నన్నడగొద్దు ప్లీజ్‌ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Tue, Sep 26 2017 12:27 AM

 love doctor solve the problems

హాయ్‌ సార్, నేను ఒక అమ్మాయిని మూడునెలల నుంచి లవ్‌ చేస్తున్నాను. తనూ నన్ను లవ్‌ చేస్తోంది. కాని తనకు హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌ అని చెప్పింది. రిపోర్ట్స్‌ కూడా చూపించింది. నేను తనని మ్యారేజ్‌ చేసుకోవచ్చా? తనకి వాళ్ల ఫాదర్‌ వల్ల వచ్చిందట. మందులు తీసుకోవడం వల్ల తగ్గుతుందా సార్‌? ప్లీజ్‌ హెల్ప్‌ మీ సార్‌. – శ్రీహరి

హరి, కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. మొదటిది హెచ్‌ఐవీ పాజిటివ్‌కి సంక్రమణ గుణం ఉంది. ‘కలయిక’ తో సంక్రమిస్తుంది. నువ్వు ప్రేమించిన వాళ్లకి కొత్త జీవితం ఇవ్వాలనుకోవడం ఆదర్శప్రాయమయినదే కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే పెళ్లయ్యాక మీ ఇద్దరి మధ్య కలయిక జరగకుండా ఉంటుందా? ఏదో ఒక సమయంలో పరిస్థితి విషమించి ఒకవేళ హెచ్‌ఐవీ పాజిటివ్‌ దశనుంచి ఎయిడ్స్‌ దశకు చేరుకుంటే... అలా జరగాలని మనం కోరుకోకపోయినా, అలా జరిగితే ఆ సమయంలోనూ నిరంతరం ఒకరికొకరు తోడుగా ఉండి.. మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా నిలబడే శక్తి మనకుందా అని ఆత్మ విమర్శ చేసుకోవాలి! నువ్వేకాదు, నీ కుటుంబం కూడా అమ్మాయిని అదే గౌరవంతో చూసుకుంటుందన్న నమ్మకం నీకు ఉందా? సంతానం లేకుండా ఉండగలిగే నిగ్రహం నీకుందా? ఒకవేళ నీకు అలాంటి శక్తి ఉంటే ఒకసారి మంచి డాక్టర్‌ని సంప్రదించి నేను వ్యక్తం చేసిన విషయాలను నిర్ధారించుకుని నిర్ణయం తీసుకో శ్రీహరి అన్నయ్యా! ‘సార్‌ ఎంత మంచివాడు సార్‌ శ్రీహరి!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌  ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement