‘సార్వత్రికా’నికి వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధం | Sakshi
Sakshi News home page

‘సార్వత్రికా’నికి వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధం

Published Mon, Mar 31 2014 2:34 AM

ysrcp ready to general elections

సాక్షి ప్రతినిధి,  నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతోపాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ సీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పేదల తరపున పోరాటాలు నిర్వహించిన పార్టీ ప్ర జలకు మరింత చేరువ కానుంది. ఇందులో భాగంగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు వీలుగా సమన్వయకర్తలను నియమించింది.

 కొత్తగా వీరే
 రెండు రోజుల క్రితం జహీరాబాద్ లోక్‌సభ, బోధన్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరో ముగ్గురు సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గానికి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రూరల్ నియోజకవర్గానికి బొడ్డు గంగారెడ్డి (సిర్పూరు) సమసన్వయకర్తలుగా వ్యవహరిస్తారని అందులో పేర్కొన్నారు.

 చురుకైన నాయకులు
 బోధన్‌కు చెందిన రవీందర్‌రెడ్డి క్రియాశీలక రాజకీయాలలో ఉంటూ వైఎస్‌ఆర్ సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. యువనాయకుడు అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి విద్యా ర్థి, యువజన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. డిచ్‌పల్లి ఎమ్మెల్యేగా పని చేసిన అంతిరెడ్డి బాల్‌రెడ్డి కుమారుడైన శ్రీధర్‌రెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు.

 వైఎస్‌ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ మండలం సిర్పూరుకు చెందిన బొడ్డు గంగారెడ్డి (సిర్పూరు) జలగం వెంగళరావు కాలంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సర్పంచ్‌గా, ఎంపీటీసీ, పనిచేసిన ఆయన సతీమణి బొడ్డు సుచరిత ఎంపీపీగా పనిచేశారు. సిర్పూరుకు రోడ్డు వేయడం కోసం ఉద్యమాలు నిర్వహించి సిర్పూరు గంగారెడ్డి పేరు తెచ్చుకున్నారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి మహమూద్ మొహి యొ ద్దీన్, బోధన్‌కు ఎంఏ ఖాన్, కామారెడ్డికి చిల్కూరు కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డికి పటోళ్ల సిద్దార్థరెడ్డి, జుక్కల్‌కు నాయుడు ప్రకాశ్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నా యుడు ప్రకాశ్ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన పార్టీ కసరత్తు చేస్తుండటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.

Advertisement
Advertisement