వైఎస్‌ఆర్ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం

Published Tue, Apr 22 2014 6:05 AM

ysr schemes only possible with ys jagan mohan reddy

 బోధన్,న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే సాధ్యమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లోనే అన్నదాతలను అన్ని విధాలా ఆ దుకుని అండగా నిలిచారన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించారన్నారు. వైఎస్‌ఆర్ మరణానంతరం రైతుల బాధలు పట్టిం చుకునే వారే కరువయ్యారని అన్నా రు.
 
పండించిన పంటలను అ మ్ముకునేందుకు రైతులు నానా అ వస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందక ఆర్థికంగా నష్టపోతున్నా ఎవరికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైఎస్‌ఆర్‌ను ఆదర్శంగా తీసుకుని, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచానని అన్నారు. వై ఎస్‌ఆర్ పథకాలు అమలు కేవలం త మ పార్టీతోనే సాధ్యమవుతుందన్నా రు.దేశంలో ఎ క్కడా లేని విధంగా వైఎస్‌ఆర్ అనేక సంక్షేమ పథకా లు ప్రవేశ పెట్టి ప్రజ ల గుండెల్లో నిలిచారన్నారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు చె ప్పారు.  
 
పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రా జెక్టులతో పాటు కొత్త రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.  ఎన్నికల్లో గెలిస్తే వాటిని అమలు చేసి చూపిస్తానని అన్నారు. పెండింగ్‌లో ఉన్న బోధన్ నుంచి బీదర్ రైల్వేలైన్ పూర్తి చేయిం చేందుకు కృషి చేస్తానన్నారు. వ్యవసాయరంగంతో పాటు, సాంకేతిక విద్య అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.  తనను ఎంపీగా, బోధన్ ఎ మ్మెల్యేగా సుదీప్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Advertisement
Advertisement