అమర్‌నాథ్‌ యాత్ర | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ యాత్ర

Published Sat, Feb 11 2017 4:13 AM

అమర్‌నాథ్‌ యాత్ర

మంచుకొండల్లో కొలువుదీరిన మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్‌ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తోంది. అదే ‘ఓం నమఃశివాయ’ శివ పంచాక్షరి మంత్రం. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అమర్‌నాథ్‌ ఒకటి. సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభువుగా వెలిస్తే ఒక్కసారే అవతరిస్తాడు. కానీ, అమర్‌నాథ్‌లో ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నాడు. అదీ మంచుతో, శివలింగ రూపంలో.

ప్రపంచంలోని అతి పెద్ద గుహలలో ఒకటి
కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్‌ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది  ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్‌ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం. జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది?! అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు.
మంచు మూర్తులు పార్వతి, గణపతులు
 అమర్‌నాథ్‌ గుహలో సహజంగా ఏర్పడే జ్యోతిర్లింగంతో పాటు, మరో రెండు చిన్న మంచు మూర్తులు కూడా కనిపిస్తాయి. వీటిని పార్వతి, గణపతులంటూ భక్తులు కొలుస్తారు. విచిత్రమేమంటే ఈ మూర్తులకు ప్రత్యేక ఆకారాలు ఉండవు. మంచు ముక్కల్లా మాత్రమే కనిపిస్తాయి. కాకపోతే మహాదేవుని లింగరూపం ఏర్పడిన సమయంలో మాత్రమే ఈ రెండు మంచు మూర్తులు కనిపిస్తాయి. ఆ తరువాత ఇవీ ఉండవు.

అమరనాథుడికి రెండు మార్గాలు
పిలిచిన పలికే అమర్‌నాథుడిని దర్శించుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. బల్దాల్‌ పహిల్‌గావ్‌ల నుంచి భోళా శంకరుడి దర్శనానికి వెళ్లవచ్చు. అయితే బల్దాల్‌ నుంచి గుఫాకు 18 కిలోమీటర్లు. ఇది చాలా కష్టమైన, క్లిష్టమైన దారి. ఇక పహిల్‌గావ్‌ నుంచి 45 కిలోమీటర్ల దూరం నుంచి మరో మార్గం ఉంది. అయితే కష్టమైనా దగ్గర ఉంటుంది కాబట్టి భక్తులు చాలా వరకు బల్దాల్‌ దారినే ఎంచుకుంటారు. ఈ దారి పొడువునే భక్తులు బారులు తీరుతారు. దీంతో ట్రాఫిక్‌ తీవ్రంగా జామ్‌ అవుతుంది. బల్దాల్, పహిల్‌గావ్‌... ఈ రెండు మార్గాల నుంచి గుర్రాలు అందుబాటులో ఉంటాయి.

క్షణంలో మారే వాతావరణం
 ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్‌నాథ్‌ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగానే పెరుగుతున్నారు. శంకరుడిని కళ్లారా చూసి మోక్షప్రాప్తికి తహతహలాడే వారు కొందరైతే, సరదాగా వెళ్లే వారు ఇంకొందరు. యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే... అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకుపోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్‌ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. ఇక కాలినడక ప్రారంభించే బల్దాల్, పహిల్‌గావ్‌ల వద్ద బస చేసేందుకు టెంట్లు, బండారీలు.. అంటే హోటళ్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ మన సామగ్రిని భద్రపరుచుకోవచ్చు. అక్కడి నుంచి కొండలు ఎక్కి గుహకు వెళ్లాలి. ఆ సమయంలో ఓ బ్యాగ్‌లో అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచుకోవాలి.

అమర్‌నాథ్‌ యాత్రలో ఖV టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌
  ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం. ఇంతటి అద్భుతమైన అమరనాథ్‌ యాత్రను గత 15 ఏళ్లుగా ఖV టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నికగన్న ఈ సంస్థ యాత్రికులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ ఖర్చుల విషయంలో సహకారాలను అందిస్తోంది. మీరు కూడా అమరనాథ్‌ యాత్ర చేయాలనుకుంటే తెలుగురాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నెన్నో దర్శనీయ ప్రదేశాలను, అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శింపజేసే తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్‌ ఖV టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ద్వారా జూన్‌ 14, జూన్‌ 30, జులై 5, 2017 తేదీలలో చేయవచ్చు. మరిన్ని వివరాలకు కోసం హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లి , ఆఒ్క ఆఫీస్‌ ఎదురుగా ఉన్న   ఖV టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ను సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement