలకూ కుప్పంలోనే బీజం వేశారు. 2004 ఫిబ్రవరిలో స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద జరిగిన ఎన్నికల సభలో తాము  అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఫైల్‌పై మొదటి సంతకం చేసామని వైఎస్ ప్రకటించారు. అలాగే 2006 డిసెంబర్‌లో బైపాస్‌రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభ కు సీఎం హోదాలో హాజరైన వైఎస్... ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement